No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశావని ఇప్పుడి నవరత్నాలు..

తప్పక చదవండి
  • రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నవరత్నాలు గుర్తు రాలేదా..
  • మా ప్రజా మేనిఫెస్టోకు వణికిపోయి కొత్త నాటకం షురూ..
  • నీ నవరత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు…
  • నువ్వు ఎంత మభ్యపెట్టిన నిన్ను ఇంటికి పరిమితం చేస్తారు..
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ధ్వజమెత్తిన నీలం మధు ముదిరాజ్…
  • పాదయాత్రకు అద్భుత స్పందన..
  • సర్వమతాలు ఆదరిస్తున్నాయి..
  • ప్రజలంతా కన్న బిడ్డలా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు…
  • ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి…
  • నియోజకవర్గ రూపురేఖలు మార్చుకుందాం..
  • మన ఓటు మనమే వేసుకుందాం మన అభివృద్ధి మనమే చేసుకుందాం…
    నీలం మధు ముదిరాజ్…
  • గుమ్మడిదల మండల కేంద్రంలో రెండో రోజు కొనసాగిన పాదయాత్ర..

తొమ్మిదేళ్ల పాలనలో పటాన్ చెరు నియోజకవర్గానికి ఈ నవరత్నాలు గుర్తుకు రాలేదా, ఇప్పుడు నవరత్నాలు మేనిఫెస్టో పేరుతో కొత్త డ్రామా షురూ చేశావని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ ప్రశ్నించారు.

హైదరాబాద్ : రెండవ రోజు “మీ కొడుకు మీ గుమ్మంలో” పాదయాత్రలో భాగంగా గుమ్మడిదల మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు ఘన స్వాగతం పలికి తమ బిడ్డలా ఆదరించారు. తమ గ్రామాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను నీలం మధు దృష్ఠికి తీసుకుని వచ్చారు. పాదయాత్రలో భాగంగా నీలం మధు ముదిరాజ్ ఉదయం గుమ్మడిదలలో గ్రామస్తులు తన అనుచరులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో కలిసి అల్పాహారం చేస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మన కుటుంబ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మన అభివృద్ధిని మనమే నిర్వహించుకుందామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

అనంతరం పాదయాత్రలో స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలు పటాన్ చెరు ఎమ్మెల్యేగా పని చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేంటో చెప్పాలన్నారు. గత పదేండ్లుగా చెయ్యని పనులను ఇప్పుడు చేస్తానని నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. తాము ప్రవేశపెట్టిన ప్రజా మేనిఫెస్టో లోని ఐదు అంశాలతో తన సీటు గల్లంతయితుందని వణికిపోయి అప్పటికప్పుడు నవరత్నాలు ప్రకటించాడని విమర్శించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓట్ల కోసం ఎన్ని బూటకపు మాటలు చెప్పిన మభ్యపెట్టిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వివరించారు. తొమ్మిదేళ్లగా పదవి అహంకారంతో క్రింది స్థాయి నాయకులను ప్రజలను అవమానించిన తీరును నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలెవ్వరు మర్చిపోలేదని, ఈ ఎన్నికల్లో నీకు సరైన గుణపాఠం చెప్పి నిన్ను ఇంటికె పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.

అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు స్పష్టంగా ఆత్మ గౌరవ పోరాటానికి అండగా నిలబడి వారి ఇంట్లో బిడ్డనైన నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించడానికి డిసైడ్ అయ్యారని ధీమా వ్యక్తం చేశారు.మా ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా చేపట్టిన పాదయాత్రకు సర్వ మతాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, ప్రజలంతా స్వచ్ఛందంగా తనకు మద్దతిస్తూ గడపగడప లో నన్ను తమ కన్నబిడ్డగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆత్మగౌరవ పోరాటంలో ప్రజలంతా తన పక్షాన నిలబడి ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో బిడ్డగా మీ ముందుకు వస్తున్న మీ నీలం మధు మీ ఆశీర్వాదంతో గెలుపొందిన వెంటనే మన అభివృద్ధి మనమే చేసుకుందామని నియోజకవర్గ రూపురేఖల్ని పూర్తిగా మార్చుకొని ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు