బిజినెస్

నూతన టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన ఫోర్డ్‌..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): డిజిల్‌ మరియు పెట్రోల్‌ ఇంజిన్లలో అందుబాటులోకి వచ్చిన 2020 ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ బిఎస్‌వి శ్రేణి వాహానాలను వినియోగదారులు పవర్‌ ఆఫ్‌ చాయిస్‌గా ఎంపిక చేసుకునే అవకాశాన్ని పోర్డ్‌ కల్పిస్తోంది. బిఎస్‌విఐకు అనుగుణమైన 2020 పెట్రోల్‌ ఇంజిన్‌ రకం 804.000 ప్రారంభ ధరలో డిజిల్‌ ఇంజిన్‌ వేరియెంట్‌ 854.000 ధరలో లభిస్తుంది. మార్జినల్‌ ధర వృద్దికి అనుగుణంగా మెరుగైన విలువను అందిస్తుంది. ఫోర్డ్‌ ఇండియా ఇప్పుడు 2020 ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ను అప్‌డేట్‌ అయిన భారత్‌ స్టేజ్‌ ఆరవ మిషన్‌ నియమాలకు అనుగుణంగా పెట్రోలు మరియు డీజిల్‌ ఇంజిన్లలో వరుసగా 804.000, 854.000లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోర్డ్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినయ్‌ రైనా మాట్లాడుతూ మా వినియోగదారులు కోరుకున్న మరియు విలువలకు తగిన ఉత్పత్తులు మరియు సాంకేతికతలను ఫోర్డ్‌ ఈ వర్గంలో అత్యుత్తమ డీజిల్‌ ఇంజిన్‌లలో చాలా వరకు పాత ధరల్లేసే అందిస్తోందని తెలిపారు. తన పూర్తి శ్రేణిని కొనసాగిస్తూ, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ అన్ని కాంప్యాక్ట్‌ ఎస్‌యువి వినియోగదారులకు ఎంపిక చేసుకునే వాహనంగా నిలువనుందని మరియు వారి విస్తృత అవసరాలను భర్తీ చేయనుందని తెలిపారు. 2020 ఎకోస్పోర్ట్‌ ఫోర్డ్‌ వారి విశ్వసనీయత, దీర్ఘకాలిక మన్నిక బిఎస్‌విఐ నిబంధనలకు అనుగుణంగా 1.5 లీటర్‌ టిడిసిఐ డీజిల్‌ ఇంజిన్‌తో అది బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ 100 పిఎస్‌ మరియు 215 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుందన్నారు. ఈ డీజిల్‌ ఇంజిన్‌ పైవ్‌ స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి వచ్చింది. దాని నగదుకు తగిన విలువ గుణాన్ని బలోపేతం చేసుకున్న 2020 ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ లైనప్‌ స్టాండర్ట్‌3 ఏళ్లు లేదా 100.000 కి.మీ ఫ్యాక్టరీ వారెంటీని అందిస్తుంది. ఎకోస్ఫోర్ట్‌ ప్రభావంతమైన ఔట్‌డోర్‌ అలానే ఇంటీరియర్‌ స్టైలింగ్‌తో తన దిట్టత, భవ్యమైన రూపాన్ని మరింత ముందుకు తోడ్కోని వెళుతోందన్నారు. ఈ కాంప్యాక్ట్‌ ఎస్‌యువి తన వేరియెంట్లలో సగం మొత్తానికి సన్‌ రూఫ్‌ను అందిస్తోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close