దొంగదెబ్బకు.. మెరుపుదాడి

0

పుల్వామాలో ముష్కరుల ఉగ్రదాడిలో 44 మంది నేలకొరిగి సరిగ్గా 11 రోజులు పూర్తయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వారి అంత్యక్రియల క్రతువు పూర్తయిన కొద్ది గంటల్లోనే భారత్‌ సైన్యం ఒక్క ఉదుటున 300మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఈ సర్జికలష అపరేషన్‌ కేవలం 22 నిమిషాల్లో నిశ్శబ్దంగా పూర్తయింది. ఆ కొద్ది సమయంలోనే పీఓకేలో బాంబుల వర్షం కురిపించారు. దట్టమైన చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోయిన ఫైటర్‌ జెట్లు శత్రుస్థావరాలను నేలకూల్చాయి. టెర్రరిస్టులకు సరైన బుద్ది చెప్పాయి. మరి వాయుసేన ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేసింది..? ఏ ఏ సమయాల్లో దాడి చేసింది..? శత్రువులు పసిగట్టకుండా పని ఎలా ముగించింది..? సర్జికల్‌ స్ట్రైక్స్‌ రెండున్నరేళ్ల క్రితం పరిచయం అయిన ఈ సాహసం పుల్వామా ఘటన తర్వాత మన వాయుసేన మరోసారి అదే మంత్రాన్ని ప్రయోగించింది. అమరవీరులకు నివాళిగా మెరుపుదాడులతో పీఓకేను వణికించింది. అర్ధరాత్రి చీకట్లను చీల్చుకుంటూ శత్రువులపై దాడి చేసింది. ఉగ్రశిబిరాలను నేలకూల్చింది. దేశం గర్వించదగ్గ విజయాన్ని మన వాయుసేన అందించింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలని సిద్ధమైన వాయుసేన అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రచించింది. ఇందుకు అత్యాధునిక మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్లను ప్రయోగించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి వందకు వంద శాతం.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ముందే చెప్పింది.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహ ద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసిం ది. భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వంద శాతం విజయవంతం..

వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని సంబంధి త అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరి గాయని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండు వారాలకు పాక్‌ ఉగ్రశిబి రాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన

పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. 2016 సెప్టెంబర్‌ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది.

ఉగ్రవాదంపై కొత్త పంథా:

ఉగ్రదాడికి కుంగలేదు.. హెచ్చరికలకు బెదరలేదు..సరిహద్దులు దాటింది.. బాంబులతో బుద్ధిచెప్పింది.. ఉగ్రవాదంపై పోరును ఉధృతం చేసిన మోదీ ప్రభుత్వం ఈ సారి కొత్త పంథాతో వ్యూహాన్ని అమలుచేసింది.పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిపి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్కు భారత్‌ నేడు గట్టిగా బదులిచ్చింది. నిఘా వర్గాల నేతృత్వంలో పాకిస్థాన్లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేపట్టి వందల మంది ముష్కరులను హతమార్చింది.. ఇంతకీ భారత్‌ ఎంచుకున్న ఆ కొత్త మార్గం ఏంటీ.. వైమానిక దాడులకు ముందుగా పాల్పడకూడదనే స్వయంగా పెట్టుకున్న మానసిక హద్దులను భారత్‌ తొలిసారిగా అధిగమించింది. నేడు 12 యుద్ధవిమానాలు పాకిస్థాన్‌ గగనతలంలోకి చొచ్చుకుపోయి ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి సురక్షితంగా తిరిగొచ్చాయి. ఈ చర్యతో పాకిస్థాన్లోని ఓ ప్రాంతం సురక్షితం కాదనే సందేశాన్ని భారత్‌ ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. భారత్‌ మా దేశంపై దాడి చేస్తే దానికి ప్రతిదాడి తప్పదంటూ రెండు రోజుల క్రితమే పాక్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు ఏ మాత్రం బెదరకుండా భారత్‌ మంగళవారం మెరుపుదాడులకు దిగింది. ‘విూరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. ఎలాంటి ముప్పుకైనా భయపడేది లేదు’ అని పాక్కు కాస్త గట్టిగానే చెప్పింది. దాడులకు కచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకుంది. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్రమూకలను హతమార్చింది. ఉదాహరణకు లష్కరే ఉగ్ర సంస్థ ప్రధాన కార్యాలయం, జైషే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో సాధారణ పౌరుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వాటిపై దాడులు జరిపితే పౌరులకు హానీ కలిగే అవకాశం ఉండటంతో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాలాకోట్లోని జైషే ఉగ్ర స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీంతో లక్ష్యాన్ని వంద శాతం సాధించగలిగింది. బాలాకోట్‌ జైషే ఉగ్ర స్థావరం దట్టమైన అరణ్యంలో ఉంది. ఇక్కడకు యుద్ధవిమానాలు వెళ్తే పాక్‌ రాడార్లు పట్టేస్తాయి. దానిపై దృష్టిపెట్టిన వాయుసేన సాంకేతికతను వినియోగించుకుంది. రాడార్లు పనిచేయకుండా ఉండేందుకు అధిక సామర్థ్యం గల జామర్లను వెంట తీసుకెళ్లింది. లేజర్‌ ద్వారా స్థావరాలను గుర్తించి దాడులు జరిపింది. అందుకే భారత విమానాలు సురక్షితంగా తిరిగి రాగలిగాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ చేపట్టిన ఈ మెరుపుదాడులను అంతర్జాతీయ సమాజం ఖండించలేదు. దీంతో ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధిస్తున్నామని మోదీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.

క్షణ క్షణం…

సోమవారం సాయంత్రం హిందూ దర్మాచారం ప్రకారం ఉగ్రదాడిలో మరణించిన వీర సైనికులకు 11వ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ప్రపంచం యావత్తూ నిద్రలోకి జారుకోవడానికి ఒకవైపు సిద్దమవుతుండగా… మరోవైపు భారత సైనికులు మరోసారి భారతసత్తా చూపడానికి సంసిద్ధతగా ఉన్నారు. అత్యంత ముఖ్యులకు మాత్రమే సమాచారం అందజేసిన సైనిక ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం పులుల్లా వేచి చూస్తున్నారు. ఒక్కసారిగా సైనిక ప్రధాన అధికారులకు రావలసిన సమాచారం వచ్చింది. అంతే క్షణాల్లో పథకం రెడీ.. సైనికులు రెడీ.. వైమానిక, సాంకేతిక సిబ్బంది అంతా ఒక్కసారిగా 11 నిమిషాల్లో పరిస్థితి నిశ్శబ్దంగా మారింది. ఆపరేషన్‌ తొలి నుంచి తుది వరకు ఒక ప్రత్యేక కోడ్‌ ద్వారా ఎవరికీ అంతుబట్టని విధంగా పథకం పకడ్బందీగా అమలైంది.

ఇలా జరిగింది:

రాత్రి 8 .10 గంటలకు సైనిక ఉన్నతాధికారుల అత్యవసర భేటీ

8.40ని.లకు ప్రధానమంత్రికి సమాచారం

9.14 ని.లకు ఇతర ముగ్గురు ముఖ్యులకు వివరాలు

11.57 ని.లకు ఆపరేషన్‌ పై స్పష్టత

12.18 కి వైమానిక అధికారుల సమావేశం

1.40కి అపరేషన్‌ లో పాల్గొనే యుద్ద వీరులకు సమాచారం

1.52కి సైన్యం సంసిద్ధత

2.18కి ప్రత్యేక విమానంలో ప్లాష్‌ లేని ఫొటో, వీడియో కెమెరాల రాక

2.29కి అపరేషన్‌ లో పాల్గొనే విమానాల ఎంపిక పూర్తి

3.12 నిమిషాలకు సర్జికల్‌ వ్యూహం సైనిక వీరులకు అందజేత

3.20 ని.లకు మళ్ళీ ప్రాణాలతోళతిరిగి వస్తామో లేదో అని జాతీయ జెండాకు సైనిక వందనం

3.27 ని.లకు యుద్ధ విమానాలు ఎక్కిన వీర జవానులు

ఉదయం 3:30 – 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు గ్వాలియర్‌ నుంచి టేకాఫ్‌.

3:30 -3:35 – ఎల్వోసీని దాటిన భారత వైమానిక దళాలు.

3:45 – బాలాకోట్లోని జైషే క్యాంపుపై దాడి.

3:48 – ముజఫరాబాద్‌ టెర్రర్‌ లాంచ్ప్యాడ్పై దాడి.

4:06 – 20 నిమిషాల్లో 1000 కేజీల బాంబులతో ఉగ్రవాద క్యాంపులపై 44 సార్లు దాడి

4.21కి ముష్కరుల స్థావరాలన్నీ భస్మీపటలం చేసి సగర్వంగా వెనుదిరిగాయి.

5:00 – దాడిపై పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి ట్వీట్‌

9:53 – పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అధ్యక్షతన అత్యవసర భేటీ

9:55 – ఇండియన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ అప్రమత్తం

9:58 – భద్రతా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్‌ భేటీ

ఉదయం 10:20 – సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌ హైఅలర్ట్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here