Thursday, October 24, 2024
spot_img

ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ స్వీకరణకు సిద్ధం

తప్పక చదవండి

మిర్యాలగూడ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు గాను ఈ నెల 3 నుండి నామినేషన్‌ పత్రాల స్వీకరణకు స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాట్లుపూర్తి చేశారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయ బోర్డుపై ఎన్నికల అధికారి కార్యాలయం అని ఫ్లెక్సీ, లోపల మరో రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఆన్‌ లైన్‌ లో నామినేషన్‌ దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు. వ్యక్తిగతంగా నామినేషన్లు తీసుకునే అవకాశం కూడ ఉంది. నామినేషన్‌ స్వీకరణకు రిటర్నిగ్‌ అధికారిగా ఆర్డీఓ బి. చెన్నయ్య, సహాయ అధికారిగా మిర్యాలగూడ తహసిల్దార్‌ హరిబాబు లను ఎన్నికల సంఘం నియమించింది. నామినేషన్లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతి ఉంది. అదేవిధంగా పాత్రికేయులకు కూడ రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ లోకి వెళ్లే అనుమతి లేదు ప్రాంగణం వరకే పరిమితం చేశారు. మిర్యాలగూడ- హుజూర్‌ నగర్‌, వాడపల్లి రహదారిపై కార్యాలయం ఉండటంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు నామినేషన్‌ ప్రక్రియా జరిగే రోజుల్లో నిలిపి వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు