Friday, September 20, 2024
spot_img

ఈ నెల 18 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

తప్పక చదవండి
  • అన్ని ఏర్పాట్లు చేసిన టీ టీ డీ పాలక వర్గం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది. బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 12న కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల జరిగే రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. అయితే, 17న ఆదివారం ఉదయం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ క్రతువు జరుగనున్నది. 18న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనున్నది. సాయంత్రం 6.15 గంటల నుంచి 6.30 గంటలకు మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగనున్నది. అదే రోజు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు