Monday, October 28, 2024
spot_img

ఆలోచించి ఓట్లు వేయాలి

తప్పక చదవండి
  • ఎన్నికల్లో ఆగమాగం కావద్దు
  • పదేళ్లలో తెలంగాణ ఎలా అభివృద్ది చెందిందో చూడాలి
  • కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాల కొలిమి తప్పదు
  • నిజాంసాగర్‌ను నిండా ముంచినోళ్లను నమ్మొద్దు
  • దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడు దారుణం
  • మేం తలచుకుంటే దుమ్ము కూడా మిగలదు
  • ప్రజాశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్‌ విమర్శలు

నిజామాబాద్‌ : ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత పదేళ్లో తెలంగాణ ఎలా అభివృద్ది చెందిందో విూ కళ్లముందే ఉందని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మకుంటే మళ్లీ కష్టాల కొలిమిలో పడతామని హెచ్చరించారు. దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిరచారు. నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనే పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆగమాగం కావొద్దు. సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పదేండ్ల కింద మన పరిస్థితి ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్‌ సూచించారు. జుక్కల్‌ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం.. కారు చీకటి, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. దూర ప్రాంతాలకు వలసపోయిన పరిస్థితి. రైతులు అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అవన్నీ మనం చూశాం. నేను 27 బోర్లు వేస్తేకానీ నీళ్లు రాలేదు. అలాంటి బాధలు మనం అనుభవించాం అని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణలో మిషన్‌ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. వాగుల విూద చెక్‌ డ్యాంలు కట్టుకున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాం. 100 ఏండ్ల కింద నిజాం రాజు నిజాం సాగర్‌ కట్టారు. సమైక్య పాలకుల రాజ్యంలో నిజాంసాగర్‌ ఎండిపోయింది. మన బాధలు ప్రపంచానికి తెలియాలని ఎండిపోయిన నిజాం సాగర్‌లోనే తెలంగాణ ఉద్యమం విూటింగ్‌ పెట్టుకున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇలా ఎన్నో బాధలు పడ్డ తర్వాత 2000లో ఉద్యమానికి శ్రీకారం చుడితే.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు కలిసిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్‌ తెలంగాణకు డోఖా చేసింది. అప్పుడే తెలంగాణ ఇస్తే బాగా బాగుపడేవాళ్లం. 14 ఏండ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. దగా చేశారు. నేనే నడుం కట్టి కేసీఆర్‌ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని ప్రకటన చేసి ఆమరణ దీక్ష చేపడితే దిగివచ్చి ప్రకటన చేశారు. మళ్లీ ఇబ్బందులు పెట్టారు. తర్వాత ఉద్యమం చేస్తే దిగివచ్చి తెలంగాణ ఇచ్చారని కేసీఆర్‌ తెలిపారు. ఒకదాని తర్వాత ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జుక్కల్‌లో మంచినీళ్ల బాధలు చూశాం. కానీ ఇవాళ మిషన్‌ భగీరథతో మంచినీళ్లు ఇస్తున్నాం. ఈ పథకం విజయంవంతం జరగుతోంది. మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి మంచిచెడ్డలను ఆలోచించి ఓట్లు వేయాలి తప్ప ఆగమాగం వేయొద్దు. షిండే అద్భతుమైన మంచి మనిషి, ప్రేమగా ఉండే మనిషి. తన వద్దకు ఎప్పుడొచ్చినా.. వ్యక్తిగతమైన పని అడగలేదు. మాది వెనుకబడ్డ ప్రాంతం అని ప్రాజెక్టుల, నీళ్లు అడిగారు అని కేసీఆర్‌ గుర్తు చేశారు. మరో గొప్ప వ్యక్తి బీబీ పాటిల్‌ ఎంపీ ఉన్నారని కేసీఆర్‌ తెలిపారు. పాటిల్‌ కంటే ముందు చాలా మంది ఎంపీలు అయ్యారు. ఎవ్వడు ఏ పని చేయలేదు. పాటిల్‌ ఆధ్వర్యంలో హైవే రోడ్లు వచ్చాయి. ఇంకా వారు కృషి చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు శ్రద్ధతో పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు అయితే రోడ్లు లేక డ్రోన్‌ ద్వారా మందులు అందించిన పరిస్థితులను చూశాం.. ఇప్పుడు చాలా వరకు బాధలు తీరాయి. జుక్కల్‌లో మంచి కార్యక్రమాలు జరిగాయి. విూరంతా త్రివేణి సంగమం లాంటి ప్రాంతంలో ఉన్నారు. విూలో చాలా ఎక్కువ మంది పాండురంగ భక్తులు ఉన్నారని కేసీఆర్‌ తెలిపారు.
చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’నాకు కొంచెం మనసు బాగా లేదు. కారణం ఏంటంటే మనం ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాం. సమస్యలపై యుద్ధం చేస్తున్నాం. శత్రువులను సైతం ఇబ్బందిపెట్టలేదు. శ్రీనివాస్‌రెడ్డి ఎలా అయితే అజాతశత్రువుగా బాన్సువాడలో ఉంటరో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రంలో అలాగే ఉన్నాం. దురదృష్టం ఏంటంటే.. చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చాతగాని వెదవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారు. ఇంతకుముందే హైదరాబాద్‌కు తరలించారు. నేను జుక్కల్‌లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడికి హరీశ్‌రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదు. విూ కార్యక్రమం ముగించుకొని రండి విూమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది. కానీ, ఇది రాజకీయమా? అరాచకమా ? అంటూ ధ్వజమెత్తారు. ఈ చేతగాని దద్దమ్మలు, వెధవలు పని చేసే చేతగాక, ఎన్నికలు ఫేస్‌ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగజారుతున్నారు అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల విూద దాడి చేస్తున్నారు. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంత మందిమి ఉన్నాం.. మాకు చేతులు లేవా..? మొండిదో లండిదో మాకో కత్తి దొరకదా..? ఒక వేళ మాకు తిక్కనే రేగితే.. దుమ్ము దుమ్మే రేగాలి ఈ రాష్ట్రంలో. తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. ఇవాళ దుబ్బాక అభ్యర్థి విూద జరిగిన దాడి.. ప్రభాకర్‌ రెడ్డి విూద కాదు.. కేసీఆర్‌ విూద దాడి జరిగిందని మనవి చేస్తున్నాను అని కేసీఆర్‌ పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.
దురదృష్టం ఏంటంటే.. చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెధవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఇంతకుముందే హైదరాబాద్‌కు తరలించారు. నేను జుక్కల్‌లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడ హరీశ్‌రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదని చెప్పారు. విూ కార్యక్రమం ముగించుకొని రండి మేమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది. కానీ, ఇది రాజకీయమా? అరాచకమా..? అంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్‌. పదేండ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి.. ఎన్నడు మనం హింసకు దిగలేదు అని కేసీఆర్‌ గుర్తు చేశారు. ప్రజలు గెలిపిస్తే గెలిచినం.. చేతనైన కాడికి ప్రజలకు సేవ చేసినం తప్ప.. దుర్మార్గమైన పనులు చేయలేదు. ఇవాళ దుబ్బాక అభ్యర్థి విూద జరిగిన దాడి.. ప్రభాకర్‌ రెడ్డి విూద కాదు.. కేసీఆర్‌ విూద దాడి జరిగిందని మనవి చేస్తున్నాను. ఈ దాడులను ఆపకపోతే సెల్ప్‌ కంట్రోల్‌ చేసుకోకపోతే మాక్కూడా దమ్మున్నది. మేం కూడా అదే పనికి ఎత్తుకుంటే విూరు ఎక్కడ కూడా మిగలరు. దుమ్ము కూడా మిగలదని మనవి చేస్తున్నాను అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మేం పదవుల్లో ఉన్నామని, మాకు బాధ్యతలు ఇచ్చారని, తిరిగి ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్నాం అని కేసీఆర్‌ తెలిపారు. కరెంట్‌ ఎట్ల రావాలి.. నీళ్లు ఎట్ల రావాలి.. నిజాం సాగర్‌ ఎట్ల నిండాలని పంటలు ఎట్ల పండాలి.. పండిన పంటలను ఎట్ల కొనుగోలు చేయాలి అనే పనుల్లో మేం ఉంటే.. విూరేమో ఈ దుర్మార్గమైన పని చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎజెండా చెప్పండి విూకు దమ్ముంటే.. ప్రజల ముందుకు రండి.. విూ వాదన ఏంటో చెప్పండి. మా వాదన మేం చెప్తం.. ఎవర్ని గెలిపిస్తే వారు పని చేయాలి. లేకుంటే ఎవడికున్న పని వాడు చేయాలి. ఎద్దో, ఎవుసమో ఏదున్నదో అది చూసుకోవాలి. కానీ లంగచాతలు ఏంది.. గూండాగిరి ఏంది.. కత్తులు పట్టి పొడిచేది ఏందఅని కేసీఆర్‌ నిలదీశారు. గన్‌మెన్‌ అప్రమత్తంగా ఉండటంతో ప్రభాకర్‌ రెడ్డి ప్రాణాలు బతికాయని కేసీఆర్‌ తెలిపారు. పాపం గన్‌మెన్‌కు కూడా దెబ్బ తగిలింది. మొత్తానికి మోసం తప్పింది.. ఆయన ప్రాణాలకు ఆపాయం లేదు. ఈ రకమైన దాడులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిరచాలని తెలంగాణ మేధావి లోకం, పెద్దలు, రాష్ట్ర శ్రేయస్సు కోరేవారందరూ కూడా ఈ దుర్మార్గాలను, హింస రాజకీయాలను ఖండిరచాలని బాన్సువాడ నుంచి అప్పీల్‌ చేస్తున్నా. పిరికిపందలు, చేతకాని వారే ఈ పని చేస్తరు తప్ప చేతనైన మొగోడు ఎవరు కూడా ఈ పని చేయడు. తస్మాత్‌ జాగ్రత్తా.. అని హెచ్చరిస్తున్నానని చెప్పి కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు