No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

పల్లె, పట్టణం తేడా లేకుండా ఘనంగా లంబోదరుడికి విశేష పూజలు

తప్పక చదవండి

దేశ వ్యాప్తంగా అన్ని గణపతి మండపాలలో భక్తులచే వినాయ కులు విశేష పూజలు అందుకుంటూ వున్నారు. గణనాథులు ప్రతి ష్టించి ఆరు రోజులు అవుతూ ఉంది. తనను మనస్ఫూర్తిగా ఆరా దించేవారికి కొంగుబంగారం ఈ లంబోదరుడు.ప్రతి సంవత్సరం హిందువులకు ఎంతో ఆరాధ్యనీయమైన ఈ వినాయక చవితి పం డుగను పురస్కరించుకొని అట్టహాసంగా, శోభయానంగా ఈ శుభ దినాన్ని నిర్వహించడం హిందూ సోదరీ, సోదరులకు సర్వ సాధా రణ విషయం. ఈ పర్వదినం రోజున ప్రతి హిందూ బంధువు తమ స్థాయికి తగ్గట్లు ఓక వినాయక ప్రతిమను కొని తెచ్చు కొని దానిని మామిడిఆకులు, గరికతో, ఇతరత్రా సువాస నను వెదజల్లే పూలతో అలంకరించి, నైవైద్యం సమర్పించి దానిని నిమజ్జనానికి తరలించేవరకు కూడా ఆఇంటిల్లిపాది ఎంతో కోలాహలంగా, అత్యంత ఉత్సహంతో సంబరాలు అంబరాన్ని అంటేలా చేసు కోవడం చుస్తే ప్రతి ఒక్కరి మనస్సు,హృదయం ఎంతో ప్రశాంత చిత్తంతో పులకించిపోతుంది. వీధి, వీధిలో ప్రధాన కూడళ్లలో, వాడ వాడ లా ప్రతిష్టించే వినాయక విగ్రహాల నిర్వాహకుల హడా విడి అంతా ఇంతా కాదు. వినాయక విగ్రహం చుట్టూ అత్యంత అందమైన రీతిలో లైట్లను, దీపాలను కాంతివంతంగా అలంకరిం చడం మొదలు ప్రతిరోజు భిన్నమైన ప్రసాదాలను భక్త్రులకు పంచి పెట్టడంతో పాటు ఆ ఏకదంతుని లడ్డును అత్యంత అధిక ధరకు వేలం నిర్వహించడం, నిమర్జన ఘట్టం అత్యంత ఆర్బాటంగా ముగించే వరకు ఆ ప్రాంతవాసులంతా ఎంతో ఆనందోత్స వాలతో మునిగిపోయి, సోదర, సోదరి భావంతో ఒకరికొకరు మసలు కొంటూ, స్నేహంగా వుంటూ తరించి పోతూ, మైమరచి పోతు వుంటారు. ప్రతీ రోజు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతూ వుంది.ఏదిఏమైనా గణపతి,గజానన,లంబోదర, గణేశ, ఏక దంత, గౌరీపుత్ర, వక్రతుండ ఇలా పలు రకాల పేర్లతో పిలువబడే ఈ విగ్నేశ్వరుడు, పార్వతి, పరమేశ్వరుల ముద్దుల తన యుడిగా పిలి చిందే తడువుగా తన భక్తుల ఆకాం క్షలను, కోరికల ను నెర వేర్చే కల్పతరువుగా రైతుల పాడిపంటలను ఎలాంటి ఆటంకాలు లేకుం డా ఎల్లవేళలా కాపాడుతూ సకల సంపదలు, ఆయురారో గ్యాలు ప్రసాదించే దేవదేవుడు ఈ గణేష్‌ మహారాజ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అశేషభక్తజనకోటితో జనసందోహంతో భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్నాడు. ఈపార్వతి, పర మేశ్వరుల గారాలపట్టి,ముద్దులొలికేతనయుడు ఈగణపతి దేవుడు.
` కామిడి సతీష్‌ రెడ్డి హన్మకొండ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు