Thursday, September 19, 2024
spot_img

సినిమా పక్కీలో స్మగ్లింగ్..

తప్పక చదవండి
  • వాషింగ్ మిషన్లలో నగదు రవాణా..
  • ఎన్.ఏ.డీ. పోలీసుల దాడిలో విస్తుపోయే సంఘటన..

అమరావతి : ఇడియట్ సినిమాలో.. రోజుకు ఒక బైకుపై ఆలీ ఇసుక తరలిస్తూ ఉంటాడు. ప్రశ్నిస్తే ఇసుకను తరలిస్తున్నానని చెప్తాడు తప్ప.. అసలు విషయం అనేది చెప్పడు. చివరకు ఆలీ తరలించేది ఇసుకేనంటూ నిర్ధారిస్తారు.. ఇసుక మూటల పేరుతో రోజు ఒక బైక్ దొంగలించి తరలించేస్తున్నట్టు గుర్తించి అవాక్కవుతారు. అచ్చం అటువంటిదే విశాఖలో ఓ సీన్.. తెరపైకి వచ్చింది.! ఇక్కడ ఇసుక కాదు.. బైకు కాదు..! వాషింగ్ మిషన్ల లోడు మాటున నగదు తరలిపోతుంది. ఓ ఆటో రాత్రిపూట ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళ్తుంది. దసరా సీజన్ కదా..! ఏదో లోడింగ్ లే అనుకున్నారు. కానీ అందులో ఏదో ఒక మతలబు ఉంది. ఈ సమాచారం కాస్తా పోలీసులకు అందింది. వెంటనే రాత్రిపూట గుట్టుగా వెళ్తున్న ఆటోను ఆపారు. వెరిఫై చేశారు. ఆటోలో ఉన్నవన్నీ వాషింగ్ మెషిన్లే. అన్ని కొత్తవి కాబట్టి సీల్ చేసి ఉన్నాయి. ఇంకా పోలీసులకు ఏదో అనుమానం. డ్రైవర్ను ప్రశ్నిస్తే విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నట్టు చెప్పాడు. విశాఖ నుంచి వాషింగ్ మిషన్లు విజయవాడకు తరలిస్తారా..? అది కూడా ఓ షాపు నుంచి మరో షాపునకు..! మళ్లీ అనుమానం..! దీంతో ఇక వాషింగ్ మిషన్లను ఒక్కొక్కటి దింపి.. చెక్ చేశారు.. దీంతో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. విశాఖలో వాషింగ్ మిషన్లలో తరలిస్తున్న భారీగా నగదు పట్టుబడింది. ఆటోలో తరలిస్తుండగా ఎన్ఏడీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. క్రైమ్ పోలీసుల తనిఖీల్లో నగదు తరలింపు గుట్టు బయటపడింది. కొత్తగా సీల్ చేసి ఉన్న ఆరు వాషింగ్ మిషన్లను ఆటోలో తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆటో వెనకే బైక్ పై మరొకడు పైలెట్‌గా వెళ్తున్నాడని తెలిపారు.. డ్రైవర్ను ప్రశ్నిస్తే విశాఖ నుంచి విజయవాడ తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. వాషింగ్ మిషన్ల సీల్ విప్పించారు. వాషింగ్ మెషిన్లలో 1.30 కోట్ల నగదు కట్టలు గుర్తించారు. నగదుతో పాటు 30 కొత్త సెల్ఫోన్లు కూడా ఉన్నాయి. వెంటనే ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆరు వాషింగ్ మెషిన్లు, ఆటో, బైక్ సీజ్ చేశారు. విశాఖ నుంచి విజయవాడకు గుట్టుగా తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే.. 41 102 సి ఆర్పిసి కింద కేసు నమోదు చేసి సొత్తును సీజ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు