No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

కేసు తేలాకే..ఈడీ విచారణకు : కవిత

తప్పక చదవండి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ నోటీసులపై న్యాయ విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తే ఈడీ విచారణకు వెళ్లాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కవిత లాయర్లు ఆమెకు బదులు ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు కామారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపై కవిత స్పందించారు. మోదీ నోటీసు అందిందని అన్నారు. సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని కవిత కొట్టిపారేశారు. ఇది రాజకీయ పార్టీ నుంచి వచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులను తమ పార్టీ లీగల్ సెల్ పరిశీలిస్తోందని, న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని కవిత స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు