Featuredఅంతర్జాతీయ వార్తలు

ప్రశాంతంగా ఐదవ విడత పోలింగ్‌

  • పుల్వామాలో పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ దాడి
  • అప్రమత్తమైన భదత్రా బలగాలు
  • నేనే గెలుస్తానంటూ దీమా: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): స్వల్ప ఘర్షణలు మినహా ఐదవ విడత సార్వత్రిక ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా సాగాయి. 7 రాష్ట్రాల్లోని 51లోక్‌ సభ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగింది. యూపీలోని 14,జార్ఖండ్‌ లోని 4, బీహార్‌ లోని 5, వెస్ట్‌ బెంగాల్‌ లోని 7, రాజస్థాన్‌ లోని 12, మధ్యప్రదేశ్‌ లోని 7, జమ్మూకశ్మీర్‌ లోని 2లోక్‌ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5గంటల వరకు యూపీలో 45.87శాతం, జార్ఖండ్‌ లో 58.07శాతం, వెస్ట్‌ బెంగాల్‌ లో 65.01శాతం, బీహార్‌ లో 48.12శాతం, జమ్మూకాశ్మీర్‌ లో అత్యల్పంగా 15.51శాతం,రాజస్థాన్‌ లో 51.99శాతం,మధ్యప్రదేశ్‌ లో 54.39శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. బీహార్‌లో ఎన్నికల్లో భాగంగా చప్రాలో రంజిత్‌ పాశ్వాన్‌అనే వ్యక్తిని ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌, ఈవీఎంలు పనిచేయకపోవటంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయాన్నే ఓటువేసేందుకుపోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌ పుల్వామాలో ఓ ఉగ్రవాది పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ విసిరాడు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ బరక్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. వారి దాడిలో తాను గాయపడినట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి లక్నోలోని మాంటీసోరి ఇంటర్‌ కాలేజీ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. అందరికీ ఓటు వేసే హక్కు ఉందని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆమోథిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీపై మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం ప్రియాంకకు తన పేరు తెలియదని, కానీ కొద్దిరోజులుగా తన పేరును జపిస్తోందన్నారు. ఆమె భర్త రాబర్ట్‌ పేరు కంటే తన పేరే ఎక్కువ వాడుతోందంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌, ప్రియాంకాలు రాజకీయాలను సొంత లాభం కోసం వాడుతున్నారని, మనషుల ప్రాణాలంటే కూడా వారికి లెక్కలేదన్నారు. అమేథిలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీ ట్రస్టీగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయనందున ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని తెలిపారు. బీజేపీ నేత, కేంద్ర ¬ంశాఖ మంత్రి, లక్నో బీజేపీ ఎంపీ అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌.. లక్నోలోని స్కాలర్స్‌ ¬మ్‌ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ గెలవటం ఖాయమని, నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవ్వబోతున్నారని జోష్యం చెప్పారు. కాగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో వద్ధులు, వికలాంగులకు ఓటు వేయటానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ ఆయన సతీమణి గాయత్రి రాథోర్‌ జైపూర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా దంపతులు హజరీబాగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. యశ్వంత్‌ కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా జార్ఖండ్‌నుంచి లోకసభ స్థానానికి పోటీ చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల అధికారులు అందంగా ముస్తాబు చేశారు. తమ సమస్యలను పరిష్కరించని కారణంగా కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎన్నికల బహిష్కరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఐదవదశ పోలింగ్‌ జరుగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొంతమంది ఓటర్లు ఎండ నుంచి రక్షణకు గొడుగులను తమ వెంట తెచ్చుకుంటున్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని బూత్‌ నంబర్‌ 450లో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసింది. ఒక వ్యక్తి ఆమెను ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రానికి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే సోమవారం పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ నియోజకవర్గం కూడా ఒకటి. దీని పరిధిలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓటర్లకు ఇక్కడ పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఎవరు, వారి పేర్లు తెలియదు.. కానీ, ఓటేయడానికి మాత్రం 8 గంటలపాటు కొండలు, గుట్టలు విూదుగా ప్రయాణించి పోలింగ్‌ కేంద్రానికి రావడం విశేషం. ఇది బేతుల్‌ పరిధిలోని భాంద్రపాని గ్రామంలోని గిరిజనుల పరిస్థితి. మారుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఈ గ్రామానికి చెందిన మొత్తం 300 మంది 42 డిగ్రీల ఎండను కూడా లెక్కచేయకుండా ముందు రోజు బయలుదేరి 8 గంటల ప్రయాణం తర్వాత పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వీరికి ఈ కష్టాలు తప్పకపోయినా ఓటేయడానికి మాత్రం ఉత్సాహంగా వస్తారు. గ్రామస్థులంతా ఒకేసారి సమూహంగా బయలుదేరి, కొండలు దాటుకుని వచ్చి ఓట్లేస్తారు. పోటీలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేకపోతే సీఎం కమల్‌ నాథ్‌లే అభ్యర్థులుగా భావించడం విస్మయం కలిగించే అంశం. మారుమూల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నడుమ బేతుల్‌ జిల్లా కేంద్రానికి 90 కిలోవిూటర్ల దూరంలో భాంద్రపాని గ్రామం ఉంది. కాగా ఓటింగ్‌కు వచ్చిన వారిలో.. తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంత మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలిగించినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, విూ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఎవరంటే మాత్రం తెల్లమొహం వేయడం గమనార్హం.

ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి – ప్రధాని మోదీ ట్వీట్‌

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్‌కి ముందు ఓటర్లకు సందేశమిస్తూ ఉత్సాహపరుస్తున్న ప్రధాని మోదీ.. ఐదో విడత ఎన్నికలు సందర్భంగానూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిసారీ యువ ఓటర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ఆయన ఈసారి కూడా రికార్డు స్థాయిలో వారిని ఓటింగ్‌లో పాల్గొనాలన్నారు. 'ఐదో దశ ఎన్నికల సందర్భంగా ఓటు వేయబోతున్న వారందరూ అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నానని, ప్రజాస్వామ్య బలోపేతంతో పాటు సుస్థిర దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావాలని ట్విటర్‌ వేదికగా మోదీ వ్యాఖ్యానించారు. అలాగే భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌సైతం ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close