No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

గ్లోబల్‌ మార్కెట్లోకి రెనాల్ట్‌ న్యూకంపాక్ట్‌

తప్పక చదవండి
  • ఎస్‌యూవీ కార్డియన్‌ ఆవిష్కరణ..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌.. గ్లోబల్‌ మార్కెట్లోకి న్యూ కంపాక్ట్‌ ఎస్‌యూవీ కారు ‘కార్డియన్‌ ఆవిష్కరించింది. 13కి పైగా అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌తో కూడిన సేఫ్టీ ఫీచర్లతో వస్తోందీ కారు. రెనాల్ట్‌ కైగర్‌ తర్వాత ఈ సంస్థ నుంచి మార్కెట్లో ఆవిష్కరించిన బుల్లి ఎస్‌యూవీ కారు ఇదే. ఫియట్‌ పల్స్‌తోపాటు టాటా పంచ్‌, నిసాన్‌ మ్యాగ్నైట్‌ వంటి కార్లతో పోటీ పడుతుందీ రెనాల్ట్‌ కార్డియన్‌. కంపెనీ సీఎంఎఫ్‌-బీ ప్లాట్‌ఫామ్‌ ‘సాండెరో స్టెప్‌వే’పై నిర్మించారు. సాండెరో నుంచి బాడీ ప్యానెల్స్‌, ఇంజిన్‌, డిజైన్‌ ఎలిమెంట్స్‌ వినియోగించారు. రెనాల్ట్‌ కార్డియన్‌ కారు డబుల్‌ లేయర్‌ గ్రిల్లె, లాంగ్‌ బంపర్‌, ఫాక్స్‌ బ్రష్డ్‌ అల్యూమినియం స్కిడ్‌ ప్లేట్‌, ఫ్రంట్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. కూపే-ఎస్‌యూవీ తరహా బాడీ షెల్‌, వీల్‌ ఆర్చెస్‌ పై బాడీ క్లాడిరగ్‌, రన్నింగ్‌ బోర్డ్స్‌తో ఈ కారును స్ట్రాంగ్‌ ఎస్‌యూవీగా నిలుపుతాయి. కైగర్‌ తరహాలో సీ-షేప్డ్‌ డిజైన్‌తోపాటు టెయిల్‌ ల్యాంప్‌ వస్తుంది. టాప్‌ హై ఎండ్‌ వేరియంట్లలో స్టయిలిష్‌ అల్లాయ్‌ వీల్స్‌, రూఫ్‌ రెయిల్స్‌, షార్క్‌ ఫిన్‌ ఆం టీనా, అడిషనల్‌ క్రోమ్‌ బిట్స్‌ ఉంటాయి. ఇతర రెనాల్ట్‌ ఎస్‌యూవీ కార్ల మాదిరే 8-అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌, డ్రైవ్‌ మోడ్‌ సెలెక్టర్‌, 4-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, వేరియంట్‌ను బట్టి వుడ్‌ ఇన్‌సర్ట్స్‌, ఫాక్స్‌ బ్రష్డ్‌ అల్యూమినియంతో పియానో బ్లాక్‌ తదితర ఫీచర్లు జత చేశారు. రెనాల్ట్‌ కార్డియన్‌ 1.0 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 125 హెచ్పీ విద్యుత్‌, 220 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. 6-స్పీడ్‌ డీసీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌ మిషన్‌ ఆప్షన్‌ కలిగి ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు