Featuredస్టేట్ న్యూస్

సమాధులకు పునాదులు అయ్యా..ఎస్‌లు

  • 9 ఐఎఏస్‌లు
  • 13మంది డిప్యూటీ కలెక్టర్లు
  • 49 మంది అధికారులు
  • 2,875 ఫిర్యాదులు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

దేశ భవిష్యత్తును అద్భుతమైన రీతిలో నడిపించే దిశలో ఈ అధికారుల పాత్ర ముఖ్యమైనది. ఛాలెంజ్‌ చేసి చెపుతున్నాం. 9మంది ఐఏస్‌ అధికారులు ఈ కుంభకోణంలో భాగస్థులు. రాజకీయుల నీడలో ‘అయ్యా… మీరు చెప్పిందే ఎస్‌’ అంటూ ఐఏఎస్‌ లకు కళంకం తెచ్చారు. ఈ భూ కుంభకోణంలో వీళ్ళు పెద్దగా లాభపడింది కూడా ఏం లేదు. అంతా రాజకీయులు, అనుయాయులు మొత్తం జుర్రేస్సుకున్నారు. ఈ దేశంలో పేద, మధ్యతరగతి మనుషులు ఉన్నారనే కనీస జ్ఞానం మరిచినట్లున్నారు. వీళ్ళు మనుషుల మధ్యలో బతుకుతున్నారనే ఇంగితం కూడా కోల్పోయారు. ఓ ఐఏఏస్‌ కావడానికి భారత ప్రభుత్వం చేస్తున్న తొలి ఖర్చు లక్షా యాభై వేలు. ఆ తర్వాత మరో నాలుగు లక్షలు.. తర్వాత శిక్షణ కోసం మరో రెండు లక్షలు…వెరసి మొత్తం ఏడున్నర లక్షలు… ఆ తర్వాత మెహర్భానీలు.. ఇవన్నీ ప్రజలు చెల్లించే పన్నుల నుంచే మీ ఈ ఐఏఎస్‌ ¬దా.. అంటే… మీ బతుకు ప్రజలదే. మీలో రక్తం కూడా వారిదే. అలాంటిది మరి మీరేం చేస్తున్నారు… ఎవరికి ఊడిగం చేస్తున్నారు..?ఎందుకు చేస్తున్నారు..? అడిగేవారు లేరనా..? అడిగే దిక్కు లేదనా..? అసలు ‘దిక్కే’ లేదనా..? నిజాలను నిలబెట్టి.. నిగ్గదీసి అడుగుతాం. మీ అవినీతి బతుకులు నిర్మొహమాటంగా బయటపెడతాం. బయటపెట్టాల్సిన తరుణం వచ్చింది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశోధన కథనం.

ఆ ఘనాపాఠీలు 9మంది వీరే వారు..:

ఓ అధికారి, ఓ అజ్ఞాత వ్యక్తి..అంటూ కథనం ఎందుకు..? ‘సిగ్గులేకుండా’ వారి చేసిన పనికి ‘నిర్భయంగా’ వారి పేర్లను ఈ కథనంలో చెప్పుకుందాం. విశాఖ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ లుగా వారు పనిచేశారు. ఊహించని విధంగా ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేరు తప్పుల చిట్టాలో ఉంది. (అయినా జీర్ణించుకోవాలి). ఓ భూమి కేసులో ఆయన జాయింట్‌ కలెక్టర్‌ గా పనిచేసినప్పుడు ఆ తప్పు జరిగింది. ఆయనపై కఠిన చర్యలకు సిఫారసు కూడా జరిగింది. అది అటకెక్కింది. (అదో కథ. బయటకు రాకుంటే మరోసారి చెప్పుకుందాం.) విశాఖ కలెక్టర్‌ లుగా పనిచేసిన లవ్‌ అగర్వాల్‌, జే.శ్యామలరావు, సునీల్‌ శర్మలు ఈ ‘మకిల’ అంటిన వారిలో ఉన్నారు.

విశాఖలో జాయింట్‌ కలెక్టర్లుగా పనిచేసిన ఎంటీ కృష్ణబాబు, వీరబ్రహ్మయ్య, సందీప్‌ కుమార్‌, సుల్తానియాలు కూడా ఆ అవినీతి లెక్కలో ఉన్నారు. ఇక విశాఖలో డీఆర్‌ఓగా పనిచేసి ఐఏఎస్‌ పదోన్నతి పొందిన ఎస్‌.సత్యనారాయణపై కూడా కొన్ని కేసుల్లో ‘కఠిన చర్యలకు అర్హత’ ఉంది. మరో ఏడుగురు అధికారులపై కూడా ‘తీవ్రమైన అభియోగాలు’ ఉన్నాయి. నెలసరి వచ్చే జీతాలు చాలక ఈ నీచ బతుకులు ఏమిటో..?

క్యూలో వీళ్ళూ..: విశాఖలో డీఆర్‌ఓలు, ఆర్డీఓలుగా పనిచేసిన 13 మంది డిప్యూటీ కలెక్టర్‌ లకూ ఈ భూకుంభకోణంలో పాత్ర ఉంది. వీరిలో ఎక్కువగా ఆయా సందర్భాల్లో విశాఖ ఆర్డీఓలుగా పనిచేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉంటే, తహసిల్దార్‌, డిప్యూటీ తహసిల్దార్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, సర్వేయర్‌, వీఆర్వో, ఉప సబ్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌ లో అక్షరాలా 49 మంది రెవెన్యూ అధికారులపై కూడా భాగం ఉంది.

‘గంజి’కి లేదు…’బెంజి’ కొనేశారు: ఖాళీ జాగా కనిపిస్తే చాలు వీరు చాప చుట్టేస్తారు. అలాంటిది ఏకంగా ఎకరాల కొద్దీ భూమి…. చివరకు స్వాతంత్య్ర సమరయోధుల భూముల్నీ, మాజీ సైనిక ఉద్యోగుల భూముల్నౌ ఏదీ వదల్లేదు. అసలు నోరే లేని పేదోడి భూమికి ‘లేని నిబంధనలు’ సృష్టించి మరీ బజారుకు ఎక్కించి అయినకాడికో అమ్మేశారు. నోరున్నా… పరువుకోసం అరవ లేని, అరవడం తెలియని మధ్యతరగతి వాళ్ళ భూములకు రెక్కలొచ్చాయ్‌. రాజకీయులకు ఏంచక్కా సొమ్ములొచ్చాయ్‌. గంజికి లేక ఏ క్షణంలో అయినా ‘బిచాణా ఎత్తేసే’ దరిద్ర నాయకులు ఈ ‘కుంభకోణం పుణ్యమా’ అని ఏకంగా కోటి విలువ చేసే ‘బెంజి’ కార్లు కొన్నారు.

30వేల అడంగల్‌ పహణీలు ఎక్కడ…?: విశాఖపట్నం నగర శివారుల్లోని లక్షల కోట్ల విలువైన భూముల్ని ఎలా కబ్జా చేశారంటే… 30 వేల అడంగల్‌ కాపీలు మాయమయ్యాయి. ఈ విషయాలు వెలుగులోకి రాకుండా సంబంధిత రెవిన్యూ అధికారులు ఏ విషయం బయటకు పొక్క కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భూముల వివరాలు తెలియజేసే అధికారిక వెబ్సైట్‌ (రిజిస్ట్రేషన్‌.ఏపీ. జిఓవి.ఇన్‌)ని ఓపెన్‌ కాకుండా మంత్రాంగం నడిపారు. ఇక్కడే ఎక్కువ మంది దొరికారు.

రేపు చివరి కథనంలో..: అధికారుల పేర్లు ధైర్యంగా వెల్లడించాం కదా..! మరి రాజకీయుల పేర్లు వెల్లడించడానికి మాకు మొహమాటాల్లేవ్‌. ఉండవ్‌. బెదిరింపులకు లొంగేది లేద్‌. భయపడట్టాల్లేవ్‌. పెన్‌ పవర్‌ అంటే… నాట్‌ ఎ రియల్‌ ఎస్టేట్‌…

ఓన్లీ ఫోర్త్‌ ఎస్టేట్‌… దటీజ్‌ జర్నలిజం…. వెయిట్‌ అండ్‌ సీ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close