Friday, September 20, 2024
spot_img

మరోమారు తెలంగాణలో ప్రచారానికి మోడీ

తప్పక చదవండి
  • మూడ్రోజుల పాటు ప్రచారం చేయనున్న ప్రధాని

హైదరాబాద్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. మూడు రోజులు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈనెల 24న నిర్మల్‌.. 25న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎన్నికల బహిరంగసభలలో ప్రధాని పాల్గొంటారని వివరించారు. చివరగా 27వ తేదీన కరీంనగర్‌ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారని భాజపా నేతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మూడు రోజులు, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా 5 రోజులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ మూడు రోజులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 17వ తేదీన భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో భాజపా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలిసింది. దీన్ని పార్టీ అధ్యక్షుడు లేదా కేంద్రంలోని కీలక మంత్రి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌లు రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఈనెల 19 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు