Featuredఅంతర్జాతీయ వార్తలు

అఫ్ఘాన్‌లో విమాన ప్రమాదం

83మంది దుర్మరణం చెందారని అనుమానం

కాబూల్‌

ఇటీవల ఇరాన్‌ లో విమానం కుప్పకూలిన ఘటన మరువక ముందే ఆఫ్ఘనిస్థాన్‌ మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ విమానంలో 83 మంది ప్రయాణికులుండడంతో వారు ప్రాణాలతో ఉంటారన్న దానిపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదు. అరియానా ఆఫ్ఘాన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఈ బోయింగ్‌ విమానం ఘజ్నీ ప్రావిన్స్‌ లోని సడో ఖేల్‌ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో విమాన ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక తాలిబాన్ల దాడి ఫలితమా అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. తూర్పు అఫ్గానిస్తాన్‌లో ఒక విమానం కూలింది. ఇది తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. రాజధాని నగరం కాబూల్‌కు నైరుతి దిశలో ఉన్న ఘజ్ని ప్రావిన్సులోని దెహ్‌ యాక్‌ జిల్లాలో ఈ విమానం కూలిందని ప్రావిన్సు అధికార ప్రతినిధి స్థానిక మీడియాకు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల విమానంలో మంటలు చెలరేగాయని, అనంతరం విమానం కూలిపోయిందని అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విమానం అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినదని తొలుత వార్తలు వెలువడ్డాయి, కానీ ఆ కంపెనీ మాత్రం వీటిని తోసిపుచ్చింది. అరియానా విమానాలు అన్నీ తమతమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఏవీ కూలిపోలేదు. కాబట్టి, కూలిన విమానం అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినది కాదు’ అని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వలేదు. కాగా, ఇది ప్రయాణీకుల విమానం అని తొలుత ప్రావిన్సు అధికార ప్రతినిధి చెప్పగా.. ప్రయాణీకుల విమానం ఏదీ కూలిపోలేదని అఎ/-గానిస్తాన్‌ విమానయాన సంస్థ ప్రకటించింది. తాము విమానాన్ని ఇంకా గుర్తించలేదని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ బీబీసీతో చెప్పారు. అసలు ఈ విమానం ఎందుకు కూలిపోయింది? అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? అన్న వివరాలు ఇంకా తెలియటం లేదు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close