భట్టి ముందే బాహాబాహీ!

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క సన్మాన సభలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కుర్చీలతో ఫైటింగ్‌ చేసుకున్నారు. గాంధీ భవన్‌ లో జరుగుతున్న భట్టీ సన్మాన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌ పేట నియోజక వర్గం నుండి టికెట్‌ ఆశించి భంగపడ్డ నూతి శ్రీకాంత్‌ వర్గీయులు..వీహెచ్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్‌, వీహెచ్‌ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓబీసిల ఆధ్వర్యంలో భట్టీకి జరుగుతున్న సన్మాన సభలో శ్రీకాంత్‌ వర్గీయులు వీహెచ్‌ డౌన్‌ డౌన్‌ అంటు నినాదాలు చేశారు. వీహెచ్‌ బీసీలకు అన్యాయం చేస్తుంటారనీ అటువంటి వ్యక్తి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారనీ..తమకు మాత్రం సరైన ప్రాతినిథ్య ఇవ్వలేదనీ గ్రేటర్‌ పరిధిలోని ఓబీసీ అధ్యక్షులుగా ఉన్న నూతి శ్రీకాంత్‌ ఆరోపించారు. ఈ క్రమంలో భట్టీ సర్ధి చెబుతున్నా వినని కార్యకర్తలు మరింత రెచ్చిపోవటంతో సన్మాన సభ అర్థాంతరంగా ముగిసింది. దీంతో భట్టీ తన ఛాంబర్‌ లోకి వెళ్లిపోయారు. ఇలా ఆయన సన్మాన సభ రసాభాసాగా మారిపోయింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. అంబర్‌పేట టికెట్‌ రాకుండా వీహెచ్‌ అడ్డుకున్నారని శ్రీకాంత్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌కు వ్యతిరేకంగా శ్రీకాంత్‌ వర్గీయులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీహెచ్‌ మాట్లాతుంటే అంబర్‌పేట్‌ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు గొడవకు దిగారు. వీహెచ్‌ డౌన్‌డౌన్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వీహెచ్‌కు వ్యతిరేకంగా శ్రీకాంత్‌ వర్గీయులు నినాదాలు చేశారు. అంబర్‌పేట్‌ టికెట్‌ రాకుండా వీహెచ్‌ అడ్డుకున్నారని శ్రీకాంత్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇదిలావుంటే బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల… వేలమంది సర్పంచ్‌లయ్యే అవకాశం కోల్పోయారన్నారు. బడుగు బలహీనవర్గాలపై ఎక్కువగా వేటు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో బడుగుబలహీనవర్గాల నేతలు బాధపడుతున్నారన్నారు. భట్టి విక్రమార్కను ఓడించాలని చాలా మంది ప్రయత్నించారని, అయినా వారి వల్లకాలేదని వీహెచ్‌ అన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ భట్టి ముందుకెళ్లాలని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here