పీఎంజే జ్యుయెల్స్‌తో వేడుక చేసిన ఫర్‌ ఎవర్‌ మార్క్‌

0

  • అత్యుత్తమ వజ్రాలు మరియు మేధోపూరిత హస్తకళానైపుణ్యాల సమ్మేళనం

హైదరాబాద్‌: డి బీర్స్‌ గ్రూప్‌ కు చెందిన డైమండ్‌ బ్రాండ్‌ అయిన ఫర్‌ ఎవర్‌ మార్క్‌, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ బ్రాండ్‌ అయిన పీఎంజే జ్యుయల్స్‌ తో తన అనుబంధాన్ని వేడుక చేసుకుంది. ఎంతో ప్రేమ మరియు మక్కువలతో జ్యుయలరీ తయారీకి ఈ అనుబంధం వాగ్దానం చేస్తోంది. ఫర్‌ ఎవర్‌ మార్క్‌ వజ్రాలు ప్రపంచంలో అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయబడిన వజ్రాలు. పీఎంజే జ్యుయల్స్‌ అనేది తమ వజ్రాభరణాల తయారీ హస్తకళానైపుణ్యంలో నాణ్యతకు పేరొందింది. ఇటీవలే ఈ రెండు సంస్థలు అత్యుత్తమ వజ్రాలు మరియు మేధోపూరిత హస్తకళానైపుణ్యాల సమ్మేళనం చాటిచెబుతూ ఉమ్మడి ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించాయి. తమను విశ్వసించే వినియోగదారులకు మరింత హామీనిచ్చేలా పీఎంజే జ్యుయల్స్‌ ఇటీవల డి బీర్స్‌ గ్రూప్‌ నుంచి తెప్పించిన ఒక డైమండ్‌ టెస్టింగ్‌ మెషిన్‌ ‘సింత్‌ డిటెక్ట్‌ ను ఏర్పాటు చేసింది. వజ్రాలను పరీక్షించేందుకు ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ ఉపకరణం గురించి స్వయంగా తెలుసుకునేందుకు వినియోగదారులు పీఎంజే జ్యుయల్స్‌, బంజారాహిల్స్‌, రోడ్‌ నెం. 13, హైదరాబాద్‌ ను సందర్శించవచ్చు లేదా వివరాల కోసం 80080 19281 కు కాల్‌ చేయవచ్చు. ఈ సందర్భంగా పీఎంజే జ్యుయల్స్‌ ఎండీ శ్రీ దినేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ”””’డీ బీర్స్‌ గ్రూప్‌ తో అనుబంధం మాకెంతో ఆనందదాయకం. దశాబ్దాలుగా మేము పారదర్శకత, విశ్వసనీయతలతో కొనుగోలుదారులకు సేవలను అందిస్తున్నాం. ప్రపంచంలోని వజ్రాల్లో 1 % కంటే తక్కువ వజ్రాలు మాత్రమే ఫరెవర్‌ మార్క్‌ అర్హతలకు లోబడి ఉంటాయి. అలాంటి వాటితో ఆభరణాలను రూపొందించడం మాకు గర్వకారణం. ఫరెవర్‌ మార్క్‌ తో అనుబంధం మా విశ్వసనీయతను మరింత పెంచుతుంది”” అని అన్నారు.ఫరెవర్‌ మార్క్‌ ప్రెసిడెంట్‌ శ్రీ సచిన్‌ జైన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ” మా మాదిరిగా వజ్రాలపై మక్కువతో పాటుగా వ్యాపార, సామాజిక, పర్యావరణ సమగ్రతపై బ్రాండ్‌ ప్రమాణాలను సాధించే వాటితోనే మేము అనుబంధం కలిగి ఉంటా. పీఎంజే జ్యుయల్స్‌ తో అనుబంధం మాకెంతో గర్వకారణం. ఇక్కడ పొందే అత్యుత్తమ వజ్రాలు అదేస్థాయి అత్యుత్తమ హస్తకళానైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటాయి” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here