Friday, September 20, 2024
spot_img

ఆర్ఐ భరత్ వృత్తి రీత్యా జాప్యం చేస్తూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు..

తప్పక చదవండి
  • తహశీల్దార్ కి వినతి పత్రం సమర్పించిన యునైటెడ్ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు నజీర్..

హైదరాబాద్ : గుర్రంపోడు నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన తౌఫీక్ అహ్మద్ ని యునైటెడ్ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు నజీర్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల ఆర్ఐ భరత్ వృత్తి రీత్యా జాప్యం చేస్తూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ ఐ భరత్ సామాన్యులను, రైతులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని, కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండరు అని తెలియజేస్తూ, కార్యాలయానికి వచ్చిన బాధితుల దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొని పట్టాలు చేస్తా అని నమ్మబలికారు అని ఆరోపిస్తూ.. తన చరవాని నంబర్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడు అని.. ప్రజలతో అమర్యాదగా మాట్లాడుతారు అని.. కార్యాలయ సిబ్బందికి కూడా సహకరించడు అని అన్నారు.. తన బాధితులు ఎంతో మంది వున్నారు అని, తన కోసం బాధితులు నెలల తరబడి ఒక వందలసంఖ్యలో ఎదురు చూస్తున్నారు అని అన్నారు.. తను కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా తను కలెక్టరేట్ కార్యాలయంలో విఆర్ఏ, విఆర్ఓ ఉద్యోగుల గురించి పైరవీలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు అని మండిపడ్డారు.. ఎవరైనా ప్రశ్నిస్తే నాకు వాళ్ళు తెలుసు.. వీళ్ళు తెలుసు అంటూ బెదిరిస్తున్నారు అని వాపోయారు.. ఇటీవల కాలంలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఆయనపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని తెలియజేశారు.. వెంటనే అధికారులు తన పైన చర్యలు తీసుకోని, తనని సస్పెండ్ చేయాలని కోరుతూ.. బాదితులకు న్యాయం చేయాలని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జహంగీర్, యూనస్, అజీమ్, మౌలానా తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు