చివరకు నష్టాల్లోనే…

0

ముంబాయి : ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి సూచీలు సూచీలు చివరకు నష్టాల్లోనే క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు నష్టపోయింది. 38,981 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,724 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు మార్కెట్‌ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నిఫ్టీ 50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, హీరో మోటొకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 4 శాతం పెరిగాయి. అదేసమయంలో బ్రిటానియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 3 శాతం క్షీణించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ రియల్టీ మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా షేర్లు ఎక్కువగా పడిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here