No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ప్రణాళికరహిత పాలన..!

తప్పక చదవండి
  • కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్..!
  • మద్యం అమ్మకాలు,పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలతో అడ్డగోలు అందానీ
  • ఓఆర్ఆర్ టెండర్, భూముల అమ్మకాలతోనూ ఇన్ కం డబుల్
  • అయినా అసంబద్ధ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం
  • కుటుంబానికి ఆదాయం తెచ్చిపెట్టే మార్గాలపైనే ప్రత్యేక నజర్
  • ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్
  • ఈ ఒక్క ప్రాజెక్టుకే సుమారు రూ.లక్షా 30 వేల కోట్ల ఖర్చు
  • అక్కరకురాని ధరణి, అవసరం లేని వారికి రైతు బంధు
  • కమీషన్లు, కాసులు, కందాన్ ప్రయోజనాలే పరమావధిగా పాలన
  • అవస్థాపన సౌకర్యాల కల్పన, ప్రజోపకర పనులకు మాత్రం మొండి చెయ్యి

ఒక ఇంటిని సాఫీగా నడిపించేందుకు ఆ ఇంటి గృహిణిలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఒక నెలలో ఇంటికి సరిపడే సరకులేంటి..? వాటికయ్యే ఖర్చెంతా అనే అంశాలపై వారికి ఓ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఉప్పు-పప్పు, కూరగాయాలకు ఎంత మొత్తం ఖర్చవుతుంది..? రెంట్, కరెంట్ నల్లా, ఇంటి బిల్లులు, పోరగాళ్ల ఫీజులు, వచ్చే పోయే చుట్టపోళ్లు, భర్థ సోపతిగాళ్లకు అయ్యే ఖర్చులపై మంచి పట్టుంది. అందుకే వారు వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఒక ప్రణాళిక బద్ధమైన ఖర్చులను చేస్తూ.. వ్యయాలను సర్ధుబాటు చేసుకుంటుంటారు. ఇది సాధారణ గృహిణి ఆర్థిక వ్యయ ప్రణాళిక పద్దతి. కానీ, ఈ మాత్రం అవగాహన మన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేన్నట్లుంది. రాష్ట్ర ఆదాయ, వ్యయాలతో సంబంధం లేకుండానే ఇష్టమొచ్చిన రీతిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం, అది చాలదన్నట్లు అప్పులు చేయడం ఆయన అసంబద్ధ పాలనకు దర్పణంగా మారింది.

హైదరాబాద్ : గృహుణిలతో పోల్చినప్పుడు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్య మంత్రి కేేసీఆర్ మహా మేధావి. విశేష రాజకీయ అనుభవం కల్గిన నాయకుడు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన నేత. ఎంతో మంది విద్యార్థులు, ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర అవతరణ జరిగినప్పటికీ.. అదంతా తానొక్కడితోనే సాధ్యమైందని చెప్పుకుంటుంటాడు. అయితే ఏది ఏమైన తెలంగాణ రాష్ట్ర వచ్చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అప్పుడే తొమ్మిదిన్నరేళ్లు కూడా పూర్తైంది. ఇక కేసీఆర్ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ స్టేట్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని రాష్ట్ర ప్రజలు గంపెడాశాలు పెట్టుకున్నారు. అవస్థాపన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయగల్గుతారని అందరూ ఆశపడ్డారు. తద్వారా తెలంగాణ స్వశక్తితో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుందని భావించారు.
అందుకు అనుగుణంగానే కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర అందానీ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బడ్జెట్ రూ.లక్షా 637 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.2 లక్షల 77 వేల 690 కోట్లకు చేరుకుంది. మద్యం అమ్మకాలు, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, ఓఆర్ఆర్ వేలం, రుణాల ద్వారా రాష్ట్ర సర్కార్ కు భారీగా ఆదాయం సమకూరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈస్థాయిలో వచ్చిన అందానీని ఒక క్రమ పద్ధతిలో వినియోగించడంలో కేసీఆర్ లెక్క తప్పారు. ప్రభుత్వం ఏ పనులు చేయాలన్న ఆ శాఖల్లోని అధికారుల సహాయ,సహకారాలను తీసుకోవడం పరిపాటి. కేసీఆర్ రెండు దఫాల ప్రభుత్వంలోనూ నీళ్లు, నిధులకే ప్రముఖంగా ప్రయార్టీ ఇచ్చారు.
అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకోసం దశల వారీగా ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రూ.లక్షా 30 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. విడతల వారీగా టెండర్ బిడ్ల మొత్తాన్ని పెంచుతూ.. మరీ బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను విస్మరిస్తున్నారని అనేక మంది నీటి రంగ నిపుణులు అప్పట్లో ఆయనపై విమర్శలు గుప్పించారు. కాగా వాటిని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం గోదారిపై నిర్మించిన బ్యారేజీ లు ఒక్కొక్కటి కుంగిపోతుండడం గమనాార్హం. మరోవైపు గతంలో వ్యవసాయ భూముల మ్యూటేషన్ ప్రక్రియ 1971 పట్టాదార్ పాస్ యాక్ట్ ప్రకారం కొనసాగేది. కానీ, కేసీఆర్ దాన్ని ఓ దిక్కుమాలిన చట్టమని చెప్పుకొచ్చారు. ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మూడేళ్ల క్రితం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకే రోజు రిజిస్ట్రేషన్, పట్టా ప్రక్రియ పూర్తి అవుతుందని.. ఇది అన్నదాతలకు అత్యంత ఉపయోగకరమైన విధానమని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ చెప్పిన లెక్క ఇక్కడా తప్పింది. రాష్ట్రంలో సుమాారు మూడు లక్షల మంది సన్న, చిన్నకారు రైతుల పొట్ట ధరణి పోర్టల్ కొట్టేయడం గమనార్హం. కొత్త చట్టంలో కాలమ్ నెంబర్ 13 లేకపోవడం.. అనుభవదారు కాలమ్ ను ఎత్తేయడంతో అనేకమంది రైతులు భూములు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక మరోవైపు గతేడాది హైదరాబాద్ లో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మొత్తం 31 కిలో మీటర్ల దూరం కల్గిన ఈ ప్రాాజెక్టు కోసం రూ.6,250 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అయితే ఈనిర్ణయం కేసీఆర్ అనాలోచిత విధానమని అప్పట్లో నిపుణులు విమర్శించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఉప్పల్, ఎల్.బీ.నగర్ వంటి ప్రాంతాల్లో మెట్రో పనులను విస్తరించకుండా రాయదుర్గంను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు స్కీం కూడా ఒక తప్పుడు ఆలోచనేనని అభిప్రాయముంది. రైతు బంధు మార్గదర్శకాలే తప్పుల తడకగా ఉన్నాయనే విమర్శలున్నాయి. చిన్న, సన్న కారు రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు.. భూ కమతాలతో సంబంధం లేకుండా ఎందుకు స్కీంను వర్తింపజేశాడనేది అర్థం కాని పరిస్థితి. దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడినట్లైంది. ఈ విషయంలో కేసీఆర్ అసలు సోయి లేకుండా వ్యవహరించారనే విమర్శలున్నాయి. కేవలం ధరణి ద్వారా దొడ్డిదారిలో రికార్డులకు వచ్చిన వారి కోసమే రైతు బంధు పథకాన్ని అమలు చేసినట్లైంది.
దళిత, బీసీ, మైనార్టీ బంధుల విషయంలోనూ కేసీఆర్ ఇదేే తంతును కొనసాగించడం గమనార్హం. ఒక సాధారణ గృహిణి, ఎలాంటి చదువు సంధ్యలు లేని మహిళలు వారికి వచ్చే అందానీకి తగ్గట్లుగా కుటుంబ ఆదాయ-వ్యయాలను సమన్వయం చేసుకోగల్గుతున్నప్పుడు.. మన 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనే విమర్శలున్నాయి. కేవలం కమీషన్లు, కాసులు, తన కందాన్ బాగు కోసం ఈరకమైన తంతును కొనసాగిస్తున్నాడనే వాదనలున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు