Friday, September 20, 2024
spot_img

తూకంలో మోసాలు

తప్పక చదవండి
  • మార్కెట్‌ పరిసరాలలో తప్పుడు తూకాలతో చిల్లర వ్యాపారులు
  • బండారాలతో తూకాలు మోసపోతున్న వినియోగదారులు
  • మత్తు నిద్రలో తూనికల కొలతల శాఖ అధికారులు

పరిగి : పరిగి పట్టణంలో చిల్లర వ్యాపారుల మోసాలకు వినియోగదారులు బలి అవుతున్నారు. రోజం తా కష్టపడి కాస్త డబ్బు సంపాదించి మార్కెట్లో కూరగాయలకు పండ్ల కు ఖర్చు పెడితే కూరగాయలు అమ్మే చిల్లర వ్యాపారులు బండారా లతో తూకాలు చేస్తూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నా రు.కిలో టమోటాలు తీసుకుంటే తూకంలో 100 గ్రాములు మోసం పోతున్నారు. అటు బండారాలతో తూకాలు చెస్తూ మోసం చేస్తుంటే మరోపక్క కాంటాలు సరిగా లేక 70 నుంచి 100 గ్రాముల మోసా నికి వినియోగదారులు గురవుతున్నారు.వీటిని అరికట్టడంలో తూని కల కొలతల శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏడాది కి ఒకసారి కాంటారాల తూకాలను రెండేళ్లకు ఒకసారి తుని కల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి ముద్ర వేయవలసి ఉంటుం ది కానీ అది ఎక్కడ జరగటం లేదు.శుక్ర శని వారాలలో జరిగే సొం తలలో భారీ మోసానికి వినియోగదారులు గురి అవుతున్నారు.కావున ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వినియోగ దారులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు