Friday, September 20, 2024
spot_img

ఆవుపేడ కొంటాం.. ల్యాప్‌టాప్‌లు ఇస్తాం!

తప్పక చదవండి

జైపుర్‌ : రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ తాజాగా మరో 5 హావిూలు ఇచ్చారు. కాంగ్రెస్‌ని తిరిగి గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ట్యాబ్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఇస్తామని హావిూ ఇ చ్చారు. జైపుర్‌లో విూడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్‌ 5 గ్యారెంటీలను ప్రకటించారు. భవి ష్యత్తులో ఏ ప్రభుత్వమూ మార్చేందుకు అవకాశం లేకుండా పాత పింఛను విధానాన్ని అమలు చే సేలా చట్టం చేస్తామన్నారు. ‘గో ధన్‌’ పథకం కింద కిలో ఆవుపేడ రూ.2 చొప్పున ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంగ్లిష్‌ విూడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్ట పోతే రూ.15 లక్షల బీమా కల్పిస్తామని హావిూలు ఇచ్చారు. త్వరలో ప్రకటించే పార్టీ ఎన్నికల ప్రణాళి కలో మరిన్ని హావిూలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంటగ్యా స్‌ సరఫరా చేస్తామని, ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు గౌరవ వేతనంగా ఇస్తామని గెహ్లాట్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు