Thursday, September 19, 2024
spot_img

వేల కొద్ది దరఖాస్తుదారుల సమాచారం మాయం

తప్పక చదవండి
  • మీ సేవలో దరఖాస్తు చేసిన ఏఎఫ్డి బిహెచ్‌ సిరీస్‌ సమాచారం గల్లంతు…?
  • పదివేలకు పైగా ఆన్లైన్‌ దరఖాస్తులు ఎక్కడా కనపడక లబ్ధిదారుల అయోమయం…!

ఎల్బీనగర్‌ : ఏడెండ్ల క్రితం ఆన్లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న సమాచారం కనబడుటలేదు..? ఎప్పుడు, ఎలా, ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ, పది వేలకు పైగా దరఖాస్తులు ఇటు మీ సేవలో కానీ అటు ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థలో కానీ, జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కానీ తహసీల్దార్‌, జిహెచ్‌ఎంసి కార్యాలయంలో కూడా రెండు పడక గదుల దరఖాస్తుదారుల సమాచారం గల్లంతయ్యింది. ‘‘ఏ ఎఫ్‌ డి బిహెచ్‌ ‘‘ అనే సీరిస్‌ గల మీ సేవలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సమాచారం దొరకక లబ్ధిదారులు అటు జిల్లా కలెక్టర్‌, ఇటు జిహెచ్‌ఎంసి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న వైనం కంటతడి పెట్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న రెండు పడక గదుల పథకం పేదవాడి కన్నీటి గాధగా నిలబడిరది. పక్క వాడికి ఇల్లు వచ్చే నాకేమో రాలేదని మీ సేవలో దరఖాస్తు చేసుకొని మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.
మరి ఇంత విలువైన లబ్ధిదారుల సమాచారం ఎటుపోయినట్లు…? ఒక్క అధికారి కూడా వీరికి సరైన సమాధానం ఇవ్వలేక, ఆఫీస్‌ లో ఉండలేక బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా, పేదవాడి భాద చూసైనా ప్రభుత్వ పెద్దలు రెండు పడక గదుల దరఖాస్తుదారులకు న్యాయం చేయాలనీ సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు