భావాలను చూపేదే ఫొటోగ్రఫీ ..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చీఫ్‌ ఫోటోగ్రాఫర్‌ పేట్‌ సౌజా..

0

హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరి భావాలను చాటిచెప్పి అందరిచేత మెచ్చుకునేలా చేసేదే ఫొటోగ్రఫీ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పేట్‌ సౌజా పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని గండిపేట మండలం నార్సింగిలోని ఓం ఓం కన్వెన్షన్‌ లో మూడు రోజులుగా జరిగిన ఆసియా అతిపెద్ద ఫొటో శిక్షణ శిబిరం పెప్‌ ఫొటో సమ్మిట్‌ 2019కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. సోషల్‌ మీడియా, సెల్‌ ఫోన్లు వచ్చాక ప్రతి సన్నివేశాన్ని ఫొటో రూపంలో భద్రపర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారన్నారు. బరాక్‌ ఒబామాకు హైదరాబాద్‌ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడి రద్దీ రోడ్లు, షాపింగ్‌ అంటే ఆయనకు ఎంతో మక్కువని చెప్పారు. కార్యక్రమంలో వివిధ దేశాలు రాష్ట్రాలకు చెందిన 1500 మంది ఫొటో గ్రాఫర్లు శిక్షణలో పాల్గొని మెలకువలు నేర్చుకున్నారు. వారు తీసిన ఫొటోలకు వచ్చిన స్పందనను పంచుకున్నారు. కార్యక్రమంలో వివిధ రకాల ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పాల్గొ న్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో షూట్‌ గ్యాలరీలో ఫొటోలు దిగుతూ, దించుతూ సందడి చేశారు. కార్యక్రమంలో పెప్‌ వ్యవస్థా పకులు జోసఫ్‌ రాధిక్‌ , జాషువా కార్తిక్తో పాటు పెద్దఎత్తున ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here