Thursday, September 19, 2024
spot_img

కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా

తప్పక చదవండి
  • రాజీనామా లేఖను ఖర్గేకు పంపించిన పొన్నాల
  • జనగామ టికెట్ దక్కదన్న ఉద్దేశంతో గుడ్‌బై
  • పొన్నాల త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరే అవకాశం

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. అయితే పొన్నాల లక్ష్మయ్య అధికార బీఆర్ఎస్‌లో త్వరలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు.. పొన్నాల లక్ష్మయ్య పంపించారు. ఈ సందర్బంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. పొన్నాల లక్ష్మయ్య అధికార బీఆర్ఎస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే తన సొంత నియోజకవర్గం జనగామలో 2014, 2018 లో వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2014 లో తానే పార్టీ తరఫున పోటీ చేసేవారికి టికెట్లు అందించిన పొన్నాల లక్ష్మయ్యకు 2018 లో మాత్రం అంత సులువుగా టికెట్ లభించలేదు. దీంతో తన పలుకుబడితో ఢిల్లీకి వెళ్లి చివరి నిమిషంలో జనగామ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లోనూ జనగామ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై వ్యతిరేకత ఉన్నా ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో విఫలమైన పొన్నాల ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి టికెట్ ఇచ్చినా పొన్నాల లక్ష్మయ్య గెలవలేడని భావించిన అధిష్ఠానం టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

దీనికితోడు గత కొన్ని రోజులుగా బీసీలకు టికెట్లు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర చిన్నచూపు చూస్తోందని పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ బీసీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీసీ నేతలంతా కలిసి పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి కూడా వెళ్లిన పొన్నాల తనకు టికెట్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ టికెట్ రాదని నిర్ధారించుకున్న పొన్నాల ఇక పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు