Wednesday, October 23, 2024
spot_img

ఆకలితో అలమటించిన విద్యార్థినిలు…

తప్పక చదవండి
  • విషయం తెలుసుకొని చలించిపోయిన జిల్లా న్యాయమూర్తులు
  • జిల్లా న్యాయ సేవ అధికార.. సంస్థ ఆదేశాలతో
    హాస్టల్లో వంట మనుషుల నియామకం

నవాబుపేట : హాస్టల్లో వంట మనుషులు లేక ఆకలితో విద్యార్థినిలు అలమటించిన సంఘటన వికారాబాద్‌ జిల్లాలోని నవాబుపేట్‌ మండల కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సామాజిక మాధ్య మాలలో రావడానికి చూసి జిల్లా న్యాయ మూర్తులు చలించిపోయారు. ఆదర్శ పాఠశాల లోని బాలికల హాస్టల్‌ లో వంట మనుషులు లేక విద్యార్థులు ఎన్నో రోజులుగా సమయానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఇంత దౌర్భా గ్యమైన పరిస్థితులు దాపురించినప్పటికీ సంబం ధిత అధికారులు పట్టించుకోక పోవడమే గాక సిబ్బందిని అడిగితే బుఖాయిస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈ విషయంపై స్పందించిన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్‌ కే.సుదర్శన్‌ ఆదేశాల మేరకు జిల్లా సెక్రటరీ న్యాయమూర్తి డి.బి. శీతల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులను, మండల విద్యాధికారిని వెంటనే పిలిపించి వంట పని చేసే వారిని తక్షణమే నియమించాలని ఆదేశించారు. వెంటనే నిద్రమత్తు వీడి విద్యాధికారులు వంట మనుషులను నియమించారు. విద్యార్థుల ఆకలి సమస్యను తీర్చిన న్యాయమూర్తి డి.బి శీతల్‌ కు హాస్టల్‌ విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.స్థావరంపై అధికారుల దాడులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు