Friday, September 20, 2024
spot_img

నిర్లక్షానికి చిరునామా శ్రీ సోమేశ్యర పారా బాయిల్ట్‌ రైస్‌ మిల్లు..

తప్పక చదవండి
  • ప్రశ్నిస్తున్న మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షులు సోమరం పోశయ్య..

భూధాన్‌ పోచంపల్లి : ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరి స్తున్నారు..? ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేదా..? శ్రీ సోమేశ్యర పారాబోయిల్ట్‌ రైస్‌ మిల్లు యాజమాన్యానికి ఎందుకు ఇంత నిర్లక్షం..? ఎవరు ఎవరు ఏమంటారులే.. మా పని మేము చేసుకుంటా పోతాములే అన్నట్టు వుంది వారి వ్యవహారం.. వివరాలు చూస్తే.. పోచంపల్లి మండలం, పెద్ద రావులపల్లి గ్రామంలో, శ్రీ సోమేశ్యర పారా బాయిల్ట్‌ రైస్‌ మిల్లు నుండి వచ్చే వ్యర్ధాలు పెదరావులపల్లి చెరువులో కలిసి నీరు కలుషితమై మత్స్యకారులు చేపలు పట్టడంతో.. ఆ కలుషితమైన నీరుకి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. చెరువులో కలవడం ద్వారా బర్రెలు, గేదెలు, మొదలైన జంతువులు ఆ నీరు తాగడం ద్వారా చాలా భయంకరమైన వ్యాధులు సోకి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నవి.. ఈ వ్యర్థ పదార్థాల నుండి రక్షించాలని పెదారావుల పల్లి సర్పంచ్‌ మట్ట బాలమణి సుదర్శన్‌ కి ఫిర్యాదు పత్రం ఇవ్వడం జరిగింది. మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షులు సోమరం పోశయ్య మాట్లాడుతూ.. పెద్ద రావులపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర పారబోయిల్డ్‌ రైస్‌ మిల్లు నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టా భూముల సర్వే నెంబర్స్‌ : 309, 310, 311 పూర్తి విస్తీర్ణం 2 ఎకరాల 25 గుంటల వ్యవసాయ భూములు, ఇతర రైతుల వ్యవసాయ భూమిలో కూడా ఇట్టి వ్యర్ధాలు కలుస్తున్నాయి. ఇట్టి రైస్‌ మిల్లర్ల నుండి వచ్చే వ్యర్ధాలు తమ భూముల్లో ప్రవహించడం వలన వ్యవసాయం చేయకుండా.. మా భూములు వ్యర్థ పదార్థాలకు కలుషిత మవుతున్నవి. త్రాగే నీరు కూడా కలుషితమై భూములో సారవంతం కోల్పోతున్నవని అన్నారు. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతాప్‌ సాగర్‌ చెరువు చెరువులో కలవడం ద్వారా చెరువులో ఉన్నటువంటి చేపలకు అనేక రకాలైన రోగాలు రావడంతో చనిపోవడంతో మత్స్య కార్మికులు భారీగా నష్టపోవడం జరుగుతుంది. చెరు వులో చేపలు పట్టాలన్నా ఎలర్జీ లాంటి సమస్యలు వస్తున్నవి. నీరు కూడా కలుషితమై ఆ నీరు తాగాలంటనే చాలా భయంగా ఉంటుంది. ఈ విధంగా అట్టి రైస్‌ మిల్లుల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు వల్ల మత్స్య కార్మికుల అన్ని రకాలుగా నష్టపోతు న్నారు. జీవనోపాధిని నమ్ముకున్న కార్మికులను ఎవరు ఆదుకోవాలి. ఈ వ్యర్థ పదార్థాలని పెద్దారావులపల్లి ప్రతాప్‌ సాగ ర్‌లో కలపకూడదని కార్మికులు మొరపెట్టుకుం టున్నారు. రైస్‌ మిల్లల్లో నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు బయటికి రాకుండా ట్యాంకర్లులో నిలువ చేసుకోవాలని, ఇంతకుముందు కూడా యజమానులకు తెలియజేశాము. అయినా వినకుండా జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
ఈసారి గ్రామపంచా యతీకి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. శ్రీ సోమేశ్వరం పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. లేనియెడల సంబంధిత యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మత్స్య పారిశ్రామిక ఉపాధ్యక్షులు పూల బాలయ్య, కార్యవర్గ సభ్యులు గుర్రాల సతీష్‌, సందమోని శ్రీనివాస్‌, గుర్రాల గణేష్‌ , పూల సత్తయ్య, పెద్దబోయిన ఆంజనేయులు, చిలుక రవి, సోమారం బాలకృష్ణ, సోమారం నర్సింహ, దొంతి రాములు, సోమారం అంజనేయులు, పూల నర్సింహ, సోమారం బాలకిష్టి, పూల మహేష్‌, పూల భాను ప్రకాష్‌, బడే రాజు, పూల శేఖర్‌, పూల మహేష్‌, పూల సాయి కుమార్‌, పూల ఆనంద్‌, పూల శివశంకర్‌, పూల ప్రసాద్‌, పూల మల్లేష్‌, పూల భరత్‌, దొంతి భాస్కర్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు