Sunday, October 27, 2024
spot_img

తమ్ముడూ మందకృష్ణా.. 30ఏళ్ళు పోరాడావ్‌

తప్పక చదవండి
  • మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా…
  • ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తాం
  • చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం
  • సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడివుంది
  • మందకృష్ణ మాదిగను అభినందించిన ప్రధాని మోడీ
  • దళిత సీఎం అంటూ మోసం చేసిన కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ను ఓడిరచి అవమానించిన కాంగ్రెస్‌
  • మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ వెల్లడి

హైదరాబాద్‌ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా త్వరలో ఓ కమిటీ వేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ..ఈ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందున్నారు. 30ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారన్నారు. ఇంత కాలం మాటలు చెప్పి .. అమలు చేయని రాజకీయ పార్టీల తరపున తాను క్షమాపణ చెబుతున్నాన్నారు. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు. మాదిగలకు అన్యాయం జరిగిందని మేం భావిస్తున్నాం. మాదిగల బిడ్డ బంగారు లక్ష్మణ్‌ నేతృత్వంలో నేను పనిచేశా. ఓ కార్యకర్తగా బంగారు లక్ష్మణ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. తెలంగాణ లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం కలిచివేస్తోంది. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను విూతో కలిసి పనిచేస్తా. 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారని మోడీ అన్నారు. స్వాతంత్యర్ర వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు.. మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉంది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అనేది మా విధానం. మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు. వన్‌ లైఫ్‌, వన్‌ మిషన్‌లా మందకృష్ణ పోరాటం చేశారు. 30 ఏళ్ల మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు. పేదరిక నిర్మూలనే మా ప్రధమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చా. ఇకపై విూరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని మోదీ అన్నారు. మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తాం. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తా. ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం. విూ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం. విూ హక్కుల సాధనలో మా తరపున సంపూర్ణ మద్దతు ఇస్తాం. వర్గీకరణకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ అని, మందకృష్ణ మాదిగ.. తన చిన్న తమ్ముడు అని ప్రధాని మోదీ అన్నారు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు, ఎంతో ప్రేమతో ఈ సభకు తనను ఆహ్వానించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కిషన్‌రెడ్డి, ఈటల, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. మహాసభ వేదికపై మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ భుజం తట్టి ఓదార్చారు.


విశ్వరూప మహాసభకు వచ్చిన మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ’ఈ సభకు ప్రధాని మోదీ వస్తారని మేం ఊహించలేదు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది.’ మందకృష్ణ అన్నారు. పండుగ సమయంలో మనకు కావాల్సిన వారిమధ్యలోకి ఉండటం నాకు సంతోషంగా ఉంది.. అందుకే నేను రెట్టింపు ఉత్సాహంగా ఉన్నాను.. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగకు నా శుభాకాంక్షలు అన్నారు. మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన.. అణగారిన వర్గాలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు మోదీ. ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేసీఆర్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ’తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి. అధికారంలో వచ్చాక బీఆర్‌ఎస్‌ అందరినీ విస్మరించింది. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిరది. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారు. దళితుల సీఎం కూర్చీని కేసీఆర్‌ కబ్జా చేశారు. మాదిగ సామాజికవర్గాన్ని కూడా విస్మరించారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయింది. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. 3 ఎకరాల భూమి హావిూని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదు. దళితబంధు పథకం వల్ల బిఆర్‌ఎస్‌ నేతలకే మేలు జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులు. ఆ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్‌ అంబేద్కర్‌ని అవమానించారు. కాంగ్రెస్‌ వారు అంబేద్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడిరచారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ చిత్రపటం కూడా పెట్టలేదు. అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదు. మేం వచ్చాకే అంబేద్కర్‌ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే. తెలంగాణ అస్తిత్వాన్ని కెసిఆర్‌ ప్రభుత్వం కాపాడలేకపోయిందని మోదీ విమర్శించారు.ఇరిగేషన్‌ స్కీంలను ఇరిగేషన్‌ స్కామ్‌లుగా మార్చారు. ఢల్లీిలో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిరది. లిక్కర్‌ స్కామ్‌లో రెండు పార్టీల ప్రమేయం ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అంటేనే అవినీతికి నిదర్శనం. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ కలిసే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఆ రెండు పార్టీల టార్గెట్‌ బీజేపీనే.’ అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా విూ ముందు ఉన్నాను. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందని మోదీ అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంబేద్కర్‌ ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడిరచిందన్నారు. పార్లమెంట్‌ లో కనీసం అంబేద్కర్‌ ఫోటో కూడా పెట్టనివ్వలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భారత రత్న కూడా ఇవ్వలేదన్నారు. అలాగే ఇతర దళిత నేతల్ని కూడా కాంగ్రెస్‌ అవమానించిందని మండిపడ్డారు. దళితుడన రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను.. గిరిజన వర్గానికి చెందిన ముర్మునుకూడా రాష్ట్రపతిగా ఓడిరచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని విమర్శించారు. అవకాశవాద రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సభకు హాజరైన వారికి మోదీ పిలుపునిచ్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆప్‌ తో కలిసి ఢల్లీిలో బీఆర్‌ఎస్‌ లిక్కర్‌ స్కాం చేసిందన్నారు.సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఎమ్మార్పీఎస్‌ మంద కృష్ణ మాదిగను వేదికపైనే ఆలింగనం చేసుకుని.. హత్తుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. మోదీ ఆలింగనంతో.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు కృష్ణమాదిగ. కన్నీటి పర్యంతం అయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. దీన్ని చూసిన ప్రధాని మోదీ.. తన సీటు పక్కనే మంద కృష్ణ మాదిగను కూర్చోబెట్టుకున్నారు. కుర్చీని దగ్గరకు తీసుకుని.. అతని భుజంపై చేయి వేశారు.. మంద కృష్ణ మాదిగను ఓదార్చారు. ఐదు నిమిషాలపాటు ఈ దృశ్యం సభలో ఆసక్తి రేపింది. ప్రధాని స్థాయి వ్యక్తి.. తనకు ఇచ్చిన గౌరవం, సభకు హాజరైన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో సభ హోరెత్తింది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ అని, మందకృష్ణ మాదిగ.. తన చిన్న తమ్ముడు అని ప్రధాని మోదీ అన్నారు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు, ఎంతో ప్రేమతో ఈ సభకు తనను ఆహ్వానించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.విశ్వరూప మహాసభకు వచ్చిన మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ’ఈ సభకు ప్రధాని మోదీ వస్తారని మేం ఊహించలేదు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది.’ మందకృష్ణ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు