No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

వల్మిడి ఆలయాన్నిఅద్భుతంగా అభివృద్ధి చేస్తాం..

తప్పక చదవండి
  • వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు
    యాదాద్రికి ధీటుగా వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేతృత్వంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల విగ్రహాల పునః ప్రతిష్టాపన దేవాలయ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయార్‌ స్వామి, రాష్ట్ర మంత్రులు టి.హరీష్‌ రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు హాజరయ్యారు. వారిని అత్యంత వైభవంగా అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య ఆహ్వానించారు. ముందుగా త్రిదండి చిన జీయర్‌ కొత్తగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. అనంతరం ఆలయ సన్నిధిలో ఇతర విగ్రహాలను, ఆలయ గోపురం పై కలశాన్ని చిన్నజీయర్‌ స్వామి ప్రతిష్టించారు.
    ఈసందర్బంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పురాతన దేవాలయాల అభివృద్ధితో పాటు నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు అత్యధికంగా నిధులు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. దేవాలయాలలో మౌలిక వసతుల కల్పన భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన కృషి చేస్తోందన్నారు. దేవాలయాల నిర్మాణమే కాకుండా జీర్ణదశలో ఉన్న దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద ఇప్పటికే ఏడూ వేల దేవాలయాలకు నిధులు చెల్లిస్తున్నామన్నారు. గతంలో ధూపదీపాల కింద రూ.6వేలు ఉండేదని ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలయాల నిర్మాణం చేస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంచుతున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన ఈ పదేండ్లలో రాష్ట్రంలో ఎటువంటి కరువు కాటకాలు రాలేదని అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు కృప తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. మునులగుట్టపై రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చిన్న జీయార్‌ స్వామి కోరగా సీతారామచంద్ర స్వామి కొండ నుంచి ముణులు గుట్టను కలుపుతూ వేలాడే వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పాలకుర్తి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, నియోజకవర్గ అభివృద్ధికి పట్టు వదలని విక్రమారుకుడిలా కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతేకాకుండా దేశ స్థాయిలో అనేక అవార్డ్స్‌ తీసుకున్న ఘనత ఆయనకే దకుతుందని అత్యధిక అవార్డులు తెచ్చుకున్న మంత్రిత్వశాఖ ఆయనదని హరీశ్‌రావు పేర్కొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు