స్పోర్ట్స్

పొలార్డ్‌కు జరిమానా..

హైదరాబాద్‌ : ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌కు జరిమానా పడింది. ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద అతనికి ఈ జరిమానా

విధించినట్లు ఐపీఎల్‌ యాజమాన్యం తెలిపింది. 19 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన డ్వేన్‌ బ్రావో రెండో బంతిని వైడ్‌కు దగ్గరగా వేశాడు. ఆ బంతిని అంపైర్‌

నితిన్‌ మేనన్‌ వైడ్‌గా ప్రకటిస్తాడని పొలార్డ్‌ భావించాడు. కానీ, వైడ్‌ ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన పొలార్డ్‌ బ్యాట్‌ను గాల్లోకి విసరేశాడు. ఆ తర్వాత

బంతి వేసేందుకు బ్రావో పరుగెత్తున్న సమయంలో క్రీజులో ఉన్న పొలార్డ్‌.. అంపైర్‌ నిర్ణయాన్ని అవహేలన చేసేలా.. వైడ్‌ను దాటి నడుస్తూ వెళ్లిపోయాడు.

దీంతో ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద పొలార్డ్‌కు మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత పడింది. ఈ మ్యాచ్‌ పొలార్డ్‌ 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి

ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close