ముఖ్యమంత్రే ఆర్థిక మంత్రి..! తాత్కాలిక బడ్జెట్‌కు కేబినేట్‌ ఆమోదం

0

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి గురువారం తొలిసారిగా సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఈ భేటీలో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సప్లిమెంటరీ డిమాండ్స్‌ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ భేటీకి మంత్రులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌, శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో భాగంగా 10మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసన సభ, శాసన మండలిలో ప్రభుత్వం తాత్కాలిక బ్జడెట్‌ ప్రవేశపెడుతుంది. ఆదివారం బ్జడెట్‌పై చర్చ జరుగనుంది. సోమవారం ద్రవ్యవిని యోగ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. మండలిలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. తొలిసారి సిఎం కెసిఆర్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం విశేషం. బడ్జెట్‌ ప్రతిపాదనలను గురువారం సాయంత్రం జరిగిన కేబినేట్‌ ఆమోదించింది. ప్రగతిభవన్ల్‌ఓ సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదించారు. శాసన సభ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25 వర కు జరుగుతాయి. మొత్తం 3 రోజులు సమావేశాలు సాగుతాయి. అందరి సహకారంతో శాసనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని స్పీకర్‌ పోచారం వెల్లడించారు. స్పీకర్‌ చాంబర్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మ న్‌ కె.స్వామిగౌడ్‌, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేము ల ప్రశాంత్‌రెడ్డి, ఎస్‌టీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనాకుమార్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పోలీసు అధికారులు, ట్రాఫిక్‌, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో భేటీకావడం ఆనవాయితీ అని మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ అన్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి అందరి సహకారం అవసరమని చెప్పా రు. శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ సమావేవాలు కావడంతో స్వల్పకాలమే అనగా ఐదురోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సమావేశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇకపోతే ఆర్థికమంత్రిగా సిఎం కెసిఆర్‌ ఇప్పుడు బడ్జెట్‌ సమర్పించబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినా ఆర్థికమంత్రిత్వ శాఖ మాత్రం సిఎం కెసిఆర్‌ తనవద్దనే ఉంచుకున్నారు. దీంతో తొలిసారిగా కెసిఆర్‌ ఆర్థిక మంత్రిగా పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్‌ ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. తాజా విస్తరణలో ఆయనకు వైద్యారోగ్యశాఖను కేటాయించారు. ఇకపోతే ఆర్థిక శాఖను తనవద్దనే ఉంచుకున్న సిఎం కెసిఆర్‌ గతకొంతకాలంగా బడ్జెట్‌పై అధికారులతో చర్చించి రూపకల్పన చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో పాటు వివిధ రంగాలకు కేటాయింపులపై స్వయంగా చర్చించారు. దీంతో అసెంబ్లీలో బడ్జెట్‌ను కెసిఆర్‌ ప్రవేశ పెడతారు. రాబోయే 2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో బ్జడెట్‌ను ప్రవేశపెడ్తారు. అంతకుముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బ్జడెట్‌కు ఆమోదం తెలియజేయనున్నది. గత నాలుగేండ్లుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బ్జడెట్‌ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి బ్జడెట్‌ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌లో పెద్దపద్దులన్నింటినీ సమగ్రంగా చేర్చినట్టు సమాచారం. చిన్నచిన్న పద్దులను బ్జడెట్‌లో పేర్కొనడం లేదు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హావిూల అమలుకు సంబంధించిన మొత్తాలను బ్జడెట్‌లో చేర్చినట్టు తెలిసింది. హావిూల అమలుపై ఇప్పటికే పలుసార్లు అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌లో అవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బ్జడెట్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో అందుకు అనుగుణంగానే మధ్యంతర బ్జడెట్‌ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చడానికి అవసరమయ్యే నిధులను మధ్యంతర బ్జడెట్‌లో పొందుపరిచినట్టు సమాచారం. పేద ప్రజలకు అందించే సామాజిక పింఛన్లను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో హావిూ ఇచ్చారు. తాజాగా పెన్షన్ల పెంపుతో మరో రూ.5 వేల కోట్లు అదనంగా బ్జడెట్‌లో కేటాయించనున్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలు పెట్టుబడి సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ సాయాన్ని ఎకరానికి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌లోనే నిధులు కేటాయిస్తారని తెలుస్తున్నది. ఈ మేరకు రైతుబంధు పథకం కింద నిధులను రూ.12వేల నుంచి రూ.15వేల కోట్లకు పెంచుతారని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు వ్యవసాయ రుణమాఫీకి రూ.20వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబీమాకు రూ.1500 కోట్లు కేటాయించే అవకాశముంది. ఇక వైద్య ఆరోగ్యశాఖకు దాదాపు రూ.10వేల కోట్లు, బీసీలకు రూ.5వేల కోట్ల నుంచి ఆరువేల కోట్ల వరకు, ఎస్సీలకు రూ.16వేల కోట్లు, ఎస్టీలకు రూ.9వేల కోట్లకు పైచిలుకు నిధులను కేటాయించే అవకాశముందని తెలిసింది. మొత్తానికి ఈ బడ్జెట్‌ సమావేశాలు ప్రత్యేకతను సంతరించు కోనున్నాయి. శాసనసభా వ్యవహారాల మంత్రిగా ప్రశాంత రెడ్డి కొత్త పాత్ర పోషించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here