Thursday, September 19, 2024
spot_img

తొమ్మిది వేల మందికి శస్త్ర చికిత్స..

తప్పక చదవండి
  • 3 లక్షల మందికి వైద్య సేవ
  • బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి : అరుంధతీ ఆసుపత్రి ప్రజల ఆరోగ్యానికి భరోసా అని మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ అన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన మాతృమూర్తి పేరిట నిర్వహించబడుతున్న మర్రి అరుంధతి ఆసుపత్రిలో సుమారు 9 వేయ్యిల మందికి శస్త్ర చికిత్సలు,సుమారు 3 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించామని ఫౌండేషన్ నిర్వాహకులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఇటీవల అరుంధతీ ఆసుపత్రి లో మల్కాజిగిరి సర్కిల్ జర్నలిస్ట్ ప్రియాంక అనారోగ్యం కారణంగా గైనిక్ సమస్యతో అరుంధతీ ఆసుపత్రిలో చేరడం జరిగింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అని ప్రియాంక కు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం ప్రియాంక సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా ప్రియాంక మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.తాన ఆపరేషన్ కు సుమారు 1.25 లక్షలు కర్చు అవుతుందని వేరే ఆసుపత్రిలో చెప్పడంతో అరుంధతీ హాస్పిటల్ ఉచితంగా అందిస్తున్న సేవలను వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది సేవ భావనతో ఉన్నారని ప్రశంసించారు.ఈ సందర్భంగా ప్రియాంక మర్రి రాజశేఖర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు