No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

త్వరలోనే నోటిఫికేషన్‌

తప్పక చదవండి
  • ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ
  • 2, 3 రోజుల్లో ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌
  • ఒక్క విడతలోనే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌,మిజోరం, తెలంగాణ ఎన్నికలు
  • చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
  • డిసెంబరు 10-15 మధ్య ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌ : దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈనెల 8 నుంచి 10 లోపు ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి షెడ్యూల్‌ ప్రకటించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 8 నుంచి 10 లోపు ఎన్నికల ప్రకటన వెలువరించవచ్చని నేషనల్‌ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా ఈ సమాచారం లీక్‌ అయినట్లు తెలుస్తోంది. నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారం లోపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనున్నట్లు సమాచారం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రెండు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తుండగా.. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ విజయవంతంగా పూర్తి చేసి డిసెంబర్‌ 2 వ వారంలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. డిసెంబర్‌ 10 నుంచి 15 మధ్య ఐదు రాష్ట్రాల్లో పోలైన ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. ఇటీవల 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించింది. మరోవైపు.. మరోసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయవచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఈ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరాం శాసనసభ పదవీ కాలం ఈ డిసెంబర్‌ 17 తో ముగియనుంది. ఇక వచ్చే ఏడాది జనవరి 3 న ఛత్తీస్‌గఢ్‌, 6 వ తేదీన మధ్యప్రదేశ్‌, 14 వ తేదీన రాజస్థాన్‌, 16 వ తేదీన తెలంగాణ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు