Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

తన్నీరు కోసం..

కాళేశ్వరం కన్నీరు

మెదక్‌ జిల్లాకు చెందిన ఒక టిఆర్‌ఎస్‌ నాయకుడు చెప్పిన విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ''హరీష్‌ రావు నిన్నటి వరకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రింబవళ్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే నిద్రించి మంత్రుల పని తీరులో కొత్త ఒరవడి సస్టించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువ సమయం ప్రాజెక్టుల వద్దే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, సిఎం కేసిఆర్‌ ప్రాజెక్టుల టూర్‌లో ఉండకపోవడం పెద్ద వెలితి కాదా? '' అని ఆయన పేర్కొన్నారు.హరీష్‌ రావు... ఈ పేరు తెలియని వారు ఉండరు... హరీష్‌ అంటే పేరు కాదు ఒక నమ్మకం... ఆపదలో ఆదుకునే నాయకుడు... ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు... రాష్ట్రంలో హరీష్‌ ఎక్కడికి వెళ్ళిన అది జన ప్రబంజనమే... నిత్యం ప్రజల మద్యలో ఉండి... ప్రజల కోసం... పరితపించే నాయకుడు హరీష్‌ రావు... పార్టీలో కూడా ట్రబుల్‌ షూటర్‌ గా పేరొందిన నాయకుడు... ఎక్కడ ఎన్నికలు జరిగిన... మేన మామ కేసిఆర్‌ ఆదేశాలతో అక్కడ వాలి పార్టీ ని గెలిపించే సత్తా కలిగిన నాయకుడు.... మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికలలో రేవంత్‌ రెడ్డి, డికే అరుణ, గీత రెడ్డి లాంటి కాంగ్రెస్‌ హేమ హేమీలను తన వ్యూహ చతురతతో మట్టి కరిపించారు. అసంతప్తులను బుజ్జగించడం లో హరీష్‌ కి ఎవరు సాటిరారు.... సిద్దిపేట్‌లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి... ప్రతిపక్షాలు అసలు సిద్దిపేట్‌ నుండి పోటీ చేయాలంటేనే బయపడేలా టిఆర్‌ఎస్‌కి కంచు కోటగా తీర్చిదిద్దాడు. సిద్దిపేట్‌ ఒక్క నియోజకవర్గమే కాదు కేసిఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా నిత్యం పర్యటిస్తూ మేన మామ కేసిఆర్‌ నమ్మిన బంటుగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ... కేసిఆర్‌ గెలుపుకోసం కషి చేస్తున్నాడు... అలాంటి నిబద్దత కలిగిన నాయకుడిని కేసిఆర్‌ కావాలనే దూరం పెడుతున్నారు అన్న అనుమానం కలుగుతుంది... గత వారం నీటి పారుదలపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో హరీష్‌ రావు కనిపించలేదు. గత మంత్రివర్గంలో హరీష్‌ రావు నీటి పారుదల శాఖను నిర్వహించిన విషయం తెలిసిందే. పలు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చాయి. కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. హరీష్‌ రావు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పడిన శ్రమను కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో ప్రశంసించారు కూడా. అయినా హరీష్‌ రావు ని సమావేశానికి పిలవలేదు. నిన్నటి నుండి సిఎం కేసిఆర్‌ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు ఆయన రెండోసారి సిఎం అయిన తర్వాత సమీక్షలతో వేగం పెంచుతున్నారు. రెండు రోజులపాటు హెలిక్యాప్టర్‌ మీద కాళేశ్వరం సహా గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలియదిరిగారు. ఈ టూర్‌ లో సిఎం కేసిఆర్‌ తో పాటు తెలంగాణ జల వనరుల అభివద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, మాజీ మిషన భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఎక్స్‌ పర్ట్‌ (మొన్నటి వరకు ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన అధికారి ప్రస్తుతం సిఎం ఓఎస్‌డిగా నియమితులైన) శ్రీధర్‌ దేశ్‌ పాండే, చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కె. జోషీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టీఎస్‌ ఎండీసీ ఛైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు , ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు, సీఈ వెంకటేశ్వర్లు, లిప్ట్‌ సలహాదారు పెంటారెడ్డి, మెగా ఎండీ కష్ణారెడ్డి లాంటి ఇరిగేషన్‌ నిపుణులంతా హాజరయ్యారు. ఇది ఇరిగేషన్‌ టూర్‌ కాబట్టి వారంతా హాజరు కావాల్సిందే కూడా. కానీ హరీష్‌ రావు కూడా హాజరైతే బాగుండేది కదా? అని పార్టీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం అంతర్గతంగా సాగుతున్నది. 

మొన్నటివరకు ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా అహోరాత్రులు పనిచేసిన హరీష్‌ రావును కేసిఆర్‌ ఈ టూర్‌ కు ఎందుకు  పిలవలేదు అన్నది తేలాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం సిద్ధిపేటలోనే ఉంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేసిఆర్‌ టూర్‌ జరిగిన రోజుల్లో కూడా సిద్ధిపేటలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు ఇంతకాలం భుజాన మోసినందున ఆయనను కూడా ఈ టూర్‌ లో ఇన్వాల్వ్‌ చేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా? అని పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. పైగా కాళేశ్వరం పనుల పట్ల కేసిఆర్‌ అసంత ప్తి వ్యక్తం చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. కాళేశ్వరం పనుల మీద అసంత ప్తి వ్యక్తం చేయడం ద్వారా హరీష్‌ రావు మీద నెగెటివ్‌ వార్తలు రావడానికి ఆస్కారమిచ్చి తద్వారా హరీష్‌ రావు సామార్ద్యాన్ని తగ్గించే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఇక హరీష్‌ రావును టిఆర్‌ఎస్‌ లో వేగంగా పక్కన పెడుతున్నారని సోషల్‌ మీడియాలో గుసగుసలు షురూ అయ్యాయి. ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి ఆయన పెద్దగా మీడియాలో కనపడిన దాఖలాలు లేవు, వినపడిన దాఖలాలు లేవు. దీన్నిబట్టి హరీష్‌ రావును టిఆర్‌ఎస్‌ లో పక్కన పెట్టినట్లే అని సోషల్‌ మీడియా కోడై కూస్తున్నది. ముందస్తు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత కేటిఆర్‌ కు వర్కింగ్‌ ప్రసిడెంట్‌ లాంటి పరిణామాలు జరిగిన తర్వాత హరీష్‌ పెద్దగా మీడియాలో కనిపించలేదు. కేటిఆర్‌ ఛార్జ్‌ తీసుకునేవేళ తెలంగాణ భవన్‌ కు ఇలా వచ్చి అలా తిరుపతి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇక హరీష్‌ రావు గొంతు వినపడలేదు. ఈపరిణామాలపై మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా పెద్దగా ఫోకస్‌ చేయకపోయినా.. సోషల్‌ మీడియాలో దుమారం మాత్రం మొదలైందని చెప్పవచ్చు. గతంలోనూ హరీష్‌ రావు తాలూకు వార్తలను టిఆర్‌ఎస్‌ అనుకూల మీడియాలో ప్రసారం కాలేదు. ఆయన వార్తలపై అప్రకటిత నిషదం విధించారా అన్న అనుమానాలు కూడా కలిగాయి. తాజాగా ఈ రకమైన ప్రచారం జరగడం గమనార్హం.హరీష్‌ రావుకు రానున్న కేసిఆర్‌ కేబినెట్‌ లో ఏ మంత్రి పదవి దక్కుతుందో అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు ఇరిగేషన్‌ మాత్రం ఇవ్వబోరని కేసిఆర్‌ రెండు రోజుల ప్రాజెక్టుల పర్యటనతో తేలిపోయిందని అంటున్నారు. ఇరిగేషన్‌ తన వద్దే ఉంచుకుంటానని కేసిఆర్‌ ప్రకటించినందున ఇక హరీష్‌ రావుకు వేరే శాఖలు ఏమైనా అప్పగించే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. అయితే హరీష్‌ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని టిఆర్‌ఎస్‌లోని ఒక సెక్షన్‌ లీడర్లు ప్రచారం చేస్తుండగా అసలు హరీష్‌ రావుకు మంత్రివర్గంలో బెర్త్‌ అనుమానమే అని ఇంకో సెక్షన్‌ టిఆర్‌ఎస్‌ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. హరీష్‌ పార్లమెంటుకు పోటీ చేయవచ్చని కూడా టాక్‌ నడుస్తోంది. కానీ ఇక్కడ కేసిఆర్‌ కానీ, కేటిఆర్‌ కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టిఆర్‌ఎస్‌ లో కేసిఆర్‌ తరువాత అంతటి చరిస్మా ఉన్న నాయకుడు హరీష్‌ రావే. కేటిఆర్‌ కన్నా ప్రజల మనిషిగా, పని చేసే మంత్రిగా, ముఖ్యంగా ట్రబుల్‌ షూటర్‌ గా పేరున్న హరీష్‌ రావు ని పక్కకు తప్పిస్తే టిఆర్‌ఎస్‌ మునిగి పోవడం ఖాయమని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కేటిఆర్‌ కు పార్టీ నాయకులను ఒక తాటిపై నడిపించే సత్తా లేదు అని, అసంతప్తులను బుజ్జిగించడంలో ఎన్నోసార్లు కేటిఆర్‌ విఫలం చెందాడాని, ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా హరీష్‌ రావు విలువను గుర్తించి తగిన పదవిస్తే పార్టీ బతుకుతుందని లేకపోతే మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది చర్చ జరుగుతుంది.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close