Featuredస్టేట్ న్యూస్

ఫీజు వాపస్‌.. సిగరేట్‌ వల్లే.. అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నాంపల్లి నుమాయిష్‌ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎగ్జిబిషన్‌ సొసైటీ కొంత ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫైర్‌ యాక్సిడెంట్‌లో దగ్ధమైన స్టాల్స్‌ ఫీజు వెనక్కి ఇస్తామన్నారు. కాలిపోయిన స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని నిర్ణయించారు. ఎవరెంత నష్టపోయారో నివేదిక వచ్చాక అందులో సగం మొత్తం చెల్లించాలని సొసైటీ నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని డెసిషన్‌ తీసుకున్నారు. అదనపు 15 రోజుల్లో సందర్శకుల టికెట్ల మొత్తాన్ని నష్టపోయిన బాధితులకు పంపిణీ చేస్తామన్నారు.

  • నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కీలక నిర్ణయాలు
  • అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్టాల్స్‌ పీజు వెనక్కి
  • కాలిపోయిన స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని నిర్ణయం
  • ఎవరెంత నష్టపోయారో నివేదిక వచ్చాక సగం మొత్తం చెల్లించాలని నిర్ణయం
  • ఎగ్జిబిషన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయం
  • అదనపు 15రోజుల్లో సందర్శకుల టికెట్ల మొత్తాన్ని నష్టపోయిన స్టాల్స్‌కు పంపిణీ 2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 40కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 175 స్టాల్స్‌ కాలిబూడిదయ్యాయి. మరో 225 స్టాల్స్‌ పాక్షికంగా దహనమయ్యాయి. దగ్ధమైన స్టాళ్లలో చేనేత, దుస్తులు, గృ¬పకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, చెప్పుల స్టాల్స్‌ అధికంగా ఉన్నాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. సర్వస్వం కోల్పోయి రోడ్డుపడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దుకాణాల నిర్వాహకులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ వారికి కొంత ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది.

సిగరేట్‌ వల్లే.. అగ్ని ప్రమాదం : నాంపల్లిలోని నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారుల కంటే తమకే ఎక్కువ బాధ ఉందన్నారు. బాధితులను ఎగ్జబిషన్‌ సొసైటీ ఆదుకుంటుందని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని తాము అనుకోవడం లేదని ఈటల అన్నారు. ఓ షాపు వద్ద ఎవరో కాల్చిన సిగరెట్‌ వేయడం వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిలో కుట్రకోణం ఉందా? లేదా? అన్నది పోలీసులు తేలుస్తారని అన్నారు. ఎగ్జిబిషన్‌ల్లో స్టాళ్లను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఏర్పాటుచేశామని, అయితే షాపుల యజమానులు లోపల ప్లైవుడ్‌, కర్రలతో తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఈటల తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న ఫైరిజన్‌లు మంటలను ఆర్పడం ప్రారంభించిందని, ఇందులో సిబ్బంది ఏమరపాటు ఏవిూ లేదని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్‌లోని షాపులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్‌ లేదని, బాధితులకు సొసైటీ తరుపున తక్షణ సాయం అందిస్తామన్నారు. వ్యాపారులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌ కారణంగా రోజూ ట్రాఫిక్‌ జామ్‌ జరగడంతో దీని నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేయాలనుకుంటున్నట్లు ఈటల తెలిపారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ అనేది వ్యాపార సంస్థ కాదని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో 18 విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అనాథ పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభించాలనుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం జరిగిన ఘటన చాలా బాధాకరమని, సహాయచర్యలు పూర్తిచేసి రెండ్రోజుల్లో ఎగ్జిబిషన్‌ తిరిగి ప్రారంభిస్తామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సవిూపంలో ఉన్న ఫైరింజన్‌లో నీళ్లు లేకపోవడంతో సహాయచర్యలు ఆలస్యమయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఫైర్‌ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడంతోనే మరింత నష్టం తప్పిందన్నారు. ఈ ప్రమాదంపై రెండ్రోజుల్లో నివేదిక వస్తుందని.. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలన్నది ఆలోచిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎగ్జిబిషన్‌లోని ప్రతి షాపులో ఫైర్‌ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఒక్కో వ్యాపారికి లక్షల్లో నష్టం : హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నష్టంపై ప్రాథమిక అంచనాలు వేసినా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇక్కడ వ్యాపారలు చేసి బతుకుదా మని వచ్చిన వారు తమ సరుకంతా భస్మీపటలం కావడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఓ బ్యాంకు స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. తొలుత మంటలు 10 స్టాళ్లకు వ్యా పించడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన అధికారులు ప్రమాద నివారణ చర్యలను చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ తమ సరుకంతా అగ్నికి ఆహూతైం దంటూ వ్యాపారులు బోరున విలపిస్తున్నారు. స్టాళ్లలో బట్టలు సహా అనేక వస్తువులు విక్రయిస్తుంటారు. మంటల వ్యాప్తితో అన్ని కాలిబూడదయ్యాయి. ఒక్క మెటీరియల్‌ తీసుకొనేందుకు వీలు పడలేదు. మొత్తం కాలిపోయింది. ఏటా మేం రూ.30లక్షల సరుకు అమ్ముతాం. ఈ ప్రమాదంతో అదంతా కాలి బూడిదైందని ఓ వ్యాపారి వాపోయాడు. లక్షల విలువ చేసే సరుకు కాలిబూడిదయ్యిందనిబోరున విలపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఏటా ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఎప్పుడూ ఇలా జరగలదేని వాపోయారు. నిత్యం వేలాదిమంది సందర్శకులు.. సెలవురోజుల్లో లక్షకుపైగా వచ్చే కొనుగోలు దారులు.. పిల్లలు, పెద్దలతో నుమాయిష్‌ నిత్యం కిటకిటలా డుతుంది. అడుగు తీసి అడుగుపెట్టలేనంత రద్దీ ఉంటుంది. ఇలాంటి చోట సందర్శకుల భద్రతకు నిర్వాహకులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఉండాలి. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంతో భద్రతా లోపాలు వెలుగుచూశాయి. అత్యధిక స్టాల్స్‌ బుగ్గిపాలు కాగా సందర్శకు లకు ప్రాణపాయం తప్పింది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్‌ ప్రదర్శనను 79 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉండటంతో ఎగ్జిబిషన్‌ నిర్వాహణలో ఎప్పుడూ అవాంతరాలు ఏర్పడలేదు. లోపాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఏటా నిర్వహిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకపోయినా అనుమతులు యథేచ్ఛగా జారీ చేస్తున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2500 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలిక షెడ్లలో పెడుతున్నారు. వస్త్రాలతోనే ఎక్కువ స్టాల్స్‌ను రూపొందించారు. వీటిలో అత్యధికం వస్త్ర సంబంధిత, పాదరక్ష లు, లెదర్‌బ్యాగులు, ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయ కేంద్రాలే ఉన్నా యి. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయి. దుకాణాలకు, లైటింగ్‌ కోసం విద్యుత్తు తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అగ్గి రాజుకున్నా.. మంటలు దావానంలా వ్యాపించే ప్రమాదం ఉందని బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం నిరూపించింది. ప్రదర్శన నిర్వహణలో లోపాల కారణంగా అగ్నిప్రమాదం ఇప్పుడు పేద వ్యాపారులను రోడ్డున పడేసింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close