ప్రశాంతంగా.. తుదివిడత పరిషత్‌ ఎన్నికలు

0

  • అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు
  • మంచిర్యాల జిల్లా బుద్ధపల్లిలో బ్యాలెట్‌పేపర్లు తారుమారు
  • అర్థగంటపాటు నిలిచిన పోలింగ్‌
  • పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
  • పోలింగ్‌ తీరును పర్యవేక్షించిన జిల్లాల కలెక్టర్లు

హైదరాబాద్‌ : తెలంగాణలో పరిషత్‌ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ చివరిదశ ఎన్నికల్లో భాగంగా మొత్తం 9,494 కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సగటున ఎంపీటీసీకి ముగ్గురు, జడ్పీటీసీకి ఐదుగురు వంతున అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు 6, 10 తేదీల్లో ఒకటి, రెండు దశల పోలింగ్‌ పూర్తి కాగా, మూడో దశను మంగళవారం నిర్వహించారు. తీవ్రవాద ప్రభావ ప్రాంతాలుగా గుర్తించిన కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 21 మండలాల పరిధుల్లో గల 205 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మిగతా అన్ని చోట్లా సాయంత్రం 5 వరకు కొనసాగింది. మూడో దశలో 1,738 ఎంపీటీసీలు, 161 జడ్పీటీసీల్లో ఎన్నికలను చేపట్టాల్సి ఉండగా.. ఎంపీటీసీల్లో 30 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీలకు 5,726 మంది బరిలో ఉన్నందున సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున పోటీపడుతున్నట్లయింది. జడ్పీటీసీలకు 741 మంది రంగంలో ఉండటంతో, సగటున ఒక్కో స్థానానికి ఐదుగురు పోటీలో ఉన్నట్లయింది. తొలిదశలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్‌, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌ ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఈ విడతలో 46.64లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పోలింగ్‌ సందర్భంగా వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట్‌ మండలం చంద్రయన్‌ పల్లి గ్రామంలోని బిక్కరెడ్డి గూడెలో ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పోలీసులకు అక్కడకు చేరుకొని వారికి నచ్చచెప్ప ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చుకున్నారు. దీంతో మహిళా కానిస్టేబుల్‌ మీరు మయటకు వెళ్లాలని పలుమార్లు చెప్పినా నువ్వు లేడీ కానిస్టేబుల్‌ వు నేను ఏవోని నువ్వేంటి నాకు చెప్పడం అని బుదలిచ్చారు. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్‌ను దుర్భాషలాడి నెట్టే ప్రయత్నం చేయడంతో కానిస్టేబుల్‌ చెపంపై కొట్టంది. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు వచ్చి అక్కడి నుంచి పంపించి వేశారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం పెద్దంపేట ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుద్ధపల్లిలో ఏర్పాటు చేసిన 4వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో గందరగోళం నెలకొంది. పెద్దంపేట ఎంపీటీసీ ఎన్నిక బ్యాలెట్‌ పత్రానికి బదులు.. రాపల్లి ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించడంతో రెండు గంటలకుపైగా పోలింగ్‌ నిలిచిపోయింది. ఈ పొరపాటును తొలుత అధికార యంత్రాంగం గుర్తించలేదు. దీంతో అప్పటికే 42 మంది ఒటర్లు రాపల్లి ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపరుపైనే ఓటు వేశారు. పెద్దంపేట ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి బ్యాలెట్‌ పేపరులో తప్పును గుర్తించారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో బుద్దపల్లిలో రెండు గంటలకుపైగా ఓటింగ్‌ నిలిచిపోయింది. అధికారుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆందోళన చేశారు. తక్షణం బ్యాలెట్‌ పత్రాలు మార్చాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారితో మాట్లాడి పోలింగ్‌ను పునరుద్ధరించడంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆందోళన విరమించారు. ఉదయమే ఓటు వేసిన 42 మంది ఓటర్లతో మళ్లీ ఓటు వేయిస్తామని ఎన్నికల అధికారి శేషాద్రి ప్రకటించారు. బ్యాలెట్‌ పత్రాలను సరిచూసుకోకుండా పోలింగ్‌ నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here