Friday, September 20, 2024
spot_img

కారులో ఓవర్‌ లోడ్‌….ఉప్పల్‌లో కారు ముందుకు సాగేనా…

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్న ఉద్యమకారులు….
  • ఉప్పల్‌ నియోజకవర్గం ‘‘హస్తగతం’’…
  • కార్పొరేటర్ల ఒంటెద్దు పోకడలే బీఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ….
  • త్వరలో హస్తం గూటికి ఉద్యమకారులు….

నాచారం : ఉప్పల్‌ నియో జక వర్గంలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బి ఆర్‌ఎస్‌ కు గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిగా ఉప్పల్‌ డివిజన్‌, చిలకనగర్‌ డివిజన్‌, రామంతపూర్‌ డివిజన్‌, హబ్సిగూడ డివిజన్‌, కాప్రా సర్కిల్‌ పరిధిగా నాచారం డివిజన్‌, మల్లాపూర్‌ డివిజన్‌, మీర్పేట్‌ హౌసింగ్‌ బోర్డ్‌ డివిజన్‌, చర్లపల్లి డివిజన్‌, ఏ.ఎస్‌.రావు నగర్‌ డివిజన్‌, కాప్రా డివిజన్‌ పరిధిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి వ్యతిరేకత పవనాలు కనబ డుతున్నాయి. కాప్రా సర్కిల్‌ పరిధిలో బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమకారులను, సీనియర్‌ నాయకులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు ఉద్యమకారులను ప్రచారంలో అవహేళన చేస్తూ కించపరిచే విధంగా వ్యవహరించడంతోని హస్తం గుటికి చేరుకుంటున్నారు. కార్పొరేటర్లనే నమ్ముకున్న బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్‌ నియోజకవర్గం గెలవడం కష్ట సాధ్యంగానే కనిపిస్తుందని ఉద్యమకారులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
హస్తం గూటికి ఉద్యమకారులు….
బండారి లక్ష్మారెడ్డి వ్యవహార చేరి నచ్చక ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌ గూటికి చేరాడంతో బిఆర్‌ఎస్‌పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కాప్రా డివిజన్‌, చర్లపల్లి డివిజన్‌, మల్లాపూర్‌ డివిజన్‌లో బిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఉన్న ఇక్కడి కార్పొరేటర్ల వ్యవహార శైలితో నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు. కాలనీ సంఘాల ప్రతినిధులతో స్థానిక కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత దూషణలు పాల్పడుతున్నారని కాలనీ సంఘాలు ప్రతినిధులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్‌ సర్కిల్‌లో కలిసి వచ్చేనా… కాప్రా సర్కిల్‌లో కలిసివచ్చేనా…..
ఉప్పల్‌ నియోజకవర్గం లోని ఉప్పల్‌ సర్కిల్‌ లోని నాలుగు డివిజన్‌ లు, కాప్రా సర్కిల్‌లోని ఆరు డివిజన్‌లు బిఆర్‌ఎస్‌కు ఓట్ల రూపకంలో కలిసి వచ్చేనా అని సందేహం కలుగుతుంది. ఉప్పల్‌ సర్కిల్‌ లో కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహరి శైలితో పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తుంది. కాప్రా సర్కిల్‌ పరిధిలో ఆరు డివిజన్‌ లు ఉన్న బిఆర్‌ఎస్‌కు ఓట్ల రూపకంగా పడే అవకాశాలు తక్కువ ఉన్నట్లు బిఆర్‌ఎస్‌ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఉప్పల్‌ నియోజక వర్గంలో టిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు హోరా హోరి పోరులో విజేతలు ఎవరు అనేది ఓటరు చేతిలో నిక్షిప్తమై ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు