Friday, October 18, 2024
spot_img

నువు గోకు గోకపో గోకుతూనే ఉంటా.

తప్పక చదవండి

స్మశానానికి ముగ్గు ఉండదు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అన్నది నానుడి కొన్ని నెలల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కేంద్రంలోని బిజెపి సర్దార్ కు ఒక సవాల్ విసిరిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో ఉన్న బిజెపి ముఖ్య నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు గోకుకున్న నేను మిమ్మల్ని గోకుతోనే ఉంటానని సవాల్ విసిరిన విషయం మనందరికీ తెలిసిందే అందుకు తగ్గట్టే కార్యక్రమం కూడా పూనుకున్నట్టు తాజా పరిస్థితిలో రుజువు చేస్తున్నాయి గత కొంతకాలంగా కేసీఆర్ వ్యవహార సరళిని నిశ్చితంగా గమనిస్తే మనకు అవగతం అవుతుంది కోరి కొరివి పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా విషయాల్లో ఇరుకునబెట్టే వ్యాఖ్యానాలు చేస్తూ రెచ్చగొట్టే ధోనితో వ్యవహరిస్తున్న శైలిని గమనిస్తున్నాం నిజానికి ఈ ప్రవర్తనం అంతా కూడా కేసీఆర్ నైజానికి వ్యతిరేకమైంది ఢిల్లీ తో ఎలా మెసులుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరేనేతకు తెలవదు అంటే అతిశయోక్తి కాదు నిజానికి కెసిఆర్ కు ఢిల్లీ రాజకీయాలు కొత్తవి కాదు ఒకనాడు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడే జాతీయస్థాయిలో గులాబీ ఆజాద్ సంజయ్ గాంధీ అహ్మద్ పటేల్ లాంటి దిగ్గజాలతో ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడిపిన అనుభవం ఉన్న నేత యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో ఎన్ని దాటవేసే కార్యచరణకు పూనుకున్నప్పటికీ ఎంతో నైపుణ్యంతో వ్యవహరించిన విషయం తెలిసిందే ఒక దశలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నాడు తెలంగాణ విషయాన్ని అటకెక్కిచ్చిందన్న వార్తలు వినిపించినప్పటికీ కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో అటు యూపీఏ ప్రభుత్వాన్ని ఓ కంట కనిపెడుతూనే ఇటు తెలంగాణ ప్రజానీకాన్ని తన మభ్యపెట్టేవాడు ఎక్కడ కూడా యూపీఏ పై యుద్ధం ప్రకటించిన దాఖలాలు కనిపించవు రాష్ట్రంలో తెలంగాణకు బద్ధ శత్రువు అయిన కరుడుగట్టిన సమైక్యవాది వైయస్ రాజశేఖర్ రెడ్డి నీ సైతం పళ్ళు ఎత్తి మాట అన్న సందర్భాలు లేవు నాడు తెలుగుదేశంలో కూడా కేవలం మేధావి నాయకుడిగా చలామణిలో ఉన్నాడు తప్ప ఎక్కడ యుద్ధం చేసిన దాఖలాలు కనిపించవు తాజాగా కెసిఆర్ లో వచ్చిన ఈ మార్పును చాలామంది ఆసక్తిగా గమనిస్తున్నారు కేసీఆర్ వ్యవహార శైలిని ఎరిగిన చాలామంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదంతా బిజెపి కుట్రలో కేసీఆర్ పావుగా మారాడని భావిస్తుండగా మరి కొంతమంది ఒక అనివార్యమైన యుద్ధంగా విశ్లేషిస్తున్నారు యూపీఏ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కెసిఆర్ పై అనేక అవినీతి ఆరోపణలు వినిపించాయి ముఖ్యంగా సహారా కుంభకోణం లో కెసిఆర్ పాత్ర పై అనేక వార్తలు వచ్చాయి ఈ కేసులోనే కెసిఆర్ కు అనేక చిక్కులు వచ్చి పడతాయని జైలు కూడా వెళ్తారన్న వార్తలు నాడు గుప్పుమన్నాయి కానీ ఇది ఏమీ జరగలేదు యూపీఏ ప్రభుత్వం అనంతరం ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వంతో మొదటి దశలో కొంత సన్నితంగా ఉన్నప్పటికీ క్రమకరమైన సంబంధాలు మసకబారుతున్నాయి అన్న వార్తలు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనేక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంలో మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే కొన్ని వివాదాస్పద చట్టాల్లో విషయంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించినప్పటికీ కేసీఆర్ మాత్రం తన సమర్ధతను ఇచ్చి తన విధేయతను చాటుకున్నాడు ఆ తర్వాత పరిణామాల క్రమంలో ఆ బిల్లును బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంతో నాటి నుండి టిఆర్ఎస్ బిజెపిల మధ్య తెలంగాణ స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కేసీఆర్ జైలుకు వెళ్తాడని బండి సంజయ్ ప్రకటనలు విడుదల చేయడం దానిపై రాజకీయ దుమారం చెలరేగడం చూస్తూ వచ్చాం కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జాతీయస్థాయిలో చర్చ జరగడం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో కొంత అబాసు పాలు కావడంలో తెలంగాణ బిజెపి కొంత సక్సెస్ అయ్యింది తాజాగా ఢిల్లీలో ఏర్పడ్డ లిక్కర్ స్కాం డొంక లాగితే తెలంగాణలో మూలలు బట్టబయలు అయ్యాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయ పేరే బయటికి పొక్కడంతో మింగలేక కక్కలేక టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఆత్మరక్షణలో పడ్డ పరిస్థితిని మనం గమనిస్తున్నాం కవిత కోటరీలో చాలామందికి నోటీసులు అన్ని విషయం మనకు తెలిసిందే ఈ కేసులో కవిత కూడా అరెస్ట్ అవుతారన్న వార్తలు తెలంగాణ రాజకీయాల్ని మరింత వేడెక్కించిన విషయం కూడా తెలిసిందే ఈ క్రమంలో మునుగోడు ఎన్నికలు చావుతప్పి కళ్ళు లొట్టలు పోయిన పరిస్థితిని మనం గమనించాం అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని గెలవాలన్న టిఆర్ఎస్ వ్యూహాన్ని బిజెపి రూపంలో కొంతమేర నివారించగలిగింది అర కో రా మెజార్టీతో గెలిచి ఆత్మస్థర్యాన్ని కొంతమేర నిలుపుకుంది తాజాగా ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని తెరపైకి తెచ్చి తన సచ్చిలతను ప్రజల ముందు ఉంచాలన్న వ్యూహం సైతం కొంతమేర బెడసి కొట్టింది ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేని అత్యంత నిజాయితీపరుడైన బిజెపి అగ్రనేత ఆర్ఎస్ఎస్ ప్రచారకైన బిజెపి సంఘటన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను లాగడం ద్వారా తన పతనానికి తానే దారి వేసుకుంది అవతలిపక్షాన్ని దెబ్బతీయాలన్న అక్క సుతప్ప విషయంపై పూర్తిగా కసరత్తు చేయకుండానే హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడంతో తన వాదనలో పసలేదన్న విషయం బట్ట బయలు అయింది తాజాగా కేసులోని డొల్లతనాన్ని హైకోర్టు ప్రశ్నించి స్టే విధించిన విషయం తెలిసిందే భారత రాష్ట్ర సమితి ద్వారా దేశ రాజకీయాల్లో చతంతిప్పలన్న కెసిఆర్ మది నుండి పుట్టిన విషపురుగు బిఎల్ సంతోష్ పై కేసు నమోదు భారతీయ జనతా పార్టీకి జాతీయ సంఘటన కార్యదర్శి ఉన్న బిఎల్ సంతోష్ పై కేసు నమోదు చేయడం ద్వారా జాతీయ స్థాయిలో తనకు తన నాయకత్వ సామర్థ్యానికి పరపతి పెరుగుతుందన్న దురాలోచనకు కారణభూతం అయింది నిజానికి ఈ విషయంలో కూడా కేసీఆర్ సెల్ఫ్ గోల్ అయినట్టే మరే ఇతర నాయకులపై ఆరోపణలు వచ్చిన పరిస్థితులు వేరుగా ఉండేవి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచ రక్ ఆరోపణలు చేయడంతోనే కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టింది రాజకీయాల్లో చాణిక్య నీతి ప్రదర్శించడం ఆచరించడం చూస్తూ ఉంటాం కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా శకుని నీతిని నమ్ముకున్న ఏకైక నేతగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఒకటి మాత్రం కెసిఆర్ గుర్తుంచుకోవాలి ఎక్కడపడితే అక్కడ గోకితే మన గోర్లే దెబ్బతింటాయి అన్న విషయం తాజాగా సార్ కు అర్థమైనట్టు ఉంది.

  • దొమ్మాట వెంకటేష్
    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9848057274
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు