Featuredరాజకీయ వార్తలు

తెలంగాణలో మొట్టమొదటి స్కాం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రస్థుతానికి యువరాజు. కాలం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఏ మచ్చా..లేదని వేదికలపై గర్జిస్తారు. 2014లో సుమారు 8కోట్లున్న ఆయన ఆస్తి ఏకంగా సుమారు 42 కోట్లకు పెరిగింది. అంటే అక్షరాలా 424% శాతం పెరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఊహించని శరాఘాతం ఏమిటంటే ఆయన ఓ కంపెనీ డైరెక్టర్‌. అదే కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా 313 కోట్ల కాంట్రాక్టు పని అప్పగించారు. ఆయనే మన యువరాజు కల్వకుంట్ల తారక రామారావు. పోలీసులశాఖకు 1418 వాహనాలున్నాయి. అందులో కేవలం 84 వాహనాలకు మాత్రమే మార్చాల్సి ఉంది. అధికారంలోకి రాగానే.. ఏంచక్కా… 313 కోట్లతో ‘ఇన్నోవా’ సంస్థకు చెందిన 1650 ఇన్నోవా ఈ గ్రేడ్‌ పిఎస్‌ ఏసి 8 నక్షత్రాల మోడల్‌ కలిగిన వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

సదరు కంపెనీ కథ: ఈ కాంట్రాక్టు చేజిక్కుంచున్న కంపెనీ కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే సరఫరా చేస్తోంది. కానీ ఇక్కడ మాత్రం నాలుగు చక్రాలతో తయారు చేయబడిన ఇన్నోవా వాహనాలకు ఢిల్లీ పోలీసుశాఖకు సికింద్రాబాద్‌ కు చెందిన సంస్థ అందిస్తుంది. ఆ కంపేనీ యువరాజుకు నచ్చలేదు. దీంతో ఏ కంపెనీకో ఎందుకు.. తన సొంత కంపెనీకే నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు.

అసలు కథ: హిమాంశు మోటర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనేది ఓ రిజిస్టర్‌ కంపెనీ. ఈ కంపెనీలో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, విద్యాసాగర్‌ అచ్చా అనే ముగ్గురు డైరక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ ద్విచక్రవాహనాలను మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ వాహనాల కొనుగోలుకు ఎలాంటి టెండర్లు పిలవలేదు. పదివేలు దాటితేనే టెండర్లు పిలవాల్సిన వ్యవహారంలో ఈ కంపెనీతో పాటు హర్ష టయోట కంపెనీకి 313 కోట్ల కాంట్రాక్టు ఏంచక్కా కట్టబెట్టారు. ఈ కంపెనీలో డైరెక్టర్‌ గా ఉంటూ… ప్రభుత్వ అధినేత కుమారుడిగా… మంత్రిగా ఈ నిర్ణయాన్ని కేటీఆర్‌ ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా లాభదాయకమైన పదవిలో కొనసాగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. 2017లో సిపిఎం పార్టీ రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ కు పిర్యాదు చేసింది. 2015లోనే ఈ తతంగం గురించి ప్రజాసత్తా పార్టీ గవర్నర్‌ తో పాటు మరో ఆరుగురికి లిఖితపూర్వకంగా పిర్యాదు ఇచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ అంతా నిశ్శబ్దంగా మారింది.

ఎలా బయటకు వచ్చింది..: సమాచారహక్కు చట్టం ద్వారా భానుమూర్తి అనే వ్యక్తి ఈ వాహనాల కోనుగోలుకు సంబంధించి వివరాలు కోరుతూ 2015లో దరఖాస్తు చేశారు. ఆ లేఖను మరో శాఖకు బదిలీ చేసి సంబంధిత అధికారులు చేతులు దులుపుకొన్నారు. సెప్టెంబర్‌ 30, 2015న లెటర్‌ నెంబర్‌. 891/ఎంఇ-4/ఆర్టీఐ/2015 సమాధానం లేదు. అనంతరం దరఖాస్తు దారుడు నవంబర్‌ 6, 2015న మొదటి అప్పీల్‌ చేశారు. దానికి స్పందించిన యంత్రాంగం డిసెంబర్‌ 21, 2015న ఎల్‌.డిస్‌. నెంబరు. 1400/ఎంఇ-4/అప్పీల్‌/2015 ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. అందులోని విషయాలు నీర్ఘాంతపోయే విషయాలున్నాయి. ఈ వాహనాల ప్రతిపాదన ఏదీ పోలీసుశాఖతో సంప్రదించలేదు. ఇక్కడ ఎలాంటి నిబంధనలను పాటించలేదు. మరి ఢిల్లీలో ఇలాంటి వ్యవహారంలో అక్కడి ప్రభుత్వానికి స్కార్పియో ఎస్‌4 బిఎస్‌4 2డబ్ల్యూ డి (నలుపు రంగు), సికింద్రాబాద్‌ కు చెందిన మహేంద్ర లిమిటెడ్‌ సరఫరా చేసింది. ద్విచక్ర వాహనాలను ఢిల్లీకి చెందిన రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ కంపెనీ బుల్లెట్‌ ఎలక్ట్రా యుసీఇ వాహనాలను సరఫరా చేసింది. మరో ఎనిమిది ప్రశ్నలకు సహజంగా ఆఫీసులో సమాచారం లేదని చెప్పారు. ఈ ప్రక్రియకు ఢిల్లీ డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాంటి ప్రక్రియ జరగలేదని సగర్వంగా తెలిపారు.

మీడియాను దబాయించిన కేటీఆర్‌: సాధారణంగా కేటీఆర్‌ మీడియాతో కలివిడిగా ఉంటారు. అయితే ఈ విషయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందన ఆశ్చర్యం కలిగించింది. ఆయన కంపెనీ డైరెక్టర్‌ అవునా.. ? కాదా..? అనే విషయంపై స్పష్టత లేదు.

నిస్తేజంగా నిఘా: ఏ చిన్నపాటి అవకతవకలు వెలంగుచూసినా హడావుడి చేసే నిఘా సంస్థలు ఈ మూడేళ్ళు మౌనంగా ఎందుకున్నాయి.? ఆ,యా నిఘా సంస్థలను ప్రభావం చేసిందెవరు.? ఈ కొనుగోలు వ్యవహారంలో అసలు విషయం వెలుగు చూస్తోందా..? లేక శాశ్వతంగా సమాధి కడతారా..? అన్నది భవిష్యత్‌ చెపుతోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close