No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

బరితెగించిన మజ్లిస్‌ కార్యకర్తలు..

తప్పక చదవండి
  • కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఇల్లు, కార్యాలయం వద్దకొచ్చి న్యూసెన్స్‌..
  • ఎంఐఎం జెండాలతో 50కిపైగా బైక్‌లపై ర్యాలీగా వచ్చి బండి అంతు చూస్తామంటూ హెచ్చరికలు
  • బీజేపీకి, ‘‘హిందుత్వ’’కు వ్యతిరేకంగా నినాదాలు
  • బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో జారుకున్న ఎంఐఎం మూకలు..
  • కాసేపటి తరువాత మళ్లీ వచ్చి ఎంపీ కార్యాలయ బోర్డును కొడుతూ బండికి వ్యతిరేకంగా
    నినాదాలు
  • ఎంఐఎం తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం..

హైదరాబాద్‌ : ఎం.ఐ.ఎం. కార్యకర్తలు వీరంగం సృష్టించారు.. ఎంఐఎం జెండాలతో 50కిపైగా బైక్‌ లపై ర్యాలీగా వచ్చి బండి అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.. బీజేపీకి, ‘‘హిందుత్వ’’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం మూకలు జారుకున్నాయి.. కాసేపటి తరువాత మళ్లీ వచ్చి ఎంపీ కార్యాలయ బోర్డును కొడుతూ బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ర్యాలీకి పోలీసులెలా అనుమతి ఇచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు మండి పడ్డారు..

హిందుత్వపై దాడికి కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కరీంనగర్‌ ఎంపీ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు.. బీజేపీ కార్యకర్తల సమాచారంతో ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు పోలీసులు.. ఘటన వివరాలు తెలుసుకున్నారు.కరీంనగర్‌ లో మజ్లిస్‌ గూండాలు బరితెగించారు. శుక్రవారం రోజు (మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో) పట్టపగలు అందరూ చూస్తుండగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నివాసం, ఎంపీ కార్యాలయం వద్దకు వంద మందికిపైగా మజ్లిస్‌ మూకలు బైక్‌ లపై వచ్చి అలజడి సృష్టించారు.. మజ్లిస్‌ జెండాలు చేతపట్టుకుని ఎంపీ కార్యాలయ చౌరస్తాను బ్లాక్‌ చేసి బండి సంజయ్‌ అంతు చూస్తామంటు హెచ్చరించారు. బీజేపీ డౌన్‌ డౌన్‌ అంటూ హిందూత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. బీజేపీ కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తొలుత 50కి పైగా బైకులపై మజ్లిస్‌ జెండాలు పట్టుకుని ఎంపీ కార్యాలయానికి వచ్చిన మజ్లిస్‌ మూకలు బండి సంజయ్‌ కు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు.

- Advertisement -

బండి ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. కార్యాలయంలో ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తలు తోటి వారికి సమాచారం ఇవ్వడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడి నుండి జారుకున్న మజ్లిస్‌ మూకలు నేరుగా బండి సంజయ్‌ నివ్షాసానికి వెళ్లి బండి ఖబడ్దార్‌ బీజేపీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలిస్తూ అలజడి సృష్టించారు.. కాసేపటి తరువాత మళ్లీ ఎంపీ కార్యాలయం మీదుగా వెళుతూ బండి సంజయ్‌ కు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ భయాందోళనలు సృష్టించారు.. అప్పటికే అక్కడున్న బీజేపీ కార్యకర్తలు ఎంఐఎం మూకల వద్దకు వస్తుండటంతో అక్కడి నుండి జారుకున్నారు. జరిగిన సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అంత పెద్ద సంఖ్యలో మజ్లిస్‌ మూకలు ర్యాలీగా వస్తుంటే అనుమతి ఎలా ఇచ్చారంటూ మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు అనుమతి ఇవ్వకుండా హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు బండి సంజయ్‌ ఇంటిమీదకు, ఎంపీ కార్యాలయంపై దాడికి ర్యాలీగా వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల, నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ చేస్తున్న కుట్రలకు పోలీసులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని బండి సంజయ్‌, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు కరీంనగర్‌ బీజేపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ నాయకులిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఎంపీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌ రావు, కార్పొరేటర్‌ రాపర్తి ప్రసాద్‌, ఉప్పరపల్లి శ్రీనివాస్‌ తదితరుల నుండి వివరాలు సేకరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు