Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కాంగ్రెస్‌లో లొల్లి

  • రసాభాసగా మారిన సమావేశం
  • ఆజాద్‌ ముందే నేతల పరస్పర విమర్శలు

హైదరాబాద్‌

అధికారంలో వున్నా.. అధికారానికి దూరమైనా కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరే వేరు. అంతర్గత ప్రజాస్వామ్యం అపారంగా వున్న కాంగ్రెస్‌ పార్టీలో రేగిన రచ్చకు మంగళవారం గాంధీభవన్‌ మరోసారి గొడవలకు సాక్షిగా నిలిచింది. సాక్షాత్తు జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ సమక్షంలో సీనియర్ల మధ్య రగిలిన రచ్చతో గాంధీ భవన్‌ దద్దరిల్లింది. ఇంతకీ సీనియర్లను డెడ్‌ బాడీస్‌ అన్నదెవరు ? కాంగ్రెస్‌ పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ రక్తమంటూ ఆరోపించిందెవరు ? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందెవరు ? సీనియర్ల మధ్య కొత్త చిచ్చు రేపింది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా కుదిరిన సమీకరణలు, దోస్తీలు కాక రేపుతున్నాయి. ఇంతకీ గులాం నబీ ఆజాద్‌ రాకతో ఎందుకు వివాదం రగిలింది ? నిజానికి ఆజాద్‌ ఎప్పుడొచ్చాడన్నదే వివాదానికి నాందీ ప్రస్తావన. ఆజాద్‌ రాకతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారడానికి ఆజాద్‌ పర్యటనే కారణమైంది. గాంధీభవన్‌లో గులాంనబీ ఆజాద్‌ ఎదుటే కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌-షబ్బీర్‌ అలీ పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. గాంధీభవన్‌లో రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఎదుటే ఆ పార్టీ సీనియర్లు వాగ్వాదానికి దిగారు. సీనియర్‌ నేతలు వీహెచ్‌, షబ్బీర్‌ అలీ తీవ్ర పదజాలంతో పరస్పరం దూషించుకున్నారు. పార్టీలో అసలైన సీనియర్లకు న్యాయం జరగడం లేదని వీహెచ్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాద్‌ సమక్షంలోనే వీరిద్దరు బూతులు తిట్టుకోవడంతో ఆయన మౌనంగా వుండిపోయినట్లు సమాచారం. మిగిలిన వారంతా సముదాయించడంతో షబ్బీర్‌ సమావేశంలో వుండిపోగా.. విహెచ్‌ సమావేశం నుంచి అలిగి వెళ్ళిపోయారు. నేరుగా విలేకరుల సమావేశంలోకి వచ్చి? గొడవ జరిగింది వాస్తవమేనని.. మీకు తోచింది మీరు రాసుకోండని మీడియాకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. వీహెచ్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకులేదని షబ్బీర్‌ అలీ తెలిపారు.. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు గులాం నబీ ఆజాద్‌ పార్టీ నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆజాద్‌ వద్దకు వీహెచ్‌ వెళ్లారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రతి అంశంలో షబ్బీర్‌అలీ రేవంత్‌ రెడ్డికి తోడ్పాటుగా నిలుస్తున్నారంటూ వీహెచ్‌ ఫిర్యాదు చేశారు. పార్టీలో అసలైన సీనియర్లకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారని ఆజాద్‌ ఎదుట ప్రస్తావించారు. అక్కడే ఉన్న షబ్బీర్‌ అలీ జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వీహెచ్‌ మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించి గాంధీభవన్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close