Friday, November 1, 2024
spot_img

వేణువై వచ్చాడు భువనానికి..

తప్పక చదవండి
  • తెలుగింటిలోని తులసి మొక్కని..
  • కోవెలలోని కొబ్బరి మొక్కని..
  • కోనేటిలోని కలువ మొక్కని..

” పలకరిస్తున్న నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు రెయిన్ బో fm 101.9 లో రేడియోజాకీ గా పదహరు వసంతాలు పూర్తి చేసుకున్న వేణువు..యాంకర్ గా…హీరోగా నటిస్తూనే…20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు..రేడియోజాకీగా చక్కని భాషకు..మధురమైన స్వరానికి పదహరు వసంతాలట..చక్కని రూపంతో..నటుడిగా యాంకర్ గా అందర్ని ఆకర్షిస్తున్న ” వేణుశ్రావణ్” ను పలకరించిన వేళ…

మానవ సేవే…మాధవ సేవ అన్నారు పెద్దలు అయితే సాక్షాత్తూ ఆ మాధవుడి పేరు పెట్టుకున్న ఈ యువకుడు మానవ సేవ చేస్తున్నాడు.పరోపకారం ఇతని ఇంటిపేరు..మంచితనం ఇతని మాటతీరు,వేణుశ్రావణ్ తన అసలు పేరు. వెండితెర,బుల్లితెరపై హీరోగా నటిస్తూ..నిజ జీవితంలో సైతం హీరో అయిన ఈ వేణుశ్రావణ్ కు ఉత్తమ నటుడు..ఉత్తమ రేడియోజాకీ.. మహనటి సావిత్రి కళారత్న అవార్డ్… కొంగర జగ్గయ్య స్మారక అవార్డ్..సేవ రంగంలో కృషి చేసినందుకు గాను గౌరవడాక్టరేట్.
.తెలంగాణా లో కొన్ని కళాసంస్థల నుండి శివనంది అవార్డ్స్.. ఉత్తమసేవలకు గాను మథర్ ధెరిస్సా అవార్డుల తో పాటు…మరెన్నో సంస్థల నుండి సేవా పురస్కారాలు అవార్డులు..సన్మానాలు అందుకున్నారు..దీనితో పాటు ఉత్తమ వ్యక్తిత్వం,ఉత్తమ యువకుడు లాంటి అవార్డులు ఏమన్నా పెడితే …ఉంటే వాటికి కూడా అచ్చంగా అన్ని విధాలా అర్హుడు….ఈ ఉత్తమ పౌరుడు… ఆ కథా….స్క్రీన్ ప్లే…ఏమిటనగా..!
లక్షలూ..కోట్లు ఉంటేనే ఇతరులకు సహాయం చేయొచ్చు అన్న అపోహను అక్షరాలా అపోహే…అని నిరూపిస్తూన్న నిరుపమాన నేస్తం వేణుశ్రావణ్. అవసరంలో ఉన్న వాళ్లకు అన్నవుతాడు..ఆకలేసిన వారికి అన్నమవుతాడు…కష్టాల్లో ఉన్న వారికి పెద్దకొడుకవుతాడు…తనకు తోచినంత సహాయం చేయడు…తనకు మించిన..తలకు మించిన..భారం తలెత్తుకొని పదిమందికీ…కష్టాల్లో వున్న వారి గురించి చెప్తాడు. ఉన్నవారు..విన్నవారూ ఇచ్చినా..ఇవ్వకపోయినా..వారికి వినమ్రంగా మొక్కుతాడు.అంతేగానీ ఎవరినీ ఏదీ అడగడు…ఇది తన తత్వం కాదు…తన వ్యక్తిత్వం…. ఆస్తులు కోసం ఒక కడుపున..రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు…ఒకరి రక్తం మరొకరు కళ్ళచూస్తున్న ఈ రోజుల్లో..ఊరూ… పేరూ.. తెలియని వారి కోసం ఆరాటపడతాడు…
నేనున్నానంటూ ఆత్మబంధువు అవుతాడు… వేణువుని…..అందుకేనేమో….! చాలామంది “వేణు..ఈ అబ్బాయి చాలా మంచోడు” అంటారు..నటుడిగా….యాంకర్ గా..రేడీయోజాకీగా…ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న సరస్వతీ పుత్రుడా…నీ సహృదయానికి వంద వందనాలు..!! సంకల్పబలంతో సాగిపోతున్న సైనికుడా నీకిదే మా సెల్యూట్..!!

- Advertisement -

ధనంలో గుణవంతుడా…
గుణంలో ధనవంతుడా…..
ఊరికి ఉపకారం చేస్తున్న శ్రీమంతుడా….
నీకివే మా మంగళహారతులు…!!

కళాకారుల గుమ్మంగా పిలుచుకునే ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లి లో జన్మించిన కళాకారుడా….రావుల లక్ష్మా రెడ్డి…ప్రమీలమ్మ ల ముద్దు బిడ్డడా..నిన్ను కన్న నీ ఊరు నీ సేవలతో పులకిస్తోంది… నిన్ను కన్న నీ తల్లి నీ పేరు ప్రఖ్యాతులు చూసి మురుస్తోంది ఒక కళాకారుడికి సన్మాన సత్కారాలు,భుజం తట్టి శాలువా కప్పే అభినందనలను మించిన ఆనందాలు…ఆస్తులూ..లేవని గ్రహించి సాటి తోటి కళాకారులను ప్రోత్సహించే దిశగా ” కలర్స్…సర్వీస్ & ఎంటర్ టైన్ మెంట్” అనే కల్చరల్..సేవా ఆర్గనైజేషన్ స్థాపించి…ఈ సంస్థ ద్వారా టి.వి,సినిమా మరియు సేవ రంగాలలోని ఎందరినో పిలిచి,సత్కరించి మురిసిపోతుంటాడు వేణుశ్రావణ్..కొందరితనికి లౌక్యం తెలీదంటారు…..ఇంకొందరు ఇతను ఈ కాలంలో పుట్టాల్సినవాడు కాదంటారు….కానీ అందరూ వేణు ఈఅబ్బాయి చాలా మంచోడు అంటుంటారు…

మంచితనంలో స్వాతిముత్యం నువ్వే …
మనుషుల్లో తిరిగే ఆణిముత్యమూ నువ్వే..

ఈ వేళ,శుభవేళ …కళాకారుడా కలలను జయిస్తూ సాగిపో సైనికుడా…..అందరి మనసుల్ని గెలుస్తూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపో…పల్లెటూరు నుండి వచ్చిన పట్టుకొమ్మ..తెలంగాణ తంగేడు పువ్వు.. తన ఎదుగుదలకు ఎవరు వెనుక లేరు..పట్టుదలతో ఏకలవ్వుడు మాదిరిగా అన్ని నేర్చుకుంటూ అన్ని రంగాలలో రాణిస్తున్నాడు..మాట్లాడలేని వాళ్ళ అమ్మకు భావాలను తెలియచెప్పడంలో తాను చేసే హావభావాలతోనే తనకు తెలియకుండా నటించడం వచ్చిందట..ఆ దేవుడు అమ్మకు ఇవ్వని మాటలను తనకిచ్చాడు అంటాడు.. అమ్మ ఆప్యాయమైన మాటలే తన నోట్లోంచి దేవుడు పలికించి అభిమానులచే నీవు నా పెద్ద కొడుకుగా ఎందుకు పుట్టలేదని ఎందరో తల్లులు ఆర్థ్రతగా ప్రశ్నిస్తుంటే కళ్ళు చెమర్చేవట..నాన్న లక్ష్మారెడ్డి పోస్టు మాస్టర్,అమ్మ ప్రమీల గృహిణి..వేణు చిన్నతనంలో ఊరు అందరి కోసం సినిమాలు వేయించేవారట వాళ్ళ తాతగారు..ఊరంతా ఆ తెర ముందు వరసలో కూర్చోని సినిమా చూసేవారట..అలాగే వాళ్ళ అమ్మమ్మ రైస్ మిల్లు ఉండటం వలన ఎంతోమందికి తినటానికి బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చి ఆదుకోనేవారట…అలా ఓ పక్కనా నటన..సేవలు వేణువుకు అలవడినాయో ఏమోగాని ఎన్నో సేవలు 20 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారట.. వృథ్ధ ఆశ్రమాలకి వెళ్ళి అక్కడ ఎండమావుల లాగా ఎండిపోతున్న పండుటాకుల మధ్య తోటి కళాకారులను సైతం తీసుకెళ్ళి గడిపి వారు ఆనందించేలా చేసి బోసినవ్వులను కురిపింపచేసేవారట..వారికి వస్త్రాలు..పండ్లు..నిత్యావసర వస్తువులు ఇచ్చేవాడట.. అనాధలకోసం..అంధ విద్యార్థులకోసం లైవ్ ఫ్రోగ్రామ్స్ చేసి వచ్చిన విరాళాలు వారికి ఇవ్వటం జరిగిందట..లివర్ రోగంతో బాధపడుతున్న ఓ బాలుడి కోసం ఒక ప్రైవేట్ ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పోగైన 18 లక్షల రూపాయలతో అతడిని కాపాడిన గొప్ప బాధ్యత గల పౌరుడు..కిడ్ని పేషంట్ కోసం 6 లక్షల వరకు సహయం అందించాడట..అలాగే వృథ్ద ఆశ్రమాలలోని బామ్మకోసం హార్ట్ ఆఫరేషన్ ..మరో ఆశ్రమంకు మిని ఓమ్ని వ్యాన్ అంబులెన్సును ఇవ్వటమేకాక చిన్న జీయర్ స్వామి వారి నుండి అర్థ ఎకరం భూమిని దానంగా ఇప్పించారట..అన్ని రకాల ఆశ్రమంలలో కట్టుకోవడానికి బట్టలు పండ్లు నిత్యావసర వస్తువులు అందించటం జరిగిందట..అలాగే సోంత ఊరికోసం మెడికల్ క్యాంపులు నిర్వహించి..ఉచిత మందులు..హెపటైటిస్-బి వ్యాక్సిన్ మూడుసార్లు ఇప్పించారట..చదువుకున్న స్కూల్ కు ఫ్యూర్ సంస్థ ద్వారా పుస్తకాలు,బల్లాలు,బ్యాగులు,లైబ్రేరి పుస్తకాలు..డిజిటల్ చదువు కోసం కంప్యూటర్లు..బీరువాలు ఇప్పించమేకాకా..తన ఊరికే కాకుండా ఖమ్మం జిల్లాలో చాలా పాఠశాలకు సహయం అందిందట…మినరల్ వాటర్ ప్లాంటును తన బంధు మిత్రులతో కలిసి ఎర్పాటు చేయటం జరిగిందట.కుట్టుమిషన్లు అందించటం,ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి నేర్పించి ..చాలా మందికి జీవనోపాధిని కల్పించటం.. భర్తచనిపోయిన స్త్రీ మూర్తిల జీవనోపాధి కోసం కిరాణ షాపు ని ఏర్పాటు చేయటం.. గోవులను కాపాడే ఉద్దేశంతో శ్రీగోకులం పేరిట గోశాల ఏర్పాటు చేయటం జరిగిందట..గత పది సంవత్సరాలుగా ఊరిలో గోదాకల్యాణం జరిపిస్తున్నాడట…అన్ని రకాల జైళ్లలో ” మాట..పాట…ఆట ” ద్వారా తన తోటి కళాకారుల బృందంతో వెళ్ళి మంచిని నేర్పి విడుదలకు కారకుడు అయినాడట..అలాగే హైదరాబాద్ లో “మేముసైతం, మనం, అక్షయ పాత్ర” అంటూ పేదవారి కోసం పాత కొత్త బట్టలను షాపింగ్ మాల్స్ లాగా పెట్టి వారికి నచ్చిన బట్టలు వారే ఎంచుకోనే విధంగా పెట్టి..పండ్లు, భోజనం,మంచినీరు అందజేశాడట..ఇంకా అనేక సంస్ధలతో కలిసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారట…పేద కుటుంబం కోసం 80 వేలు విలువైన మొక్కలు తెప్పించి వారికి జీవనోపాధిని కల్పించారట.అలాగే నిరుపేద పిల్లలకి ఉన్నత విద్య కోసం సహాయం చేయటం..ఎంతో మంది భాగ్యనగరంకు వస్తున్న వారికి ఆతిధ్యం మిచ్చి,తనలో అన్నపూర్ణమ్మని బయటకు తీసి భోజనాలు ఏర్పాటు చేసి వసతిని ఏర్పాటు చేస్తున్నారట…అలాగే కరోనా సమయంలో ఏన్నో సహాయ కార్యక్రమాలు చేయటమే కాకుండా..రేడియోజాకీ గా ఒక నెలకి వచ్చిన జీతం మొత్తంని జగీత్యాలలో అనాథలైన పిల్లలకి పంపించటం జరిగింది…ఆ విషయం కి స్పందించిన చాలా మంది ఖమ్మం జిల్లాకి చేందిన ఉపాధ్యాయులు మిగిలిన వారు కలిసి దాదాపు 25 లక్షల సహాయ నిథిని ఏర్పాటు చేసి వారికి అందించటం జరిగింది..హైదరాబాద్ లో నిరుపేదలకి,అనాథలకి,వృథ్థాశ్రమాలకి నిత్యవసర వస్తువులు..భోజనాలు పెట్టించడం…ఆల్ లైన్ ద్వారా చిరుధన సహాయాలు అందించటం జరుగుతుంది . ఇప్పటికి సోషల్ మీడియా నుండి
పరిచయం అయిన మిత్రుల ద్వారా సహాయాలు అందించటం..
నమ్మకమనే ఆయుధమే తన నాగాభరణం.. అందరికి సేవలు అందేలా చూడటమే వేణువు లక్షణమైన లక్షణం..
నటుడుగా..యాంకర్ గా పలు ఛానల్స్ లో రకరకాల ..లైవ్ కార్యక్రమాలు ..రియాల్టి షోలు..కుకరీ ఫ్రోగ్రాములు చేస్తున్నారట…విథి సీరియల్ తో మొదలైన ప్రస్థానం రాథ-మధు, సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకొని ఆమె, శుభలగ్నం, మనసంతా నువ్వే, ప్రతిఘటన,ఆమెకథ,
హంసగీతం.. సీరియల్స్ లో హీరోగా,సహనటుడుగా చేసి…ఉత్తమ నటుడు అవార్డ్స్ అందుకున్నారట.నలుగురి ఉద్యోగం-ఇద్దరి పెళ్లి..ద్రోహి(హింది) సినిమాలలో హీరో గా.. సైనికుడు..లెహరాయి సినిమాలలో అతిథి పాత్రలు చేశారట….ఎవరికివారే..
ఇలాఎందరో..భలేతండ్రి-కొడుకు వంటి టెలిఫిల్మ్ లలో హీరోగా చేశారట
అవార్డులు:
2011: ది బెస్ట్ యంగ్ ఆర్టిస్ట్(OU), మథర్ తెరిస్సా అవార్డ్
2012:రేడియోజాకీ అవార్డ్(OU), ఉగాది పురస్కారం,సేవా అవార్డ్స్
2013: రేడియోజాకీ అవార్డ్, కలర్స్ సేవా పురస్కారం,కిన్నెర సేవా పురస్కారం, ఉత్తమ రేడియో జాకీ అవార్డు
2014: తెలుగు సాహిత్య కళాపీఠం సేవా పురస్కారం,కలర్స్ సేవా అవార్డ్
2015: కలర్స్ సేవా పురస్కారం,ఉత్తమ నటుడు
2016: కలర్స్ సేవా పురస్కారం, సేవారత్నా అవార్డ్, మహనటి సావిత్రి కళారత్న అవార్డ్,గౌరవ డాక్టరేట్
2017: రేడియోజాకీ అవార్డ్,సేవారత్న పురస్కారం,స్వర్ణభారతి పురస్కారం
2018:కలర్స్ సేవా రత్నా అవార్డ్, ఉదయ్ కిరణ్ అవార్డ్,
ఉగాది పురస్కారాలు,సేవా అవార్డ్స్
2019:ఉత్తమనటుడు(మనసంతా నువ్వే)తెలంగాణా శివనంది అవార్డ్
2021:కొంగర జగ్గయ్య స్మారక అవార్డ్
ఉత్తమనటుడు(ఆమెకథ),శివనంది అవార్డ్,ఉగాది పురస్కారం,రేడియోజాకీ అవార్డ్
2022:శివనంది,సేవ నంది, కళా నంది
2023, కళా నంది, వాచస్పతి, మాటలు మాంత్రికుడు,

2016 లో.. LB స్టేడియం లో జరిగిన నాల్గు రాష్ట్రాల సిని- టివి నటులు ఆడిన FPL క్రికేట్ మ్యాచ్ కి వ్యాఖ్యాత చేయటం అలాగే..2018 లో 40 మంది అనాథ పిల్లలతో హంపికి విమానయాణం చేయటం..మిస్ య్యూనివర్స్ రూహానా…హీరోయిన్ సమంత గారు సహకరించటం జరిగీనది…రేడియో ద్వారా చాలా అనాథ శరణాలయాలలో కార్యక్రమాలు చేయటం మధురానుభూతి ..
రేడియో తో అనుబంధం:

  • 2007నవంబర్ 21 న మొదటి లైవ్ షో..2023 నవంబర్ 21 కు పదహరు వసంతాల గళం నాది.. నేను మీ * వేణువు* ఈ అబ్బాయి చాలా మంచోడు అంటున్న వేణుశ్రావణ్
    *చక్కని ట్యాగ్ లైన్ తో గలగలమని మాట్లాడుతూ అప్యాయంగా ఎందరెందరినో అభిమానులను పలకరిస్తూ..వాళ్ళింట్లో ఒకరిలా అనుబంధాలతో అభిమాన బంధాలు ఏర్పాడ్డాయట
    *తృప్తి నిచ్చిన క్షణాలు: పదహారేళ్ల తెలుగమ్మాయికి కంచిపట్టు చీర కడితే ఎంత సాంప్రదాయంగా బాగుంటుందో వేణు మాట్లాడే భాష..చిరునవ్వు ..వినయం..
    విధేయత అలా ఉంటుంది
    *నామాట ఒక జీవితం కాపాడింది:ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆలోచించండి క్షణికావేశంలో జీవితాలు పాడుచేసుకోవద్దు అన్న మాటలు ఆత్మహత్య చేసుకోనే ప్రయత్నంలో ఉన్న అమ్మాయి విని హైదరాబాదు వచ్చి పదివేలు సంపాదించుకొంటూ తన కొడుకుని పోషించుకుంటున్నాను మీ మాటలు నా జీవితాన్ని కాపాడినవి అని అభిమానంతో చేప్తే ఆనందించారట..
    *ఇంత మంచిగా ఎలా మాట్లాడుతున్నారు: అని చాలా మంది అభిమానులు అడుగుతారు చిన్నప్పటి నుండి అందరూ బాగా మంచివాడని అనే వారు.. ఇలా మాట్లాడటం ఎక్కడా నేర్చుకోలేదు..ప్రకృతి చుట్టూ ఉన్న పరిస్థితులు నేర్పాయట..నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లు మన సత్ప్రవర్తననే మనకు మంచి మాటలు ఇస్తుంది అంటున్నాడు
  • ప్రేమా అంటూ అమ్మాయిల గోల: నువ్వంటే ఇష్టం.నేను ప్రేమిస్తున్నాను ..పెళ్లి చేసుకుంటావా అని ఒత్తిడి చేసేవారట..కానీ వాళ్ళకు మీరు ఊహించుకునేంత ప్రవరాఖ్యుడిని కాదు..యాసిడ్ పోస్తే ఎలా ,ఉంటానో అలాంటి కూరుపిని..మధ్య తరగగతి మనిషిని..నా జేబులో నోట్ల కట్టలు లేవు..కాళ్ళు లేనివాడిని..స్నేహన్ని ప్రేమించండి అని అబద్ధాలు చేప్పేవారట…అభిమానం అభిమానంగానే ఉండాలి అనేవారట..ఓ స్టేజి కార్యక్రమంలో వేణువుని చూసి ఓ పేద్దావిడ కోటి రూపాయలు ఇస్తాం మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నారట..అప్పుడు వేణు నేను శుభలగ్నం సినిమా లో హీరోని కాను అభిమానం ఉంటే ఇంటికి పిలిచి అన్నం పెట్టి ఆశ్వీరదించి పంపండి అన్నారట..
  • ప్రేమంటే:ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచిన అమ్మ నాన్నలను వదిలి క్షణంలో పుట్టిన ప్రేమను ఎలా అమోదిస్తాం..ప్రేమకోసం వెంపర్లాడి దక్కలేదని చంపడమో..చావడమో లాంటివి లైఫ్ లో రానివ్వకుడదట..అలాంటివి మరచిపోవటం దేవుడిచ్చిన వరం..
    *అభిమానుల సమస్యలు తీరుస్తా: ఈరోజు మా ఆవిడ నాతో మాట్లాడలేదు మీరు చెప్పండి తాను యఫ్.యం వింటుంది అనగానే నేను మాట్లాడినట్లే మీరు ప్రేమగా మాట్లాడండి..మీ శ్రీమతి మనసు తెలుసుకొని నచ్చే విధంగా ఇష్టాలు కనుక్కొని ఒకరినోకరు అభిమానించుకుంటే అందులోనే ఆనందం ఉంటుందని అంటాడు..
    *ఆనంద భాష్పాలు: నన్ను చూడకపోయినా..నామాటలకు ఎందరో తల్లులు ఫోన్ లో నీవు నాకు కొడుకుగా ఎందుకు పుట్టలేదని ఆప్యాయంగా అడిగితే వారి అభిమానానికి ఎన్నో ఆనంద భాష్పాలు మనసులోంచి కళ్ళలోకి ఉప్పెనలా వస్తాయి..ఇలా అందరూ అడుగుతుంటే ఏదో సాదించానని తృప్తి..
    *సెలబ్రిటీలు తన లైవ్ షోలలో పలకరించడం అభిమానులకు ఇంకా దగ్గర అవ్వటం..టి.వి,సినిమా, విభిన్న రంగాల వారిని ఇంటర్వ్యూలు చేయటం ఆనందంగా ఉంది..
  • ఆన్ లైన్ రేడియో రేడియోఖుషి.కామ్ లో చేయటం వలన ప్రవాస భారతీయులను సైతం మెప్పించిన వేణువు గళం…నవంబర్ 21 ని ..వేణు గళం పుట్టిన రోజు అని విష్ చేస్తారట…చాక్లెట్స్ తో…బోకెలతో రేడియో స్టేషన్ కి వచ్చేస్తారట శ్రోతలు…
  • ధనం కొసం లక్ష్మి …విద్య కోసం సరస్వతి…శక్తికోసం దుర్గ అన్నట్లు…ఇండస్ట్రీలో గ్రేట్ యాంకర్ అవ్వాలంటే …లక్ష్మిని సుమగా…సరస్వతిని ఝాన్సిగా…శక్తి అంటే ఉదయభాను గా ఉండాలంటాడు….ఆ ముగ్గురి టాలెంట్ కలిస్తే వేణువు అవుతాడట….
    ఇలారేడియోజాకీ గా పదహారు వసంతాలు పూర్తి చేసుకున్నారు….ఇంకా మంచి -మంచి సీరియల్స్ చేయాలని మంచి గుర్తింపు రావాలని సేవలు
    ఆ నలుగురికి చేస్తూ ఉండాలని..మంచి సీరియల్స్ లో హీరోగా చేయాలని తన లక్ష్యానికి…చక్కని సంకల్పంతో నిలదొక్కుకోవాలని..కొరుకుంటూ ఇండస్ట్రి దర్శకులు మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించాలని అందరి అభిమానం గంపగుత్తాగా మూటకట్టుకోవాలని ఆల్ ది బెస్ట్ వేణుశ్రావణ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు