Friday, October 18, 2024
spot_img

కారెక్కేదెవరు… దిగేదెవరు….?

తప్పక చదవండి
  • వలస వచ్చిన నాయకులతో పరేషాన్‌
  • ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురికి పైగా టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులు..
  • ఎవరికివారే ఇష్టానుసారంగా కార్యక్రమాలు.. తమకే సీటు అంటూ ప్రచారం
  • అన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులుగా విడిపోయిన బీఆర్‌ఎస్‌ నాయకులు
  • పార్టీ టికెట్‌ దక్కకపోతే ఇండిపెండెంట్‌ గా పోటీచేస్తామని అధిష్టానానికి సంకేతాలు
  • నాయకుల తీరుతో నీరుగారుతున్న క్యాడర్‌.. ఎవరికి జై కొట్టాలో తెలియని అయోమయం
    ఎనుకట ఓ పెద్దమనిషి చెప్పిన సామెత గుర్తొస్తుంది.. పొట్టోణ్ణి పొడుగోడు గోడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట.. అట్లుంది బీఆర్‌ఎస్‌. నాయకుల యవ్వారం. ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మొదలు పెట్టిన చేరికల పర్వం చిలికి చిలికి గాలివానగా మారి.. చివరికి బీఆర్‌ఎస్‌ అధినాయకుల తలకే చుట్టుకుంది. ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకున్న చేరికలు ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురుకు మించి అభ్యర్థులు తమకు టికెట్‌ కావాలంటూ బహిరంగంగానే కొట్లాడుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి సరిగ్గా చేయలేకపోయారని.. తమకు అవకాశం కల్పిస్తే మంచి అభివృద్ధిని చేసి చూపిస్తామని నమ్మకం కలిగించే ప్రయత్నాలు నియోజకవర్గాల్లో మొదలు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడమే గాక, ఇష్టానుసారంగా ఎవరికివారే అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్‌ ఎవరి వైపు పనిచేయాలన్న సందిగ్దత ఏర్పడిరది. ఆదాబ్‌ పొలిటికల్‌
    కరెస్పాడెంట్‌ వాసు అందిస్తున్న ప్రత్యేక కథనం..
    హైదరాబాద్‌ : ఒక మూర్కుడు సృష్టించే విధ్వంసం కంటే ఒక మేధావి మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఎక్కడో చదివాను. ఇప్పటికిప్పుడు అధి కార పార్టీకి రెబల్స్‌ తో బెడద లేనప్పటికీ ఎన్నికలు సవిూపించినవేళ మాత్రం ప్రమాదం పొంచివుందని పలువురు రాజకీయ మేధావులు చెబుతున్న మాట. బీ.ఆర్‌.ఎస్‌. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇష్టానుసారంగా చేరికల పర్వం మొదలుపెట్టింది. కానీ పార్టీ ప్రతిష్టతను, పార్టీని నమ్ముకున్న నాయకులను పట్టించు కున్న పాపాన పోలేదు. స్థానికంగా ఎమ్మెల్యే ఉండగానే అతని ప్రత్యర్థిని పిలిచి మరీ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ అభ్యర్థికే బల్లెంలా తయారుచేసి కూర్చుంది. ఒక పక్క పార్ట్టీ ప్రముఖులు సీఎం, హరీష్‌ రావు, కేటీఆర్‌, కవితకు మినహాయించి మిగిలిన అభ్యర్థుల్లో 80కి శాతం పైగా అభ్యర్థులకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు. స్థానిక ఎమ్మె ల్యే చేపడుతున్న అధికార కార్యక్రమా లకు సైతం రెబల్స్‌ అడ్డు తగు లుతున్నారు. దీనిపై అధికార పార్టీ ముఖ్యనాయకులు జోక్యం చేసు కోకపోవడంతో రెబల్స్‌ పనులకు అడ్డుఅదుపులేకుండా పోయింది. దీంతో పలు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు.
    ఈ సారి టికెట్‌ తమకేనంటూ రెబల్స్‌ ప్రచారం : పలుచోట్ల ఇష్టాను సారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు రెబల్స్‌ చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ క్యాడర్‌ ను పూర్తిగా తమవైపు తిప్పు కోవాలనే తొందరలో పార్టీ పతనావస్థకు చేరుతున్నా పట్టించుకోవ డంలేదు. స్థానికంగా ఇపుడున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే పనితీరు ఏవిూ బాగాలేదని వీరే ప్రచారంచేస్తూ ప్రతిపక్ష పార్టీల శ్రమను తగ్గిస్తు న్నారు. పార్టీని, కార్యకర్తలను గ్రూపులుగా విడగొట్టి పార్టీని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి రెబల్స్‌ శ్రీకారం చుట్టారు. ఇందులో ఒకరిది సీఎం కేసీఆర్‌, మినిష్టర్‌ కేటీఆర్‌ వర్గం అయితే.. మరొకరిది హరీష్‌ వర్గం ఇంకొకరిది కవిత, సంతోష్‌ల వర్గం ఇలా 119 స్థానా ల్లోని అభ్యర్థులునాలుగు, ఐదువర్గాలుగా చెల్లాచెదురయి పోయారు. వీరందరూ ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులు కావడంతో కారుకు పరేషాన్‌ వచ్చి పడిరది. వీరిలో ఎవరిని దగ్గరికి తీసుకోవా లో ఎవరిని దూరం పెట్టాలో అర్ధం కాని పరిస్థితి ఏర్ప డిరది. ఇప్పు డున్న పరిస్థితుల్లో బీ.ఆర్‌.ఎస్‌. అధిష్టానం తమ అభిప్రా యాన్ని నిక్కచ్చిగా చెప్పక పోయిన రానున్న రోజుల్లో సమాధానం చెప్పక తప్పదని తెలుస్తోంది. రెబల్స్‌కు అధిష్టానం టికెట్‌ నిరాకరిస్తే అప్పు డు గ్రూపులుగా విడిపోయిన క్యాడర్‌తో నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు