No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

పోలీస్‌ అధికారుల సమీక్షా సమావేశం

తప్పక చదవండి
  • ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది కేటాయింపు పై
    అధికారులతో ఎస్పీ సమావేశం.
  • ప్రతి గ్రామానికి చేరేలా పోలీస్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌.
  • ప్రశాంత ఎన్నికలకు పౌరుల భాగస్వామ్యం కూడా అవసరం
  • జిల్లాకు బారిగా కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసు
    సిబ్బంది రాక : జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే.

సూర్యాపేట క్రైమ్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లాలో పోలీసు బందోబస్తు నిర్వహణకు పోలీసు సిబ్బంది వినియోగం, డిప్లాయ్మెంట్‌ కు సంభందించి జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అదనపు ఎస్పి నాగేశ్వరరావు గారితో కలిసి జిల్లాలో ఉన్న డిఎస్పీలు, సర్కిల్‌ ఇన్స్పెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశం లో జిల్లాలో జరగనున్న ఎన్నికలకు నిభందనల ప్రకారం పోలీసు సిబ్బందిని కేటాయించడంపై ఎస్పీ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున అత్యంత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని జిల్లాలో పోలీసు సిబ్బంది కేటాయింపులు పక్కాగా చూసుకోవాలని నియోజకవర్గ పోలీస్‌ నోడల్‌ అధికారులను, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ లను ఆదేశించారు. ప్రతి మార్గంలో స్థానికంగా అవగాహన కలిగిన పోలీసు అధికారిని రూట్‌ గైడ్‌ గా ఉంచాలని, కేంద్ర బలగాలను కచ్చితమైన నిర్దేశాలు చూపాలని అన్నారు. సిబ్బందిపై వత్తిడి లేకుండా కేటాయింపు ఉండాలని సూచించారు. అలాగే రూట్‌ మొబైల్‌ టీమ్‌ కు అనుబంధంగా వేగంగా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది పని చేయాలని అన్నారు. జిల్లాకు పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసులు వస్తున్నారు అని తెలిపినారు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ నిర్వరామంగా పని చేయాలని సమయం ను సర్దుబాటు చేసుకోవాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల దృష్టి ఉంచి వత్తిడికి లోనవకుండా మానసికంగా దృఢంగా ఉంచాలని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న ప్రతి అధికారి, సిబ్బందితో సమన్వయం ఉండాలి, సమయపాలన ఉండాలని తెలిపినారు. విధులు నిర్వహణ పట్ల సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించాం అని అన్నారు. చేయవలసిన, చేయకూడని విషయాలతో చేతి పుస్తకం ప్రతి సిబ్బందికి అందించాలని ఆదేశించారు. పోలింగ్‌ బూత్‌ వద్ద నిర్వహించాల్సిన విధులు,ఈ.వి.ఎం లు తీసుకురావడం, తీసుకెళ్లడం అత్యంత ప్రధానమైనవి అన్నారు. పోలీస్‌ నోడల్‌ అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందిని మోటివేషన్‌ చేయాలని తెలిపినారు. స్థానికంగా ఎస్‌.ఐ లు వేగంగా స్పందించాలి, మానిటరింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు నిచ్చితంగ పర్యవేక్షణ చేయాలి అని కోరినారు. పోలీస్‌ కమ్యునికేషన్‌ వ్యవస్థ, ఐ.టి వ్యవస్థ లోపాలు లేకుండా పని చేయాలి అని సూచించారు.ఎలక్షన్‌ సెల్‌ ఎప్పటికప్పుడు ప్రక్రియను నమోదు చేయాలి, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది స్థానికంగా ఇంటలిజెన్స్‌ ను సేకరించాలని అన్నారు. ప్రతి మండలానికి ఎస్‌.ఐ అధ్వర్యంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పని చేస్తుంది, సర్కిల్‌ పరిధిలో సి.ఐ అప్రమత్తంగా ఉంటారు.ప్రతి నియోజకవర్గ పరిధిలో పోలీస్‌ నోడల్‌ అధికారి అధీనంలో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పని చేస్తుంది అన్నారు. సమస్యలు తలెత్తకుండా పని చేస్తాము, ఈ ప్రక్రియలో పోలీసు తో పౌరుల భాగస్వామ్యం చాలా ముఖ్యం అని ఎస్పీ కోరారు. ప్రతి గ్రామానికి పోలీసు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ అత్యంత వేగంగా చేరేలా ప్రణాళిక చేశాం అన్నారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పి నాగేశ్వరరావు,డిఎస్పీ లు నాగభూషణం, ప్రకాష్‌, రవి, శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్‌ రాజేష్‌, ఎలక్షన్‌ సెల్‌ ఇన్స్పెక్టర్‌ మహేష్‌, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ లు రాజశేఖర్‌, అశోక్‌, శివ శంకర్‌, బ్రహ్మ మురారి, రామలింగా రెడ్డి, వీరరాఘవలు, రామకృష్ణా రెడ్డి, రాము, రవి కుమార్‌, సిసిఎస్‌ ఇన్స్పెక్టర్‌ నాగార్జున, ఆర్ముడ్‌ రిజర్వ్‌ ఆర్‌.ఐ నారాయణ రాజు, కమ్యునికేషన్‌ ఎస్‌.ఐ రాంబాబు, సిబ్బంది ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు