No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

గంజాయి రావాణాకు చెక్‌ పెడుతున్నతెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు

తప్పక చదవండి

హయత్‌ నగర్‌ : హైదరాబాద్‌ నగరానికి వచ్చే గంజాయి ఇతరత్రా మాదక దవ్యాలను రాకుండా అడ్డుకట్ట వేసేందుకు డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ ఆదేశాలతో నగరం చుట్టూ చెక్‌ పోస్ట్లు ఏర్పాటు చేశామని తద్వారా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ ఇన్స్పెక్టర్‌ టి. లక్ష్మణ్‌ గౌడ్‌ తెలిపారు. సాదారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు ముమ్మర తనిఖీలలో బాగంగా అబ్దుల్లాపూర్‌ మెట్టులో ఆదివారం తెల్లారుజామున వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. రంగారెడ్ది జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏ.చంద్రయ్య, సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి.రవీందర్‌ రావుల ఆదేశాల మేరకు సరూర్‌ నగర్‌ ఎఇఎస్‌ బి. హనుమంత రావు పర్యవేక్షణలో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు రామోజీ ఫిల్మ్‌ సిటీ వద్ద జాతీయ రహదారిపై అన్ని ప్రైవేట్‌ వాహనాలను, ట్రక్కు లను, బస్సులను ఇతర వాహనాలను తనిఖీ చేస్తుండగా విశాఖ పట్నం నుంచి ప్రైవేట్‌ బస్సులో ఒక వ్యక్తి నుంచి (3) కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక వాసి నేరస్థుడిని విచారించారు. విశాఖ జిల్లా నుంచి కొని కర్ణాటక రాష్ట్రం లో ఆమ్ముతున్నట్లు ముద్దాయి వెల్లడిరచినట్లు హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ ఇన్స్పెక్టర్‌ టి.లక్ష్మణ్‌ గౌడ్‌ తెలిపారు. దీని విలువ సుమారుగా 75 వేలు ఉంటుందని, అతనిపై కేసు నమోదుచేసి రిమాండ్‌ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడులలో సరూర్‌ నగర్‌ డిటిఎఫ్‌ సీఐ టి.సత్యనారాయణ, ఎస్సైలు లు జి.హనుమంతు, ఎండీ పాష, యాదయ్య, సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు