Friday, October 18, 2024
spot_img

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా..

తప్పక చదవండి
  • ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా..
  • సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం కాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని.. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీపై తనకు సమాచారం లేదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు