Featuredరాజకీయ వార్తలు

పదవీ పాద యాత్రికులు

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి

మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి రెండుసార్లు వాడిన వజ్ర సంకల్ప ఆయుధం. భూదాన ఉధ్యమంతో ‘వినోభాభావే’ దూసిన కత్తి…అదే ఆదర్శంగా… నేడు రాజకీయాలలో ఉత్తేజం కలిగించే అడుగులో అడుగు… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై అవగాహన కల్పించే అధ్భుత ఔషధం. లక్షలాదిమందిని కలిసి.. వేలాది సమస్యలు తెలుసుకునే అపూర్వ అవకాశం. ప్రజలు కూడా ఈ యాత్రలకు బ్రహ్మరథం పడతారు. అది ఏస్థాయిలో అంటే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత. ‘తమ్మినేని’ ఎర్ర పోరుబాట రంగు వెలసిన యాత్రగా మారుతుందా..? వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముఖ్యమంత్రిని చేస్తుందా..? అన్నది

కాలం నిర్ణయిస్తుంది.

వై ‘ఎస్‌’ ‘ప్రస్థానం’:

రాజకీయ నాయకులంటే రాజకీయాలు చేయడమే కాదు.. రాజకీయ ఎత్తుగడలతో ప్రజలతో మమేకం కావడం. ఓనాడు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో మండు వేసవిలో నూతనోత్సాహం నింపింది వైఎస్‌ పాదయాత్ర. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర 2003 ఏప్రిల్‌ 9 నుంచి జూన్‌ 15 వరకు 68 రోజుల పాటు 1,470 కిలోవిూటర్ల మేర సాగింది. ఇది ఉమ్మడి ఆంధప్రదేశ్లో జరిగిన ఘట్టం. ఇచ్ఛాపురంలో ముగింపు సందర్భంగా హస్తం గుర్తుతో కూడిన పైలాన్ను అప్పట్లో నిర్మించారు. అప్పటిదాకా ఓ సాదాసీదా నాయకుడిగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డిని ఓ సెలబ్రిటీ నాయకుడిగా.. ఎవరూ ఊహించని విధంగా చేసింది. కాంగ్రెస్‌ ‘సీల్డ్‌ కవర్‌’ కాని తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నో కఠినమైన నిర్ణయాలను దృఢంగా తీసుకునే అవకాశం కల్పించింది. అదే చివరి వరకు కొనసాగించారు.

చంద్రబాబు…

”వస్తున్నా… విూకోసం”:

రాజశేఖర్‌ రెడ్డి హయాంలో చంద్రబాబు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన కళ్ళముందు ఓనాడు తిరుగాడిన ‘చోటా’ నాయకులు కూడా ‘డబుల్‌ కాలర్‌’తో తిరగటం చూశారు. పవర్‌ పాలిటిక్స్‌ రుచి కొత్త కోణంలో తెలిసింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ‘వస్తున్నా… విూకోసం’ అనే పేరుతో ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ లో 13 జిల్లాలలోగుండా 2817కిలోవిూటర్లు పాదయాత్ర చేసి రాజశేఖర్‌ రెడ్డి రికార్డ్‌ ను దాటారు. అనంతర పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

షర్మిల ‘మరో ప్రస్థానం’:

వైఎస్‌ రాజశేఖర్రెడ్డి కుమార్తె, జగన్‌ సోదరి షర్మిళ 2012 అక్టోబరు 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించి 230 రోజుల పాటు 116 నియోజకవర్గాల విూదుగా 3,112 కిలోవిూటర్లు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జగన్‌ రిమాండ్లో ఉన్నారు. ఇచ్ఛాపురంలో జరిగిన ముగింపు వేడుకల సందర్భంగా వైఎస్‌ విగ్రహంతో కూడిన పైలాన్ను ఏర్పాటు చేశారు. ప్రపంచ చరిత్రలో ఓ మహిళ సుధీర్ఘ పాదయాత్ర చేయడం ఇప్పటికీ చెరిగిపోని రికార్డ్‌.

జగన్‌ ‘ప్రజా సంకల్ప యాత్ర’:

‘ఇప్పుడు గెలవకుంటే జగన్‌ ఇక ముందు ముఖ్యమంత్రి కాలేడు’.. చావోరేవో తేల్చుకోవడానికి వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్ర బుధవారం ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 134 నియోజకవర్గాల విూదుగా, 2,516 గ్రామాలను, 8 కార్పొరేషన్లను, 54 పురపాలక సంఘాల విూదుగా ఈ యాత్ర సాగింది. 124 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. మొత్తంవిూద 3,648 కిలోవిూటర్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం పైలాన్ను ఆవిష్కరించారు.

ఎరుపునావ తమ్మినేని:

సహజంగా సీజన్‌ వారీ ధర్నాలు చేయడానికి మాత్రమే ఎర్రపార్టీలు పనికొస్తాయనే అపప్రద ప్రజల్లో నెలకొంది. దాన్ని తమ్మినేని వీరభద్రం ‘మహాజన పాదయాత్ర’ ద్వారా కొంత బ్రేక్‌ చేశారు. సిపిఎం పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తలలో ఆయన ఒకరు. బాషాసంయుక్త రాష్ట్రాల సిద్దాంతంతో తెలంగాణలో సెంటిమెంట్‌ గా దూరమైంది. అయితే ‘దింపుడుగల్లం’ ఆశతో బిక్క చచ్చిన ఎర్ర పార్టీలకు ఆయన పాదయాత్ర ఊపిరి పోసింది. 1600కి పైగా గ్రామాలు, పట్టణాలు, గిరిజన గూడేలు, తండాలు, దళిత వాడల గుండా సాగిన పాదయాత్ర 4150 కిలోవిూటర్ల కొనసాగింది. ”ఇది తమ్మినేనికే కాకుండా ఎర్ర పార్టీలకు క్రేజ్‌ తగ్గలేదు” అని సిపిఎం పార్టి వీర విధేయులు జక్కంపూడి కృష్ణ అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్ల కోసం సిపిఐ పార్టీ సిపిఎంకు ‘హ్యాండ్‌’ ఇచ్చింది. బిఎల్‌ఎఫ్‌ ప్లాప్‌ షో కారణంగా తమ్మినేని పాదయాత్ర సముద్రపు నీటిలో కలిసిన ‘ఎర్ర రక్తం’లా తయారైంది.

ఃూచీ:

యాదృచ్చికంగా..

టార్గెట్‌ బాబు

ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్రలు చేశారు.. వారంతా ఆ యాత్రలను శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురంలోనే ముగించారు. అందరూ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని యాత్రలు సాగించారు.. వారి అభిమానులు ఇచ్ఛాపురంలో స్థలాలను కొని పాదయాత్రలకు జ్ఞాపికలు నిర్మించారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి, తనయ షర్మిళ యాత్రలకు గుర్తుగా స్తూపాలను ఒకేచోట ఎదురు ఎదురుగా నిర్మించగా, జగన్‌ పాదయాత్ర స్తూపం మాత్రం పట్టణ పొలిమేరల్లో జాతీయరహదారి సవిూపంలో ఏర్పాటుచేశారు. శాసనసభ ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్‌ నాయకుడిగా వైఎస్‌ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేస్తే, ఆయన తనయ షర్మిళ, కుమారుడు జగన్‌ వైకాపా తరపున ప్రజల సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ‘ నారా చంద్రబాబు’ను గద్దె దింపే ప్రయత్నంలో భాగంగా జరిగాయి. ఈ పాదయాత్రలతో వీరందరూ ఏదో ఒక కోణంలో లాభాలను చవిచూసిన వారే. అయితే అందరికంటే ఎక్కువ దూరం పాదయాత్ర చేసిన తమ్మినేని వీరభద్రం మాత్రం కమ్యూనిస్టు కోటలో మిగిలిన ఏకైక బహుదూరపు బాటసారిగా మిగిలారు.

2నిట ఃూచీ

భారతావనిలో….

నిజానికి భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మైలురాయి.

ఆ తరువాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు.

అనంతరం 1951లో వినోభా భావే భూదాన్‌ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బిహార్లోని బోధ్గయ వరకు నడిచారు.

1983, జనవరి 6 నుంచి జూన్‌ 25 వరకు అప్పటి కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు.

ఆరు నెలల పాటు 4,260 కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు నడిచారు.

1983 జనవరి 6 న చంద్రశేఖర్‌ సింగ్‌ కన్యాకుమారి నుండి తన పాదయాత్ర ప్రారంభించారు మరియు ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ 1983 జూన్‌ 25 వరకు ఢిల్లీలో రాజ్‌ ఘాట్‌ దాకా తన 4260 కిలోవిూటర్ల ప్రయాణాన్ని కొనసాగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close