Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

‘మరణించిన’ అమ్మలకు… జన్మించిన బిడ్డలు

4నెలలుగా ‘బ్రెయిన్‌ డెడ్‌’

? ఇప్పటిదాకా మూడు సంఘటనలు

? కవలలను కన్న 73 ఏళ్ళ తల్లి ‘రికార్డ్‌’

? వైద్య శాస్త్రంలో అద్భుతాలు

(హిస్టరీలో మిస్టరీ కథనం-14)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

”అధ్బుతం జరిగేటప్పుదు ఎవరు గుర్తించలేరు? జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు?”

అమ్మతనం విలువ ఏమిటో, దాని అనుభూతి ఏమిటో అమ్మకే బాగా తెలుసు? తన దేహం నుంచే ఓ జీవకణం మరో ప్రాణిగా రూపుదిద్దుకుని ఈలోకంలోకి రావడాన్ని అమ్మ మాత్రమే… అద్భుతంగా, రకరకాల ఉద్వేగాల్ని ఫీలయ్యేది? అందుకే పిల్లల్లేని వారికి అంత బాధ? కానీ ఈ మహిళల కథ ఎంత ఆసక్తికరం ఉంటుందో.. అంత హృదయ రోదనతో కూడిన విషాదభరితం కూడా…. బ్రెయిన్‌ డెడ్‌ అంటే ఆ మనిషి మరణించారని అర్థం. అలాంటి బ్రెయిన్‌ డెడ్‌ అయిన మాతృమూర్తులు

కడుపు పండాలే గానీ తమ దేహం రాలిపోతేనేం అనుకున్న ఆ తల్లులు బిడ్డకో, కొడుక్కో తప్పకుండా జన్మనివ్వాల్సిందేననీ… ”అమ్మా” అని పిలిపించుకోవాల్సిందేనని అనుకున్నారు. చాలా రోజులు కోమాలో ఉన్నారు? అయినా రిస్క్‌ తీసుకుంటామని డాక్టర్లకు చెప్పారు. చివరకు తాము మరణించిన సుమారు నాలుగు నెలలకు తమ బిడ్డలకు జన్మనిచ్చారు.

పోర్చుగల్‌ దేశంలో.. 107 రోజులకు…:

సాండ్రా పెడ్రో అనే 37 ఏళ్ల వివాహిత? ఆమె కడుపు పండింది? ఆమె గతంలో న్యూమోనియా, గుండె సమస్యలతో బాధపడింది. ఓ ట్యూమర్‌ చికిత్స సందర్భంగా చేసిన ఆరోగ్య పరీక్షలలో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భం ధరించకూడదు. అప్పటికే ఆమె గర్భిణి. అయితే తన పాత మెడికల్‌ హిస్టరీ ప్రకారం ఆమెకు ఈ గర్భం ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరించారు. ఆమె తన గర్భాన్ని తీయడానికి ఒప్పుకోలేదు. 17 వారాల గర్భిణిగా ఉన్న ఆమె ఓరోజు విపరీతమైన తలపోటుతో కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి చేర్చాక బ్రెయిన్‌ హేమరేజ్‌ వల్ల ఆమె ‘బ్రెయిన్‌ డెడ్‌’ అని డాక్టర్లు తేల్చేశారు. రేపోమాపో వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసేసి, ఆమె జీవిత కథకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనుకున్నారు. కానీ? కానీ?

ఆమె కడుపులో పెరుగుతున్న శిశువులో సజీవ సంకేతాలు కనిపించాయి. మగబిడ్డే అని పోల్చుకున్న డాక్టర్లు శిశువు గుండె కూడా స్థిరంగా కొట్టుకుంటున్న తీరూ గమనించి విస్తుపోయారు. అప్పటికె మెదడు చచ్చిపోయి, శరీరానికి ఇక జీవక్రియలకు సంబంధించి సంకేతాలూ అందని స్థితిలో ఆ శిశువు అలాగే ఆరోగ్యంగా ఎలా ఉన్నాడని అనుకున్నారు. అసలు తల్లి ‘బ్రెయిన్‌ డెడ్డ్‌’తో మరణించిందో..? లేదో..? అని మరోసారి పరిశీలించారు. ఇదేదో అద్భుతంగా ఉందనీ, ఏం చేయమంటారనీ పెడ్రో కుటుంబాన్ని అడిగారు డాక్టర్లు. మీకు వీలైతే మాకు ఆ కొడుకును ప్రసాదించండి అన్నది ఆ కుటుంబం. ఆ తరువాత డాక్టర్లకు వైద్య పరంగా పెను సవాల్‌ మొదలైంది. శిశువు అలాగే పెరిగేదాకా ఆమె దేహాన్ని అలాగే సజీవంగా ఉంచడం ఎలా అనేదే ఆ సవాల్‌. అవసరమైన హార్మోన్లు, ఆక్సిజన్‌ యంత్రాల ద్వారానే అందిస్తూ ఆమె దేహాన్ని, ఆమె కడుపులోని కొత్త ప్రాణాన్నీ కాపాడటంలో ఎలాగైతేనేం సక్సెసయ్యారు డాక్టర్లు. ఆమె బ్రెయిన్‌ డెడ్‌ తరువాత 107 రోజులకు, ఇక శిశువు ‘తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినా బతుకుతుంది’ అనే నమ్మకం కుదిరాక బయటికి తీశారు. పుట్టాల్సిన టైమ్‌ కన్నా ఎనిమిది వారాలకు ముందే? ఇన్నిరోజులపాటు ఒక బ్రెయిన్‌ డెడ్‌ తల్లి కడుపులో బతికిన ఏకైక తొలి గట్టిపిండం ఇదే? ఆ మరుసటి రోజు వెంటిలేటర్‌ ప్లగ్గు తీసేశారు? ఆ ‘తల్లి ఆత్మ’ తనకు పుట్టిన ఆ కొడుకును చూస్తూ ఆనందబాష్పాలతో తిరిగి రాని లోకాలకు తరలిపోయింది!!.

బ్రెజిల్‌ దేశంలో… 123 రోజులు:

బ్రెజిల్‌ దేశంలోని మహిళ? 21 ఏళ్లు. ఇదీ రెండేళ్ల క్రితం స్టోరీయే. స్ట్రోక్‌? 123 రోజులు.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆ తల్లిని అలాగే బతికించి ఉంచారు. కవలలకు జన్మనిచ్చింది. తరువాత లైఫ్‌ సపోర్ట్‌ తీసేశారు? ఆమె గుండె ఆగిపోయింది? ఆ కవల పిల్లలకు ప్రాణం పోసి..!

చెక్‌ రిపబ్లిక్‌… 117 రోజులు:

ఇప్పుడు మరో వార్త? సేమ్‌? చెక్‌ రిపబ్లిక్‌ లోని రునో యూనివర్శిటీ హాస్పిటల్‌ అది. ఆ ఏరియాలో ఓ 27 ఏళ్ల మహిళకు సివియర్‌ స్ట్రోక్‌? గత ఏప్రిల్‌ నెలలో… ఏకంగా హెలికాప్టర్‌? అనగా ఎయిర్‌ అంబులెన్స్ను పంపించారు? డాక్టర్లు ఏవో ప్రయత్నాలు చేశారు. ఫలితం లేదు? బ్రెయిన్‌ డెడ్‌? కానీ ఆమె కడుపులో ఓ పిండం? సజీవంగా, అప్పటికే కాస్త ఎదిగి, ఈ లోకంలోకి రావాలని ఎదురుచూస్తూ… కుటుంబసభ్యులను అడిగారు డాక్టర్లు? మాకు ఆ శిశువు కావాలన్నారు వాళ్లు? పది కాదు, ఇరవై కాదు? అలా 117 రోజుల పాటు ఆ మహిళను అలాగే లైఫ్‌ సపోర్ట్‌ మీద బతికి ఉంచారు. కృత్రిమ శ్వాస ఇస్తారు సరే, గుండె కొట్టుకుంటుంది సరే, బ్రెయిన్‌ ఎలాగూ అప్పటికే మరణించింది? ఆమె గర్భాశయాన్ని మాత్రం సజీవంగా ఉంచాలి? ఇదీ ఆ టాస్క్‌? డాక్టర్లు టేకప్‌ చేశారు ఓ సవాల్గా. ఆమె శరీరంలో చచ్చుపడి పోకుండా అన్ని కీలక అవయవాలను పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ వైద్య పరిజ్ఞానం మొత్తం ఉపయోగించారు. తను సజీవంగా ఉన్న తల్లి కడుపులోనే పెరుగుతున్నట్టుగానే? బిడ్డ ఎదిగింది? ఆ ఫీల్‌ కోసం అప్పుడప్పుడూ ఆ తల్లి జీవం లేని కాళ్లను అటూఇటూ కదిలించేవారు డాక్టర్లు? బిడ్డకు తగిన పోషకాలూ అందాయి? చివరకు సిజేరియన్‌ చేసి, బిడ్డను బయటికి తీశారు. 2.13 కిలోల శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో కళ్లు తెరిచింది? కేర్మంది? ఆ తరువాత ఆ కృత్రిమ శ్వాసను తొలగించారు? అప్పటికే మెదడు మరణించిన ఆ తల్లి ఇక శాశ్వతంగా నిర్జీవమైపోయింది. డాక్టర్లూ మీకు పరిపరిదండాలు. అమృతాన్ని పంచే ఈ తల్లుల కోసం అసంకల్పితంగా అయినా మనం ఖర్చు లేని ఓ కన్నీటి బొట్టు కారుద్దాం.

చివరిగా…:

”అధ్బుతం జరిగేటప్పుదు ఎవరు గుర్తించలేరు?…

జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు?”

చరిత్రలో తల్లి మరణించిన నాలుగు నెలలకు బిడ్డను కనడం హిస్టరీలో ఓ మిస్టరీ.

ఃూచీ:

కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ.. వరల్డ్‌ రికార్డ్‌

ఆంధ్రప్రదేశ్‌, తూర్పు గోదావరి జిల్లా, నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(74) అనే వృద్ధురాలు కవల పిల్లలకు గురువారం జన్మనిచ్చారు.

1992లో వివాహమైన మంగాయమ్మ ఏళ్లు గడిచినా తల్లి కావాలనే కోరిక తీరలేదు. ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ ఐవీఎఫ్‌ పద్దతిని ఆశ్రయించింది. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్‌ ¬మ్ను సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సైకిల్‌ లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. గురువారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. గుంటూరు అహల్యా ఆస్పతిలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ జరిగింది.

పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపనపడ్డ ఆ దంపతుల కల నెరవేరింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా, 74 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డని వైద్యులు చెబుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close