తొలి ముద్దు ఎవరితో కోరుకుంది?

0

ధడక్‌ సినిమాతో జాన్వీ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ లో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా పైలెట్‌ గా శిక్షణ పొందుతోంది. అలాగే మొఘల్‌ సామ్రాజ్య వారియర్‌ కింగ్‌ షాజహాన్‌ (తాజ్‌ మహల్‌ నిర్మించిన రాజు) స్టోరీతో ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న తక్త్‌లోనూ జాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కరీనా కపూర్‌ ఆలియా భట్‌ అనీల్‌ కపూర్‌ విక్కీ కౌశల్‌ రణవీర్‌ భూమి సింగ్‌ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇదంతా కెరీర్‌ పరంగా జాన్వీ ప్రణాళిక. మరో కోణంలో జాన్వీని పరిశీలిస్తే ఈ అమ్మడికి యువతరంలో అసాధారణ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తనని ఆరాధించే వీరభక్తులు.. ప్రేమికులు ఉన్నా తాను ప్రత్యేకించి లైక్‌ చేసే ఓ ఛాయిస్‌ ఉంటుంది కదా? ఆ ఛాయిస్‌ గురించి టీవీ రియాలిటీ షో బీఎఫ్‌ ఎఫ్‌ విత్‌ వోగ్‌ కార్యక్రమం లో హోస్ట్‌ నేహా ధూపియా జాన్వీని ప్రశ్నించారు.సే ఇట్‌ ఆర్‌ స్ట్రిప్‌ ఇట్‌ అనే గేమ్‌ కేటగిరీలో జాన్వీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్‌- కార్తీక్‌ ఆర్యన్‌ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు? అని ప్రశ్నిస్తే.. ఎలాంటి తడబాటు లేకుండా యూరి కథానాయకుడు విక్కీ కౌశల్‌ కి ఓకే చెప్పేసింది జాన్వీ. రొమాంటిక్‌ కామెడీ లుకా చుప్పీతో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు. ఇక యూరి చిత్రంతో సంచలన విజయం అందుకున్న విక్కీ కౌశల్‌ కి యువతరంలో అంతే ఇమేజ్‌ ఉంది. ఈ ఇద్దరూ బాలీవుడ్‌ లో జోరుమీద ఉన్న యువహీరోలుగా పాపులరయ్యారు. అయితే జాన్వీ మాత్రం తొలి ముద్దు కోసం విక్కీ కౌశల్‌ నే ఎంచుకుంది.

ఇకపోతే తక్త్‌ చిత్రంలో విక్కీ కౌశల్‌ కి జాన్వీ పెయిర్‌ గా నటించనుందని తెలుస్తోంది. ఎలానూ కోస్టార్‌ కాబట్టి అతడినే ఎంపిక చేసుకుందా? లేక తనపై అంత క్రష్‌ ఉందా? అన్నది చూడాల్సి ఉంది. ఇకపోతే కార్తీక్‌ ఆర్యన్‌ ఇదివరకూ కృతిసనన్ తో డేటింగ్‌ చేశాడన్న రూమర్‌ ఉంది. ఇక నేహాధూపియా టీవీ షోలో జాన్వీ కపూర్‌ తో పాటుగా తన సోదరి ఖుషీ కపూర్‌ పాల్గొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here