Friday, September 20, 2024
spot_img

దళితబంధుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌..

తప్పక చదవండి
  • ఈ స్కీం లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండరాదు..
  • ఎమ్మెల్యేల అనుచరులకు స్కీం అమలు చేస్తున్నారన్న పిటిషనర్..
  • విచారణ రెండు వారాలకు వాయిదా..

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా రూపొందించి దళితబంధు స్కీంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దళితబంధు స్కీమ్‌లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయం, సిఫార్సులు ఉండకూడదని పిల్‌ దాఖలైంది. ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సు మేరకు దళితబంధు అర్హులను సెలెక్ట్‌ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా దళితబంధు అర్హులను ప్రస్తుతం ఎంపిక చేస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ లిస్ట్‌లో ఎమ్మెల్యేల అనుచరులకే ఈ పథకం వర్తింపజేస్తున్నారని తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు