Friday, September 20, 2024
spot_img

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు పారమిత విద్యార్థి ఎంపిక

తప్పక చదవండి

కరీంనగర్‌ : అక్టోబర్‌19 నుండి 21 తేదీలలో రాష్ట్ర పాఠశాలల క్రీడా సమైఖ్య వారి ఆద్వర్యంలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో జరుగనున్న 67 రాష్ట్రస్థాయి వాలీబాల్‌ అండర్‌ 17 బాలుర విభాగంలో స్థానిక పారమిత మంకమ్మతోట ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విధ్యార్థి పతాకాల అశ్విత్‌ ఎంపికయ్యాడని పారమిత పాఠశాల ప్రధానోపాద్యాయులు బాలాజీ తెలిపారు.ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పాఠశాలల క్రీడా సమైఖ్య వారి ఆద్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీలలో పతాకాల అశ్విత్‌ అండర్‌ 17 బాలుర విభాగంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నుండి అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపీకయ్యాడు. ఈ సంధర్భంగా పారమిత పాఠశాలల అధినేత డా: ఇనుగంటి ప్రసాదరావు అశ్విత్‌ ని ప్రత్యేకంగా ఆభినందించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన పతకాల అశ్విత్‌ ను పారమిత పాఠశాలల డైరెక్టర్లు వినోద్‌ రావు, హను మంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్‌, ఏస్‌,ఓ,డి తిరుపతి రావు, సమన్వయకర్తలు వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీను నాయక్‌, సాగర్‌ ఉపాధ్యాయులు అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు